ప్రియమైన వ్యక్తి బాధలో ఉన్నప్పుడు మన పాత్ర

ప్రియమైన వ్యక్తి బాధలో ఉన్నప్పుడు మన పాత్ర

మనమందరం మన ప్రియమైన వారిని వారి జీవితంలోని నిరాశలు, కష్టాలు మరియు సవాళ్ల నుండి రక్షించాలని అనుకుంటాము. మనలో కొందరు వారి బాధను మన బాధగా భావిస్తారు మరియు వారు బాధపడటం చూసి మనము  భరించలేము. మన విభిన్న పాత్రలలో కుటుంబం మరియు స్నేహితులను రక్షించడం ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కానీ మనం నెగిటివ్ ఎమోషన్స్  సృష్టించిన క్షణం, మనం వారి ప్రస్తుత బాధకు బాధను మాత్రమే జోడిస్తాము మరియు వారి బాధను తగ్గించే బదులు వారిని మరింత క్షీణింప చేస్తాము. కుటుంబం లేదా స్నేహితులు బాధలో ఉన్నప్పుడు, లేదా వారు తప్పు చేసినప్పుడు, మనకు కోపం లేదా బాధ కలుగుతుంది. ఆ సమయాల్లో మనం స్థిరంగా ఉండడం వారికి అవసరం, కానీ మనం ప్రతిస్పందిస్తాము. వారు ఇప్పటికే బాధలో ఉన్నారని మరియు మన ప్రతిచర్యలు వారిని మరింత బాధపెడుతుంటాయి మనము మరచి పోతాము.

బాధలో ఉన్న వ్యక్తికి బలం చేకూర్చేందుకు వీటిని అనుసరించండి –

  1. ఎవరైనా తమ బాధను పంచుకున్నప్పుడు, పాజ్ చేసి , వెనక్కి వెళ్లి, ఆ దృశ్యంలో భారీ వైబ్రేషన్ ల నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. ప్రశాంతంగా వినండి. మీ స్థిరత్వం వారి బలం అవుతుంది.
  2. ఎవరైనా తప్పు చేసినప్పటికీ, అతనికి సహజంగా తప్పు-ఒప్పుల గురించి జ్ఞానం ఉంటుంది. సరైనది అమలు చేసే శక్తి అతనికి లేకపోవచ్చు. అతనిని శక్తివంతం చేయడం మన పాత్ర అంతే కాని సలహా మాత్రమే కాదు. ప్రేమతో కూడిన సంకల్పాలు, ప్రోత్సాహకరమైన మాటలను రేడియేట్ చేయండి. అతనికి అతని బలాలను తెలపండి, ఇతరులకు అతని సద్గుణాలను హైలైట్ చేయండి మరియు అతనిని ఆశీర్వాదాలతో నింపండి.
  3. మానసికంగా దూరమయినప్పుడు, మీరు సలహాదారునిగా మారతారు మరియు విభిన్న దృష్టికోణాలను చూస్తారు. మీ మనస్సు స్పష్టంగా ఆలోచిస్తుంది. మీ కరుణ మీకు సరైన ప్రతిస్పందనలను ఎంచుకోవడానికి సహాయపడుతుంది.
  4. ఉన్నత వైబ్రేషన్స్ కలిగిన సంకల్పాలు మరియు పదాలతో వారిని ఆశీర్వదించండి. ఇదే వారిని శక్తివంతం చేస్తుంది.

మన స్థిరత్వం అందరికీ బాధ నుండి బయట పడటంలో చాలా సహాయపడుతుంది. అందరు బాధలో ఉన్నప్పుడు మన పాత్ర యొక్క ఈ సంకల్పాన్ని అనుభవం చేసుకుందాము.

నేను ప్రేమగల వ్యక్తిని … నేను మానసికంగా స్వతంత్రుడిని … వ్యక్తుల ప్రవర్తనలు నన్ను ప్రభావితం చేయవు … నేను ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాను … వ్యక్తులు మరియు పరిస్థితుల వైబ్రేషన్ తో  సంబంధం లేకుండా … ఎవరైనా బాధలో ఉంటే … నేను వారు చెప్పేది వింటాను … నేను వారి ప్రవర్తనను అర్థం చేసుకుంటాను … నేను వారికి అవసరమైన వైబ్రేషన్స్ ను సృష్టిస్తాను … నా వైబ్రేషన్స్ వారిని నయం చేస్తాయి … వారి ఆలోచనలు … భావాలు మారుతాయి … వారు సంతోషంగా ఉన్నారు … ఆరోగ్యంగా ఉన్నారు … విజయవంతమవుతారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »