పాజిటివ్ జీవనం కోసం 10 కొత్త నమ్మకాలు (పార్ట్ 1)

పాజిటివ్ జీవనం కోసం 10 కొత్త నమ్మకాలు (పార్ట్ 1)

మానవ ఆత్మలకు, పరమాత్మ లేదా భగవంతుడికి వేరుగా ఉన్న చాలా ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, ఈ ప్రపంచ నాటకంలో కోరిక రహితంగా, శాశ్వతంగా ఉండే ఏకైక ఆత్మ, పరమాత్మ మాత్రమే. ఏ ఆత్మ ఏ చర్య చేసినా, అది శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తిని అనుభూతి చెందడానికే  చేస్తారు.  ఆత్మల ప్రపంచంలో ఉన్నప్పుడు మరియు సృష్టి నాటక రంగం పై తన పునర్జన్మల యాత్రను ప్రారంభించక ముందు నుండే ప్రతి ఆత్మలో ఉండే వాస్తవిక సంస్కారాలు ఇవి. ఈ రోజు ఆత్మలు శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తిని అనుభూతి చెందాలనే వారి కోరికను నెరవేర్చే లక్ష్యంతో,  తప్పుడు నమ్మకాల ఆధారంగా, కామం, కోపం, లోభం , మోహం మరియు అహం మరియు అనేక నెగెటివ్ ఎమోషన్స్ తో  నిండిన చర్యలను చేస్తున్నారు. కానీ ఈ చర్యలు ఆత్మను ఈ అనుభవాలకు దగ్గరగా అవ్వకుండా మరింత  దూరం ఎలా చేస్తాయో గ్రహించలేక పోతున్నారు.

పరమాత్మ లేదా భగవంతుడు కోరికల రహితుడు ఎందుకంటే వారు శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తి యొక్క సాగరం. ఆత్మ యొక్క ఈ విభిన్న కోరికలను నెరవేర్చే జ్ఞానం మరియు శక్తిని భగవంతుడు కలిగి ఉన్నాడు. సుప్రీం గురువుగా వారు శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తి యొక్క అనుభూతికి  సహాయపడే సరైన చర్యలు ఏమిటో మరియు వాటి నుండి మనల్ని దూరం చేసే చర్యలు ఏమిటో మనకు మార్గనిర్దేశం చేస్తారు. అలాగే, మనం వారితో ఎలా కనెక్ట్ అవ్వాలో నేర్పించేది కూడా వారు మాత్రమే. ఎందుకంటే మన వాస్తవిక స్థితిలో, మనలో ఉన్న ఈ గుణాలన్నింటికీ వారే సాగరుడు. మరియు వారితో కనెక్ట్ అవ్వడం వల్ల మనలో ఈ గుణాలను నింపుతారు. భగవంతుని ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా వారితో ఏర్పడే సంభందం, వారు నేర్పించే మెడిటేషన్ తో పాటు సరైన నమ్మకాలు లేదా సత్యం ఆధారంగా సరైన చర్యలను చేయడం, అనేక జన్మల శాశ్వత శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తి యొక్క కోరికలను నెరవేర్చుకోవడంలో మనకు సహాయపడుతాయి.  

మనం  రాబోయే కొద్ది రోజుల సందేశాలలో అటువంటి 10 సాధారణ తప్పుడు నమ్మకాలను చర్చించుకుందాము మరియు భగవంతుడు వెల్లడించే ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకుంటాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »