16th march soul sustenance telugu

బ్రహ్మకుమారీస్ సంస్థలో బోధించే జ్ఞానము ఎవరు ఇస్తున్నారు? (భాగం 4)

  1. చరిత్ర, భౌగోళము, విజ్ఞానము, ఆధ్యాత్మికత – అంశం ఏదైనా దాని గురించి ప్రస్తుత ప్రపంచంలో ఉన్న నమ్మకాలు అన్నీ మానవ అవగాహనపై ఆధారితమైనవే. ఆవిష్కరణ, చింతన, పరిశోధన మరియు అనుభవాల ఆధారంగా ఆ ఫలానా నమ్మకం సత్యమైనదిగా అనిపిస్తుండవచ్చు,  అయినాకానీ మానవులకున్న అవగాహనకన్నా పరమాత్మకు మరింత స్పష్టమైన జ్ఞానము ఉంది, వారి వివేచన, వారి నిర్ణయాలు మానవులకన్నా ఎంతో స్పష్టంగా ఉంటాయి. మనుషులకైతే పరిధులు ఉంటాయి. దాని కారణంగా వారి వివేచన, నిర్ణయాలు పరిమితంగా ఉండవచ్చు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి – ఒక విషయం గురించి 100% అవగాహన లేకపోవడము, నమ్మకాలను సరైనవే అని నిరూపించడానికి చేసిన ఊహలు, వారి ఆలోచనా ధోరణి, స్వభావాలు, నమ్మకాలు, ప్రపంచం మరియు ఇతరుల ప్రభావం అన్నీ ప్రభావం చూపుతాయి.  అలాగే, పరమాత్మ చెప్పినట్లుగా, సృష్టి నాటక రంగంలో నాలుగు యుగాలు ఉంటాయి, అన్నీ కలిపి 5000 సంవత్సరాలు – సత్య యుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము మరియు కలియుగము. ప్రతి యుగం ఆయుష్షు 1250 సంవత్సరాలు. ఈ సృష్టిలో కొన్ని సమయాలలో, ముఖ్యంగా కలియుగ అంతిమము మరియు సత్యయుగ ప్రారంభ సమయంలో మరియు త్రేతాయుగ అంతిమము మరియు ద్వాపర యుగ ఆరంభంలో కొన్ని భౌతిక మార్పులు జరుగుతాయి, అభౌతికమైన ఆధ్యాత్మిక మార్పులు ఆత్మలో చోటు చేసుకుంటాయి. ఈ మార్పుల గురించి పరమాత్మకు మాత్రమే తెలుసు, వారే వీటిని వివరిస్తారు. మనుషులు ఒక నిర్ధారణకు వచ్చేటప్పుడు ఈ అంశాలనేవీ పరిగణలోకి తీసుకోలేదు, ఇందు కారణంగా ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్న అనేక నమ్మకాలు పరమాత్మ చెప్పిన వాటికి భిన్నంగా ఉన్నాయి.
  2. చివరగా, భగవంతుడు మనకు వివరించిన ప్రతి అంశము ఆధ్యాత్మికతపై ఆధారపడి ఉంటుంది, ఆత్మ జ్ఞానము, జననమరణాలు, కర్మ సిద్ధాంతం, సృష్టిపై పరమాత్మ పాత్ర – ఈ అంశాల ఆధారంగా ఉంటుంది. మరో ప్రక్క ప్రపంచంలో, ఆత్మ, పరమాత్మ, సృష్టి నాటకము, వీటికి సంబంధించిన జ్ఞానము మరియు వాస్తవాలను మనుషులు విస్మరించైనా ఉండాలి లేక వాస్తవం అస్పష్టంగా అయినా తెలిసి ఉండాలి. అన్నీ భౌతిక ప్రపంచానికి సంబంధించి ఉంటాయి అన్నది వారి అత్యుత్తమ సిద్ధాంతము, ఇది వాస్తవం కాదు. ఈ ఒక్క పొరపాటు కారణంగా ప్రపంచ దృక్పథం, బ్రహ్మకుమారీ సంస్థలో చెప్పే జ్ఞానం భిన్నంగా ఉన్నాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »