Hin

స్వయాన్ని తెలుసుకునేందుకు ఒక కార్-డ్రైవర్ యొక్క ఉదాహరణ (పార్ట్ 2)

స్వయాన్ని తెలుసుకునేందుకు ఒక కార్-డ్రైవర్ యొక్క ఉదాహరణ (పార్ట్ 2)

ఒక మంచి డ్రైవర్, కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అతనికి ఎదురయ్యే నెగిటివ్ మరియు కలవరపెట్టే సన్నివేశాల వలన పరధ్యానంలో ఉండి, అతని దృష్టిని అనేక దిశల్లోకి లాగితే, అతను ప్రయాణాన్ని సురక్షితంగా లేకుండా చేస్తాడు, ప్రమాదాలు సంభవించే అవకాశాలను పెంచుతాడు. అదే సూత్రాలను ఆత్మకు మరియు శరీరానికి వర్తింపజేస్తే, జీవిత ప్రయాణంలో ప్రయాణిస్తున్నప్పుడు, నాకు పనికిరాని దృశ్యాల వలన నేను పరధ్యానంలో వెళ్ళకుండా జాగ్రత్త వహించాలి ఉదా. నేను దారిలో చుట్టూ ఉన్న అన్ని చిత్రాలు, దృశ్యాలు, సమాచారాన్ని అన్నింటినీ చూడాల్సిన అవసరం లేదు, చూస్తూ ఉంటే నేను ప్రమాదంలో పడవచ్చు. నా చెవుల ద్వారా వింటున్న అన్ని మాటలను, ఇతరులు మాట్లాడే అన్ని మాటలు వినాల్సిన అవసరం లేదు, వింటూ ఉంటే  నేను ప్రమాదంలో పడవచ్చు. నాకు ఉపయోగపడే వాటిని నేను ఎంచుకోవచ్చు, అపసవ్య, నెగెటివ్ మరియు హానికరమైన చిత్రాలు, పదాలు మరియు ప్రవర్తనలను గ్రహించాల్సిన అవసరం లేదు. ఒక డ్రైవర్ లాగా, నేను పరిస్థితులను చూసి అర్థం చేసుకుని మరియు నా కళ్ళు మరియు చెవులు తెరిచి ఉంచుతాను. చుట్టూ ఉన్న పరిస్థితులను పూర్తిగా విస్మరించడం సురక్షితం కాదు, నేను వాటి గురించి జాగురూకతతో ఉండాలి. కానీ నేను వారిలోని పాజిటివ్ మాత్రమే చూస్తే నేను ఏకాగ్రతతో ఉంటాను మరియు ప్రయాణం చేస్తున్నప్పుడు నా అంతర్గత సంతృప్తి మరియు ఆనందం యొక్క అనుభవం నుండి మళ్ళించబడను.

నేను, ఆత్మ, ఈ వాహనానికి, శరీరానికి బాధ్యత వహించే డ్రైవర్‌గా, నేను ర్యాష్‌గా డ్రైవ్ చేయకుండా జాగ్రత్త వహించాలి, అంటే నా కళ్ళు, నా మాటలు మరియు నా చర్యల ద్వారా చేసే భావాలు మరియు వైఖరిని పర్యవేక్షించడం నేర్చుకుంటాను. తొందరపాటుతో డ్రైవింగ్ చేయడం అంటే నెగెటివ్ ఎనర్జీని  ప్రసరింప చేయడం. దీని వల్ల జీవిత మార్గంలో ఉన్న ఇతర ప్రయాణీకులకు హాని కలగవచ్చు. ఈ భావాలు మరియు వైఖరులు పాజిటివ్ గా, మాధుర్యం, స్వచ్ఛత మరియు గౌరవంతో నిండినప్పుడు, నా ప్రయాణం సజావుగా మరియు ఆనందదాయకంగా సాగేలా చేయడంలో సహాయపడుతుంది. నేను డ్రైవర్ అనే భావంతో అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్తగా డ్రైవ్ చేసినప్పుడు, నా చర్యలు నన్ను నా ఆధ్యాత్మిక సత్యానికి దగ్గరగా తీసుకువస్తాయి, నా పాజిటివిటీని నా చుట్టూ ఉన్న వారితో పంచుకోగలుగుతాను. నేను ఒక్క క్షణం అవగాహన కోల్పోయినా,  నా నుండి ఇతరులకు లేదా ఇతరుల నుండి నాకు ప్రమాదం ఉంటుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd june2024 soul sustenance telugu

మీ మనస్సు ఒక బిడ్డ వంటిది

మనస్సు మన బిడ్డలాంటిది. మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, మీలో ఉన్న ఈ బిడ్డ  శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దానిని ప్రేమించాలి, పాలన చేయాలి మరియు ఓదార్చాలి. మనుష్యులు తమ మనస్సుపై నియంత్రణ

Read More »
21st june2024 soul sustenance telugu

మనుష్యుల వైబ్రేషన్లను అనుభూతి చెందడం ప్రారంభించండి

మీరు ఎవరినైనా కలిసినప్పుడు, మీ దృష్టి ఎటు వెళుతుంది? ఒకటి: వారి రూపం మరియు వస్త్రాలు పై మీ దృష్టి వెళుతుంది. రెండు: వారి మాటలు మరియు చేతల పై దృష్టి వెళుతుంది. ఇపుడు

Read More »
20th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 4)

మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు సమతుల్య మనస్సును ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. కోపం, ఆవేశం, అహం లేదా దురాశ మన ఆలోచనలలో అసమతుల్యతను సృష్టించవచ్చు. మనల్ని మనం మనలాగే అనుభవం చేసుకున్నప్పుడు మరియు

Read More »