ప్రతి రోజు పర్ఫెక్ట్ రోజు

ప్రతి రోజు పర్ఫెక్ట్ రోజు

మీ రోజు ఎలా గడిచింది? మీ చుట్టూ జరుగుతున్న దాని బట్టి , మీరు అనుకున్నవి  జరుగుతున్న దాని బట్టి,  వ్యక్తులు మీతో ప్రవర్తించిన దాని బట్టి మీ శాంతి మరియు సంతోషం ఆధారపడ్డాయా? మనం ఇవన్నీ ప్రశ్నించుకుంటూ, మన ఎమోషన్స్ కంట్రోల్ ను బయటి పరిస్థితులపై   ఉంచుకుంటూ ఉంటే, మనం రోజురోజుకూ బలహీనంగా మారతాము. ప్రతి ఒక్కటి మనం అనుకున్నట్లుగా ఉండాలనే ఆశతో మేల్కొంటాము మరియు ఊహించని దృశ్యం జరిగిన ప్రతిసారీ కలత చెందుతాము. రోజులోని ప్రతి సన్నివేశానికి ఎలా స్పందించాలో మనకు ఛాయస్ ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఒకే పరిస్థితికి భిన్నమైన ప్రతిస్పందనలను ఎంచుకుంటారు. కొన్నిసార్లు అదే పరిస్థితికి మన ప్రతిస్పందన భిన్నంగా ఉంటుంది. మనం మంచి మూడ్‌లో ఉన్నట్లయితే మనం ప్రశాంతంగా ఉండాలని ఎంచుకుంటాము, లేకుంటే మనం సులభంగా డిస్టర్బ్ అవుతాము. మంచి లేదా చెడు రోజులు అనేమీ ఉండవు. ఇదంతా మనం ఎలా ఆలోచిస్తామో మరియు ఎలా స్పందిస్తామో దానిపై ఆధారపడి ఉంటుంది. మనకి మనం గుర్తుచేసుకుందాం – నా పరిస్థితి మరియు మానసిక స్థితి కనెక్ట్ అయ్యి ఉండవు. ఈరోజు ఏది జరిగినా సరే, సరిగ్గా ఆలోచించి, పర్ఫెక్ట్ రోజు గా చేసుకుంటాను.

మనమందరం మన రోజు ఎలా సాగాలి అనే దాని గురించి మనసులో ఒక అందమైన స్క్రిప్ట్ ను వ్రాసుకుంటాము. ఎక్కువ రోజులలో మనం కోరుకున్నట్లే జరుగుతాయి. కానీ పరిస్థితులు మన ప్లాన్ నుండి వేరుగా జరిగిన రోజుల్లో, నేనే ఎందుకు అని మనం అడుగుతాము? నాకే ఇలా జరగటానికి నేను ఏమి చేసాను? జరిగే ప్రతిదీ ఖచ్చితమైనది మరియు ఉద్దేశించబడింది. విషయాల పట్ల దృష్టికోణాన్ని మార్చుకోవాల్సింది మనమే. ఈరోజు జరిగే వాటిని అంగీకరించడానికి మరియు ఆ ఫ్లో తో  మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ఒక రోజులో చాలా జరగవచ్చు. ఏదైనా మంచి జరగటం లేదని అనిపించినప్పుడు కూడా మనం పాజిటివ్ గా ఉండాలి. ఒక క్షణం ఆహ్లాదకరంగా లేకపోయినా, తదుపరి క్షణాన్ని మెరుగుపరచడానికి మనము తక్షణ చర్యలు తీసుకోవాలి. సరిగ్గా జరగని వాటిపై దృష్టి పెట్టడానికి బదులుగా, మీరు ఏమి నియంత్రించగలరు మరియు మీరు పరిస్థితులను ఎలా ప్రభావితం చేస్తారు అనే దానిపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. మీరు పట్టించుకోని మంచి క్షణాలను గమనించడానికి కూడా మీరు పాజ్ చేస్తారు

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »