HI

ఆత్మ గౌరవం యొక్క 5 పాజిటివ్ మెట్లు ( పార్ట్-1)

ఆత్మ గౌరవం యొక్క 5 పాజిటివ్ మెట్లు ( పార్ట్-1)

జీవితంలోని ఏ పరిస్థితిలోనైనా మరియు ఏ రంగంలోనైనా విజయానికి అత్యంత ముఖ్యమైన శక్తులలో ఒకటి, చాలా శక్తివంతమైన మరియు పాజిటివ్ మానసిక స్థితి. ఆత్మ గౌరవం పాజిటివిటీ కి మొదటి మెట్టు. ఆత్మ పరిశీలనతో ఆత్మ గౌరవం వస్తుంది. భౌతికమైన గుర్తింపుతో  మనం తరచుగా సమాజంలో మన విభిన్న పాత్రలను పోషిస్తాము – భౌతిక శరీరం, భౌతిక పాత్ర, సంబంధాలు, సంపద, విద్య మరియు ఉద్యోగం వంటివి. మనము ఈ రకమైన గుర్తింపులను వాస్తవికత గా పరిగణిస్తాము, కానీ చాలాసార్లు ఈ అన్ని రంగాలలో మరియు జీవితంలోని అంశాలలో మార్పు సహజంగా ఉన్న  కారణంగా, మనకు ఆత్మ గౌరవం లేక , దాని ఫలితంగా మానసిక బలం లేదు. మనల్ని ఆంతరికంగా  బలపరిచే ఆత్మ పరిశీలన ఆధారంగా ఆత్మ గౌరవం యొక్క విభిన్న ఆధ్యాత్మిక అంశాలను ఈ సందేశంలో చూద్దాం. 

  1. నేను ఒక విజయీ ఆత్మను (victorious soul), నా విజయం గ్యారంటీ – ప్రతి ఉదయం, జీవితంలోని ప్రతి రంగంలో మీ విజయం గ్యారెంటీ అనే ఆత్మ గౌరవము యొక్క మొదటి సంకల్పాన్ని చెయ్యండి. ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ సంకల్పాన్ని రోజులో చాలాసార్లు రిపీట్ చేసుకోండి. ఇది మీ ప్రతి ఆలోచన, మాట మరియు కర్మలలో పాజిటివిటీ ని ఇంజెక్ట్ చేస్తుంది మరియు మీ పాత్రలో పాజిటివిటీ  కనిపిస్తుంది. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, సంపదను సంపాదించడంలో మరియు జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని సాధించడంలో కూడా మీకు వివిధ రకాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. మీ అంతః చేతన మనస్సులో ఈ పాజిటివ్ ఆలోచనను మీరు ఎంత ఎక్కువగా అనుభవం చేసుకుంటూ ఉంటె, మీరు తేలికగా మరియు సంతోషంగా ఉంటారు. అలాగే, ఈ ఆంతరిక శక్తి మెరుగైన వ్యక్తిగత సంబంధాలలో మరియు జీవితంలోని వివిధ సాధనలలో అందమైన ఫలితాలను చూపుతుంది. మీ మనస్సులో విజయం యొక్క పాజిటివ్ భావన ప్రతి చర్యలో గ్యారంటీ గా విజయాన్ని ఇస్తుంది మరియు జీవితం ఎలాంటి ప్రశాంతమైన ప్రయాణంగా మారుతుంది అంటే ఇక ఏదైనా తప్పు చాలా అరుదుగా జరుగుతుంది, ఒకవేళ జరిగినప్పటికీ, దానంతట అదే చాలా తక్కువ వ్యవధిలో సరిదిద్దుకుంటుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th april 2024 soul sustenance telugu

విజయానికి 8 మెట్లు (పార్ట్ 3)

విజయానికి మార్గం ప్రధాన మార్పులతో నిండి ఉంటుంది, దానిలో ప్రయాణీకులుగా మనం స్వీకరించగలగాలి మరియు మార్పులు మనలను ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా ఎదుర్కోగలగాలి. ఆత్మిక బలం లేకపోవడం, మార్పులను ప్రతికూలంగా చూసే ధోరణి కారణంగా

Read More »
18th april 2024 soul sustenance telugu

విజయానికి 8 మెట్లు (పార్ట్ 2)

ఒక నిమిషం పాటు మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఆపివేసి, మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంబంధాలను కోల్పోవడాన్ని మీరు పట్టించుకోనంతగా లక్ష్యం ముఖ్యమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అలాగే, ఈ ప్రక్రియలో నేను

Read More »
17th april 2024 soul sustenance telugu

విజయానికి 8 మెట్లు (పార్ట్ 1)

మనమందరం ఉదయం నుండి రాత్రి వరకు చేసే వివిధ చర్యలతో నిండిన జీవితాన్ని గడుపుతున్నాము. వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక లేదా ఆర్థిక రంగాలలో ప్రతి చర్య నేను ఆశించిన దానిని సాధించాలనే ఉద్దేశ్యం లేదా

Read More »