మీ నిజగుణమైన సత్యతకు తిరిగి వెళ్లడం

మీ నిజగుణమైన సత్యతకు తిరిగి వెళ్లడం

సత్యమే మన నిజ గుణం, అయితే మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అప్పుడప్పుడు అబద్ధం చెబుతాం. ఆసక్తికరమైన విషయమేమిటంటే, మనం అబద్ధం మాట్లాడే ప్రతిసారీ, మనకు అసౌకర్యం కలుగుతుంది, సత్య స్వరూపానికి వ్యతిరేకంగా ఉంటున్నాము అని మన అంతరాత్మ ఎదురు చెప్తుంది.  నిజాన్ని దాచడానికి మనం ఏమి చేసినా గాని , సత్యత ఎప్పుడూ దాగి ఉండజాలదు మరియు సత్యత విజయం పొందుతుంది. సత్యఅంటే మనతో మనం మరియు ప్రపంచానికి ప్రామాణికంగా ఉండడం. అబద్ధం చెప్పడం పాపమని మనకు  ఎప్పుడూ   బోధించబడుతూ ఉంటుంది. అయినప్పటికీ, మన  దారిలోకి తీసుకురావడానికి, ఇబ్బందులను నివారించడం లేదా ఎవరినైనా సంతోషపెట్టడం కోసం, మీరు అబద్ధాన్ని ఉపయోగిస్తున్నారా? మరియు అవి ప్రమాదకరం కాదని మీరు నమ్ముతున్నారా? నిజం మాట్లాడటం నుండి తప్పుడు కథనాన్ని సృష్టించడం వరకు, మనలో చాలా మంది ఎప్పటికప్పుడు తమ సత్యతకు దూరమైపోయాము. సత్యమరియు నిజాయితీ మన వాస్తవిక గుణాలు. ప్రతి అబద్ధం మనలోని శక్తిని క్షీణింపజేసి అబద్ధాన్ని అలవాటు చేస్తుంది. ప్రతి సందర్భంలోనూ నిజాలు మాట్లాడే ధైర్యం మనకు ఉండాలి. సత్యం తాత్కాలికంగా కఠినం అనిపించినా మనకు దీర్ఘకాలిక ప్రయోజనాలను తెస్తుంది. వ్యక్తిని సంతోషపెట్టడానికి అబద్ధం చెప్పడం కంటే నిజాయితీగా అభిప్రాయాన్ని పంచుకోవడం మంచిది. మనం నిజాయితీగా ఉన్నప్పుడు, మనకు విశ్వసనీయతను మరియు మన సంబంధాలకు బలాన్ని జోడిస్తాము.

మీరు నిజాయితీ గల వ్యక్తి అని ప్రతిరోజూ గుర్తు చేసుకోండి. ప్రతి సందర్భంలోనూ మరియు అందరితోనూ నిజం మాట్లాడటం మీకు సహజంగా రావాలి. మీ మనస్సును స్వచ్చంగా ఉంచుకోండి. సత్యమరియు సమగ్రత యొక్క చట్టాన్ని విశ్వసించండి. మీ ఉద్దేశాలు, ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తనలు పూర్తిగా నిజాయితీగా ఉండాలి. మీ చర్యలు మీ అసలు స్వభావాన్ని సూచిస్తాయి. మీ సంబంధాలు, పరస్పర చర్యలు మరియు లావాదేవీలను సత్యత ఆధారంగా చేసుకోండి. దేనికీ భయపడవద్దు, దేనినీ దాచవద్దు మరియు వాస్తవాలను తప్పుగా సూచించవద్దు. సత్యమే విజయం, సత్యమే శక్తి మరియు అది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. ఇది స్పష్టతను ప్రోత్సహిస్తుంది మరియు ఇతరులను సత్యత వైపు ప్రేరేపిస్తుంది. ప్రామాణికంగా ఉండటం జీవితంలోని ప్రతి అంశాన్ని సులభతరం చేస్తుంది. ఒక్కోసారి నిజం మాట్లాడటం కష్టంగా అనిపించినా, అబద్ధం చెప్పకండి, నిజం చెప్పండి కానీ నిరూపించాల్సిన అవసరం లేదు. అవతలి వ్యక్తి మీకు అబద్ధం చెప్పినా, నిజం మాట్లాడండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కానీ మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి శక్తిని వృధా చేసుకోకండి. సత్యాన్ని బహిర్గతం చేయవలసిన అవసరం లేదు, దానిని బహిర్గతం చేసే శక్తి దానికి ఉంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు

30th May – జీవన విలువలు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు నేను, నా నుదుటి మధ్యలో కూర్చున్న ఆధ్యాత్మిక నక్షత్రం… నేను శాంతి యొక్క సుందర  గుణాన్ని అనుభూతి చేస్తూ నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ మరియు ప్రతిదానికీ

Read More »
వర్క్-లైఫ్ (work -life)ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం

29th May – జీవన విలువలు

వర్క్-లైఫ్ ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం మన వర్క్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అనే విషయం అంగీకరించే విషయమే. కానీ కొన్నిసార్లు మనము వర్క్  కు   మిగతా వాటికన్నా ఎక్కువ

Read More »
మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్

28th May – జీవన విలువలు

మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్ ఆలోచనలు మన భాగ్యాన్ని సృష్టిస్తాయి. కాబట్టి మనం ఒక్క తప్పుడు ఆలోచన కూడా చేయకూడదు. సరైన ఆలోచనా సరళితో మనస్సును ప్రోగ్రామ్ చేయడానికి, మనం ప్రతి గంట తర్వాత

Read More »