17th feb soul sustenance telugu

చేతన మనసు యొక్క ప్రక్షాళన (భాగం 3)

మనసు యొక్క స్వచ్ఛత అనేది మీ జీవిత లక్ష్యంగా చేసుకోవాలి మరియు మీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన లక్షణంగా ఉండాలి . ఎందుకంటే, మీరు ఎంత స్వచ్ఛంగా ఉంటారో, మీ జీవితంలో మీరు అంత ఆనందరకరమైన పాజిటివ్ సంఘటనలు ఆకర్షిస్తారు. మనకు ఏదైనా దుర్గుణం యొక్క అపవిత్రమైన ఆలోచన వచ్చినప్పుడు, మనం నెగెటివ్ స్వభావం యొక్క వైబ్రేషన్స్ విశ్వానికి అందిస్తాము. ఆ వైబ్రేషన్స్ దుఃఖంతో నిండిన పరిస్థితి రూపంలో తిరిగి మన వద్దకు వస్తుంది. కనుక ఆత్మ యొక్క పవిత్రత లేదా చేతన మనసు యొక్క స్వచ్ఛత మన జీవిత అనుభవాలన్నింటికీ పునాది.
ఒక వ్యక్తి వరుసగా శారీరక అనారోగ్యాల రూపంలో నెగెటివ్ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే, ఈ జన్మ యొక్క గతం లేదా గత జన్మ యొక్క కొన్ని నెగెటివ్ కర్మల కారణంగా ఆమెలో ఆ నెగెటివ్ శక్తి ఉందని అర్థం. ఈ నెగటివ్ ఎనర్జీ విశ్వానికి ప్రసరిస్తోంది మరియు ప్రస్తుత తరుణంలో ఆమె జీవితంలో నెగెటివ్ దృశ్యాల రూపంలో తిరిగి వస్తోంది. కాబట్టి, ఈ సమయంలో ఆమె చాలా స్వచ్ఛమైన ఆలోచనలను అంటే కామం, కోపం, దురాశ, మోహం మరియు అహం లేని ఆలోచనలు మరియు శాంతి, ప్రేమ, ఆనందం మరియు ఆధ్యాత్మిక శక్తితో నిండిన ఆలోచనలను ఆలోచించాలి. అలాగే, ఈ ఆలోచనలు ఆత్మగౌరవంతో నిండి ఉండాలి. ఆమె జీవితంలోని నెగెటివ్ సన్నివేశాలపై దృష్టి కేంద్రీకరించాలి, అంటే శక్తివంతమైన ఆలోచనలను రచించి ఆ నెగెటివ్ సన్నివేశాలకు బదులుగా విజయవంతమైన ఆలోచనలతో నింపాలి . ఇది అద్భుతాలు చేసి ఆమె అనారోగ్యాలకు సరైన పరిష్కారాలను ఆకర్షించి ఆమె దుఃఖాన్ని అంతం చేస్తుంది. ఇది పవిత్రమైన చేతనమే చేయగలుగుతుంది . అలాగే, ఒక వ్యక్తి క్రమంగా అంతులేని ఆర్థిక నష్టాలతో బాధపడుతుంటే అతను ప్రతిరోజూ ఉదయం పాజిటివ్ విషయాలు చదవడం ప్రారంభించవచ్చు మరియు ప్రతిరోజూ కొన్ని నిమిషాలు మెడిటేషన్ చేయవచ్చు. ఇది అతని చేతన మనసును స్వచ్ఛంగా మరియు స్పష్టంగా చేస్తుంది. కొన్ని రోజుల్లోనే , అతని నెగెటివ్ పరిస్థితులలో మార్పును గమనిస్తాడు మరియు అతను తన జీవితంలో పాజిటివ్ సంపదను సంపాదించే అవకాశాలను గారంటీగా ఆకర్షిస్తాడు. ఇదే చేతన మనసు యొక్క ప్రక్షాళన. ఇది మన జీవితంలో శాంతి మరియు ఆనందం యొక్క అదృశ్య సంపదకు పునాది మరియు మన జీవితాల సారము. 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »