సులభంగా మనసును తేలికగా చేసుకోవడం

సులభంగా మనసును తేలికగా చేసుకోవడం

కొన్నిసార్లు మనం మోస్తున్న మానసిక ఆందోళన యొక్క భారాన్ని మనం గుర్తించము. ఆ భారం    మన అజ్ఞానం, గత అనుభవాల వలన బాధ, అనుబంధాలు, ఆశలు , చెడు అలవాట్లు, పరిమితమైన నమ్మకాలు మరియు వ్యక్తుల అభిప్రాయాలు కావచ్చు. మనం ఈ పాత పద్ధతులను విడిచి పెట్టిన ప్పుడే, మనం కొత్త ఆలోచనా విధానాలను, ప్రవర్తన కలిగి ఉండగలము. జీవిత ప్రయాణంలో, అవసరమైన వాటిని మాత్రమే తీసుకుని, తేలికగా ప్రయాణించడం తెలివైన పని. ఇది ఎమోషనల్ బ్యాగేజీకి కూడా వర్తిస్తుంది. నిరాశలు, చెడు అలవాట్లు, బాధలు మరియు భయాలు వంటి మనం బాధాకరమైన గతాన్ని కలిగి ఉంటాము. మనసును తేలికగా చేసుకుంటే  కొత్త ఆలోచనా విధానాలను, ప్రవర్తించే తీరు మరియు నడవడికను తయారుచేస్తుంది.  

అనవసరమైన ఎమోషన్స్ యొక్క బరువుని వదిలివేయడానికి ఈ ప్రక్రియను అనుసరించండి –

  1. మీ మనస్సు కలత చెందినప్పుడు, అది ఏమి ఆలోచిస్తుందో చెక్ చేయండి. ఇది గతం లేదా భవిష్యత్తు గురించి కావచ్చు. దానిని వర్తమానంలోకి మళ్లించండి.
  2. ప్రతి సన్నివేశంలో సరైన ప్రతిస్పందనను ఎంచుకోండి. ఇతరులను నిందించడం, తీర్పు చెప్పడం లేదా విమర్శించడం చేయకండి.
  3. ఎవరైనా మీకు ద్రోహం చేసినా, బాధపడటం మీ రచన. వారు నాతో ఎందుకు ఇలా చేసారు అని మనస్సు ప్రశ్నిస్తే,  నేను గతాన్ని వదిలేస్తాను … నేను వ్యక్తులను అర్థం చేసుకుంటాను … నేను వారిని స్వీకరిస్తాను … నేను పరిస్థితులను స్థిరత్వంతో ఎదుర్కొంటాను అని మీరు ఆలోచనలను  సృష్టించండి.  
  4. ఎవరూ, ఏదీ మీకు చెందినవి కాదు. అంతా మీ కర్మల లెక్కల ప్రకారమే జరిగింది. కాబట్టి మీ గురించి, వ్యక్తుల గురించి మరియు పరిస్థితుల గురించి అటాచ్మెంట్ లేదా ద్వేషాలను వదిలివేయండి.

ఒత్తిడి లేని మనస్సును కలిగి ఉండటానికి ప్రతిరోజూ ఈ సంకల్పాలను రిపీట్ చేయండి. మీరు నెగెటివ్  పొరలను తీసివేసినప్పుడు, మీరు మీ ఆంతరిక స్వరూపనికి కనెక్ట్ అవ్వడం ప్రారంభిస్తారు. ఆనందం, ప్రేమ మరియు కరుణ వంటి మీ నిజమైన గుణాలను మీలో పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. 

నేను సంతోషంగా ఉన్నాను … నేను ఒక సన్నివేశం నుండి మరొక సన్నివేశానికి తేలికతనంతో …….మారతాను … … నేను వర్తమానంలో ఉంటాను … నేను నిందించడం … చింతించడం … విమర్శించడం … లాంటి నా పాత అలవాట్లను వదిలివేస్తాను …అలాంటి సన్నివేశాలు నా మనస్సులో ఉండవు … నేను ఇతరులలో మంచితనం  పై మాత్రమే దృష్టి పెడతాను… నాకు వారి పట్ల దయ ఉంది … వారి ప్రవర్తన నా మనస్సులో నిలిచి ఉండదు … నేను ఈ జీవన ప్రయాణంలో తేలికగా ప్రయాణిస్తాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »