17th april soul sustenance telugu

సంఘర్షణల సమయంలో వ్యక్తులతో మాట్లాడండి ... వారి గురించి మాట్లాడకండి

సంబంధంలో విభేదాలు ఏర్పడినప్పుడు, మనలోని నెగటివ్ భావోద్వేగాలు తరచుగా అవతలి వ్యక్తితో మన సంభాషణలో అవరోధంగా మారతాయి. అవతలి వ్యక్తి గురించి ఏదైనా మనల్ని బాధపెడితే , ఆ వ్యక్తితో నేరుగా మాట్లాడకుండా, అతని లేదా ఆమె గురించి మనకు తెలిసిన ప్రతి ఒక్కరితో మాట్లాడతాము. ఇద్దరు వ్యక్తులు తమ విభేదాలను పరస్పరం చర్చించుకోకపోతే, వారి సంబంధం త్వరగా చెడిపోతుంది. మీరు సంఘర్షణను పరిష్కరించడానికి నిజాయితీగా ప్రయత్నించినప్పుడు, అవతలి వ్యక్తి మీ స్వచ్ఛమైన ఉద్దేశాలను స్వతహాగా అర్ధం చేసుకుంటారు. మీరు సంబంధాన్ని పొందడమే కాదు, మీ అహంపై కూడా విజయం సాధిస్తారు.

 

  1. మీకు ఎవరితోనైనా విభేదాలు వచ్చినప్పుడు, వాటిని ఎలా పరిష్కరించుకుంటారు? మీరు నేరుగా ఆ వ్యక్తితో మాట్లాడుతారా లేదా ఆ సమస్యలో భాగం కాని ఇతరులతో విషయాన్ని పంచుకుంటారా? ముఖ్యంగా, మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నప్పుడు, ఇంకా చాలా నెగిటివ్ భావోద్వేగాలు ఎలా ఉత్పన్నమవుతాయో మీరు గమనించారా?
  2. సంబంధంలో సమస్య గురించి ఇతర వ్యక్తులకు వెళ్లి మాట్లాడవలసిన అవసరాన్ని మనం తరచుగా గుర్తిస్తాము, అది మనకు మంచి అనుభూతిని కలిగిస్తుందని లేదా వారు మనకు  సహాయం చేసి సంఘర్షణను పరిష్కరించగలరని నమ్ముతాము. ఆ వ్యక్తులు మన పట్ల మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నప్పటికీ, వారి వైబ్రేషన్స్ వారి మానసిక స్థితిని ప్రతిబింబిస్తాయి – అది ఆందోళన, భయం లేదా కోపంతో కూడినది కావచ్చు. వారి నెగిటివ్ శక్తి అనుకోకపోయినా కానీ ఖచ్చితంగా  సంఘర్షణలో ఉన్న మన సంబంధాన్ని క్షీణింప చేస్తుంది ఇంకా మరింత దిగజారుస్తుంది.
  3. మనం మరొక వ్యక్తితో ఎనర్జీ బ్లాకేజ్‌ని సృష్టించినట్లయితే, దానిని మనలో మనిద్దరం మాత్రమే పరిష్కరించుకోగలం. పరిష్కరించడానికి మనం ఎవరి సహాయం తీసుకోవాలనుకున్నా, ఆ మూడవ వ్యక్తి పూర్తిగా నిష్పక్షపాతంగా మరియు మానసికంగా నిర్లిప్తంగా ఉండాలి. అలాంటి వ్యక్తులు మనల్ని ఆశీర్వదిస్తారు మరియు మనల్ని మనం బలోపేతం చేసుకోవడానికి మరియు సంఘర్షణను పరిష్కరించడానికి వారి శక్తిని ఉపయోగించవచ్చు.
  4. మీకు విభేదాలు ఉన్న వ్యక్తితో బహిరంగ, నిజాయితీ మరియు స్పష్టమైన సంభాషణను నిర్వహించండి. మీ స్వచ్ఛమైన వైబ్రేషన్స్ మీ ఇద్దరినీ సామరస్యం వైపు వెళ్లేలా చేస్తాయి. సంఘర్షణలో ఉన్నంత వరకు మీకు మీరు గుర్తు చేసుకోండి – నేను, నాకు విభేదాలు ఉన్న వ్యక్తితో మాత్రమే మాట్లాడతాను. నేను వారి గురించి ఇతరులతో మాట్లాడను. వారితో నా పాజిటివ్ సంభాషణలు సంఘర్షణను దూరం చేసి మా మధ్య సామరస్యాన్ని పునరుద్ధరిస్తాయి

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »