Soul sustenance 16th january telugu

మీ దృష్టిని నిష్పక్షపాతంగా మరియు ప్రతి ఒక్కరిని ఆత్మికంగా మార్చండి

గౌరవం మరియు వినయం వంటి మీ నిజ గుణాల ద్వారా వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి. మీ గుణాలు మీ స్వంతం. ప్రతి ఒక్కరితో, ప్రతి పరిస్థితిలో మరియు ప్రతిసారీ వాటిని ఉపయోగించండి. మీరు ఒకరితో మర్యాదగా మరియు మరొకరితో అహంభావంతో ఉంటే లేదా మీ ప్రవర్తన ఇతరులు మీతో ప్రవర్తించే దానిని బట్టి ఉంటే , మీ ఉన్నతమైన వ్యక్తిత్వం తగ్గి పోతుంది. మీ చుట్టూ ఎవరూ సరిగ్గా లేకపోయినా, మీ గుణాల నుండి మీరు దూరం కాకండి. ఎవరిపైనైనా పక్షపాతం చూపించినట్లు అయితే మన స్వంత నమ్మకాలు మరియు వాస్తవికత మధ్య అడ్డంకులు ఏర్పడతాయి . కొన్నిసార్లు మనం ఒకరి కంటే మరొకరిని ఎందుకు ఇష్టపడతామో, ఏదైనా స్థలాన్ని ఎందుకు ఇష్టపడమో, లేదా ఒక బ్రాండ్‌ను ఎందుకు తిరస్కరిస్తామో మనం చెప్పలేము. మనం ఎంత పక్షపాతంతో ఉంటామో, అంత అసమంజసంగా ఉంటాం.

    • మీ స్వరూపం, స్థానం, సంస్కృతి, జాతీయత, మతం – మీరు తెచ్చిపెట్టుకున్నవి, మీరు అవి కాదు. కాబట్టి వ్యక్తులతో వారి పాత్రను బట్టి , స్థానాన్ని బట్టి కనెక్ట్ అవ్వకండి. ఇది పక్షపాతానికి దారితీస్తుంది. ఆధిక్యత లేదా న్యూనత యొక్క భవాలను సృష్టిస్తుంది.
    • మీ మనసు ఎవరికోసమో లేదా దేనికోసమో సరిగ్గా ఆలోచించకపోతే, మీరు సామాజిక ఒత్తిడి లేదా ఇతరుల ఆమోదం కారణంగా పక్షపాతంతో ఉన్నారేమో అని చెక్ చేసుకొండి. నమ్మకాన్ని సరిదిద్దుకోండి మరియు మీ అభిప్రాయాన్ని మార్చుకోండి.
    • మీరు పవిత్రమైన ఆత్మ అని, మరొక పవిత్రమైన ఆత్మతో మాట్లాడుతున్నారని మీకు మీరు గుర్తు చేసుకోండి. మర్యాదను ఇచ్చి పుచ్చుకుంటూ పాత్రల ప్రకారం సామాజిక నియమాలను అనుసరించండి . మనము వ్యక్తిని గౌరవించాలి. ఇది వ్యక్తుల పాత్రలు, విశ్వాసం, జాతీయత లేదా మరే ఇతర అంశాల ప్రకారం మారకూడదు.
    • స్వచ్ఛమైన మనస్సుతో వ్యక్తులను కలవండి, వారి గురించి మీరు కలిగి ఉన్న గత ప్రభావాలను తొలగించండి. కొత్త ఆలోచనా విధానం మరియు కొత్త ప్రవర్తనతో వారిని చూడండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

లక్ష్య సాధన ప్రయాణంలో సంతోషం పొందడం

10th Jun – జీవన విలువలు

లక్ష్య సాధన ప్రయాణంలో సంతోషం పొందడం మనమందరం, ఏదో ఒక సమయంలో, వాస్తవానికి మన జీవితంలో దాదాపుగా, వివిధ రకాల దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక లక్ష్యాలను కలిగి ఉంటాము – వ్యక్తిగత లక్ష్యాలు, వృత్తిపరమైన,

Read More »
మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 4)

9th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 4) గాలి శుద్దీకరణ – గాలి మన చుట్టూ నిరంతరం ఉంటుంది మరియు మనం దానిని ఎల్లప్పుడూ  పీల్చుకుంటాము. భౌతిక

Read More »
మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 3)

8th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 3) నీటి శుద్దీకరణ – మనం త్రాగే నీటిని శుద్ధి చేయడం కోసం, మనం భౌతిక మార్గాలను మాత్రమే కాకుండా,

Read More »