Hin

16th april soul sustenance telugu

నెగిటివ్ పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

3 – తీర్మానం దిశగా పాజిటివ్ అడుగులు వేయడం – మూడవ మరియు చాలా ముఖ్యమైన దశ, పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో పాజిటివ్ గా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం పాజిటివ్ గా ఆలోచించి భగవంతుడిని స్మరించుకుంటే పరిస్థితి దానంతటదే పరిష్కరించబడుతుందని అనుకుంటాము. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడంలో జరిగిన ఏదైనా ఆలస్యం పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు మరియు పరిస్థితి పూర్తిగా మన చేతుల్లో నుండి చేజారిపోవచ్చు. కాబట్టి, మన స్వంత మరియు మనం భగవంతుడి నుండి తీసుకునే పాజిటివ్ శక్తిని మన మనస్సు నుండి పరిస్థితికి ప్రసరింపజేయాలి. పరిస్థితి గురించి ఇతరులతో చర్చించి వెంటనే ఏమి చేయాలో కూడా ఆలోచించాలి. మనము పరిస్థితిని బట్టి ప్రవర్తిస్తున్నప్పుడు, భగవంతుని సన్నిధి మనకు దగ్గరగా ఉన్నట్లు అనుభూతి చేస్తూ వివేకంతో నిండిన వారి దివ్య బుద్ధి నుండి వారు మనకు ఏమి తెలియజేస్తున్నారో గ్రహించాలి. ఇతరులతో మాట్లాడటం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదవడం కూడా మంచిది మరియు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే భగవంతుడు కొన్నిసార్లు మనకు ఇతరుల ద్వారా మరియు మనం చదివే లేదా వినే తన జ్ఞానం ద్వారా మనకు మనం ఆశించని మార్గనిర్దేశం చేసి పరిస్థితులు వెంటనే పరిష్కారిస్తారు. 

చివరగా, అడుగులు వేసేటప్పుడు, మిమ్మల్ని మీరు ఓర్పుతో ఉంచుకోండి మరియు మీరు తీసుకునే తీర్మానం వైపు మీరు నడుస్తున్నప్పుడు, తీర్మానం యొక్క పురోగతి ఆధారంగా భగవంతుడు మీకు మార్గనిర్దేశం చేసి సమస్య పరిష్కారానికి మిమ్మల్ని తీసుకెళ్తారని గుర్తుంచుకోండి. మనమే తీర్మానం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే, భగవంతుడు కూడా మనలను సరిగ్గా మార్గనిర్దేశం చేయలేడు, ఎందుకంటే మనం వారిపై ఎక్కువగా ఆధారపడి మనం ఏమీ చేయకుండానే ప్రతిదీ పూర్తిగా ఆయనకు వదిలివేస్తాము. మీరు దృఢ నిశ్చయంతో కూడిన తీర్మానం యొక్క ఒక్క అడుగు వేస్తే, నేను మీకు వెయ్యి రెట్లు సహాయం చేస్తానని భగవంతుడు చెప్పారు. కానీ మనం ఆ ఒక్క అడుగు వేయకపోతే, భగవంతుడు కూడా పరిస్థితి నుండి అతీతం అయిపోయి మనం ఆశించినంతగా అతని సహాయం పొందలేము. మరోవైపు, భగవంతుడి సహాయం అద్భుతాలను చేస్తుంది మరియు పరిస్థితి కనిపించినంత పెద్దది కాదని మనకు అనిపిస్తుంది. కానీ మనం పరిస్థితిని సరిదిద్దడానికి మన వంతు కృషి  చేయడంలో చురుకుగా చేయాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »
27th april 2025 soul sustenance telugu

మీ సంతోషాల గురించి మాట్లాడండి, బాధల గురించి కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో ఎన్ని మంచి విషయాలు జరిగినా, మంచి మరియు సానుకూల విషయాలకు బదులుగా మన ఆరోగ్యం, ఆర్థిక, సంబంధాలు మరియు

Read More »