ఇతరుల స్క్రిప్ట్‌ను రాసే ప్రతికూల అలవాటు
జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలను పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్‌ను వ్రాసుకొని నటించాలని కోరుతుంది. కానీ, తరచూ మనం మన స్క్రిప్ట్‌లకు సమయాన్ని వెచ్చించము. బదులుగా మనం మనసులో
మీరు రోజువారీ దినచర్యలోకి అడుగుపెట్టినప్పుడల్లా, మీ మనసుకు పాజిటివ్ ఆలోచనలను ఇవ్వండి. ఆ పాజిటివ్ ఆలోచనలు మీ మనసును పవిత్ర చేతనం మరియు ఇతరుల పట్ల పవిత్ర దృక్పథం వైపు మళ్లిస్తుంది. స్వచ్ఛత ఆత్మ యొక్క అసలైన సంస్కారమని మరియు స్వచ్ఛత ఉన్నచోట మన చేతన మనసులో శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తి ఉంటాయని మనందరికీ తెలుసు. అలాగే, చేతన మనసు ఎమోషన్స్ కు, కోపం, అహం, అసూయ, ద్వేషం, వంటి ఇతర దుర్గుణాలకు, అలాగే గతం లేదా భవిష్యత్తు గురించి లేదా ఇతరుల గురించి అనవసరమైన ఆలోచనలకు చోటు కానే కాదు .
కనుక, మనం మన రోజువారీ పనిని ప్రారంభించకముందే ఏదైనా పాజిటివ్ గా చదవాలి. దాని వలన మన మనసు మిగిలిన రోజంతా పాజిటివిటీతో నిండి ఉంటుంది . ఈ వివేకవంతమైన జ్ఞానం లేదా ఆధ్యాత్మిక జ్ఞానం లేదా మనసును పాజిటివ్ గా ఉంచడం కోసం ప్రాక్టికల్ చిట్కాలను ఉదయాన్నే చదవడం మీ ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. తద్వారా మీరు మానసికంగా తాజాగా మరియు శక్తివంతంగా ఉంటారు . మరోవైపు, ఖాళీ మనసు అనగా పాజిటివ్ ఆలోచనలతో లేని మనసు కార్యాలయంలో లేదా మీ కుటుంబంలో వివిధ వ్యక్తుల యొక్క విభిన్న స్వభావాల ప్రభావంలోకి సులభంగా వస్తుంది . అలాగే రోజులోని ఎదురయ్యే ఒడిదుడుకుల ప్రభావంలోకి సులభంగా వస్తుంది .అందువలన ఆధ్యాత్మిక జ్ఞానం చదివే వ్యక్తి నిరంతరం ఉత్సాహంగా మరియు శక్తితో నిండి ఉంటాడు, సంతృప్తిని ప్రసరింపచేస్తాడు, జీవితంలోని విభిన్న పరిస్థితుల గురించి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ఉంటాడు. అలాగే, ఆరోగ్యవంతమైన శరీరానికి ఆహారం, విశ్రాంతి మరియు వ్యాయామం ఎంత కీలకమో అదే విధంగా, తనను తాను ఆత్మగా భావిస్తూ బుద్ధి నేత్రంతో, మీ ఆత్మిక తండ్రి అయిన , పరమాత్మ లేదా భగవంతుడితో కనెక్ట్ అయ్యి వారి ఆత్మిక శక్తి మరియు పాజిటివిటీతో మిమ్మల్ని మీరు నింపుకోవడం ఒక వ్యాయామం లాంటిది. ఆలోచనా శక్తి మరియు విజువలైజేషన్ శక్తితో భగవంతునితో కనెక్ట్ అయ్యే వ్యాయామం ఆత్మకు చాలా బలాన్ని ఇస్తుంది. అలాగే, పాజిటివ్ ఆలోచనలు లేదా జ్ఞానం ఆత్మకు ఆహారం మరియు విశ్రాంతి వంటివి. ప్రతి గంట వ్యవధిలో చేసే ఈ వ్యాయామం ఆత్మకు శాంతి యొక్క అనుభవం చేయిస్తుంది మరియు రోజంతా పరమాత్ముని ప్రేమలో జోడిస్తుంది. భగవంతుడు సదా మనతో ఉంటూ ప్రతి ఆత్మకు శుభభావనలు ప్రసరింపజేస్తూ వారిలో భగవంతుని స్వచ్ఛమైన ప్రేమతో కట్టివేసే విధానం బోధిస్తాడు. కాబట్టి, మనం మన పనులు చేస్తూ భగవంతుని తోడును ఆస్వాదిస్తూ, వారి నుండి స్వీకరించిన ఆ ప్రేమ యొక్క వైబ్రేషన్స్ ఇతరులకు ఇవ్వడం ద్వారా ఆత్మకు చాలా శాంతి, విశ్రాంతి మరియు పరిపూర్ణత లభిస్తుంది. ఎందుకంటే మీరు భగవంతుని ప్రేమను పంచుకున్న వారి నుండి ప్రతిఫలంగా చాలా ఆశీర్వాదాలను పొందుతారు.
(రేపు కొనసాగుతుంది…)
జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలను పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్‌ను వ్రాసుకొని నటించాలని కోరుతుంది. కానీ, తరచూ మనం మన స్క్రిప్ట్‌లకు సమయాన్ని వెచ్చించము. బదులుగా మనం మనసులో
ప్రతిరోజూ మీ మనస్సులో భగవంతుని జ్ఞానంపై దృష్టి పెట్టండి – ప్రతిరోజూ భగవంతుడు మనతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకుంటారు. దానిని చదివి మనం మన డైరీలు మరియు హృదయాలలో నోట్ చేసుకుంటాము. వ్రాసుకున్న తరువాత,
వ్యక్తుల ప్రవర్తన లేదా జీవిత సమస్యల గురించి ప్రతికూల భావంతో మాట్లాడకూడదని, తీర్పు చెప్పేలా, విమర్శనాత్మకంగా లేదా వారి బలహీనతను పేర్కొనకూడదని మనం అభ్యాసం చేస్తాము. అలాగే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చదివే
Start your day with a breeze of positivity and stay motivated with these daily affirmations
After Clicking on Join, You will be redirected to Whatsapp Community to receive daily message. Your identitiy will be secured and no group member will know about another group member who have joined.