Hin

ఇతరుల సంతోషాన్ని సెలిబ్రేట్ చేసుకోండి

ఇతరుల సంతోషాన్ని సెలిబ్రేట్ చేసుకోండి

ఇతరులు మీ కంటే మెరుగ్గా పని చేస్తున్నప్పుడు, మీరు వారి పట్ల నిజాయితీగా సంతోషంగా ఉంటారా  లేదా పై పై సంతోషం ఉంటుందా లేదా మీరు ఇంకా గమ్యానికి చేరుకోలేదు అని అస్సలు సంతోషంగా ఉండరా?మనస్పూర్తిగా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, కానీ మీ మనస్సు వారి విజయం పట్ల మీ భావాలు విశ్లేషించడం ప్రారంభించిందా? ఎవరైనా పనిలో, చదువులో, కుటుంబంలో, వ్యక్తిత్వంలో లేదా ఆస్తులలో బాగా రాణించినపుడు, వారు మనకంటే మెరుగైన వారని కాదు. ఆ నిర్దిష్ట సమయంలో వారు మనకంటే ఎక్కువ సాధించారని అర్థం. దానికి వారిని అభినందిద్దాం. ప్రతి ఒక్కరూ ఈ జన్మ లేదా వారి గత జన్మలలోని వారి కర్మల ప్రకారం వారి కర్మ ఫలాన్ని , ఎక్కువ తక్కువలు కాకుండా పొందుతారు. ఇతరుల సంతోషం చూసి మనం  సంతోషంగా ఉండటం అంటే మనం మనతో సంతోషంగా ఉన్నామని అర్థం. అది మన అహం, అసూయ లేదా అభద్రత వంటి బలహీనతలను కూడా అంతం చేస్తుంది. మనం ఇతరులను పోటీదారులుగా చూడకపోతే, వారు మనకు సహకరిస్తారు. బాగా రాణించిన ప్రతి ఒక్కరికీ కోసం, ప్రశంసించబడిన ప్రతి ఒక్కరికీ కోసం నేను సంతోషంగా ఉన్నానని మనకి మనం గుర్తు చేసుకుందాం. నా కంటే ఎక్కువగా సాధించిన వ్యక్తులు నేను  బాగా రాణించడానికి ప్రేరేణగా మారుతున్నారు. నేను వారిని అభినందిస్తున్నాను, నేను వారి విజయాలను సెలిబ్రేట్ చేసుకుంటాను, నేను వారి ఆనందానికి ఆనందిస్తున్నాను. దీనినే పెద్ద మనసు కలిగి ఉండడం అంటారు. 

ఇతరులు కొత్త కారు లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేసినప్పుడు, మనం మంచిగా భావిస్తునామా లేదా ఈర్ష్యగా భావిస్తున్నామా అని లోలోపల మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అది  మన అసూయను  బయటకు తీసుకురావచ్చు కానీ ఇతరుల సంతోషాన్ని చూసి మనం సంతోషించడం మన పరిపక్వతను మరియు బలాన్ని సూచిస్తుంది. వారిని అభినందించడమే మనలో ఉన్న అసూయ మరియు అహం యొక్క విధ్వంసక ఆలోచనలను ఓడించడానికి సులభమైన మార్గం. మీరు ఎలా భావిస్తున్నారో అర్ధం చేసుకోవడానికి మరియు మరొక వ్యక్తి కోసం హృదయపూర్వక ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఈ క్షణం ఉపయోగించండి. మీ జీవిత దృక్పథాన్ని మళ్లీ రూపొందించుకోండి. మీ వద్ద ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండండి మరియు ఇతరులు సాధించిన దానికి నిజమైన సంతోషంతో ఉండండి.  మీ మనస్సు జీవితంలో బాగా జరుగుతున్న ప్రతిదానికీ తెరుచుకుంటుంది. మీరు వ్యక్తుల విజయాలను స్వయాన్ని శక్తిలేని వారిగా భావించడం మానేస్తారు. బదులుగా మీరు మీ ఆత్మ గౌరవానికి  ప్రాముక్యను ఇస్తారు. సంతోషంగా ఉన్న వ్యక్తులను ద్వేషించడం కంటే సహకరించడం మీ ఆరోగ్యం, మీ సంబంధాలు మరియు మీ వృత్తిని మెరుగుపరుస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

7th dec 2024 soul sustenance telugu

పాత్ర-ప్రేరేపిత ఒత్తిడిని నివారించండి – ఇది ఒక పాత్ర మాత్రమే

చాలా పాత్రలు పోషించవలసి ఉన్నందున, మనం ఒత్తిడిని సహజంగా అంగీకరించాము. పాత్ర అభిమానం మన పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన పాత్రలు, సంబంధాలు మరియు పదవుల

Read More »
6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »