17th march soul sustenance telugu

అందరినీ చిరునవ్వుతో పలకరించండి

గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఆల్ ది బెస్ట్… కొన్నిసార్లు మన శుభాకాంక్షలు కేవలం పదాలకే పరిమితం అవుతుంటాయి, ఎటువంటి భావాలూ ఉండవు. మనకు లోపల ఎదుటివారి సమర్థతపై పూర్తిగా నమ్మకం లేకపోయినాకానీ వారిని మనం సంపూర్ణ నమ్మకంతో గ్రీట్ చేయవచ్చు. శుభాకాంక్షలు కేవలం పదాలు కాదు, అవి గొప్ప శక్తి నిండిన ఆశీర్వచనాలు. ఎదుటి వ్యక్తికి ఖచ్చితంగా మంచి జరగాలని సంపూర్ణంగా కాంక్షించి చెప్పేవే శుభాకాంక్షలు. అయితే, కొన్నిసార్లు మనం వాటిని కేవలం పదాలకే పరిమితం చేస్తుంటాము, అందులో ఎటువంటి భావాలను జత చేయము.

  1. కుటుంబ సభ్యులు, పొరుగువారు, క్రొత్తవారు, తోటి ప్రయాణికులు, సహపాఠకులు – ఎవరైనా కానీ, రోజులో మొదటిసారి కలుస్తున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా వారిని గ్రీట్ చేయండి. పవిత్రమైన శక్తిని సృష్టించి ఇతరులకు అందించడానికి ఇది ఒక మంచి అవకాశం.
  2. నిజాయితీగా వ్యక్తులను గ్రీట్ చేయడానికి, చిరునవ్వుతో పలకరించడానికి కేవలం 3 సెకండ్ల సమయం సరిపోతుంది. వారి రోజు మంచిగా జరగాలి అన్న భావనను, నమ్మకాన్ని లోపల కలిగి ఉండండి. ఇది వ్యక్తులు మరియు వాతావరణ శక్తిని పెంచుతుంది. మీరు చేసే ఈ మంచి ఆలోచనల పరిణామాన్ని పొందేది ముందుగా మీరే.
  3. స్వచ్ఛందంగా అందరినీ పలకరించండి. వారు మీకన్నా చిన్నవారని, పదవిలో మీకన్నా జూనియర్ అని, అహం అడ్డుకున్నదని గ్రీట్ చేయడం మానకండి. అందరికీ, అన్ని వేళలా మంచితనాన్ని పంచండి.
  4. మీరు పలకరించినప్పుడు ఎవరైనా సరైన విధంగా బదులివ్వకపోతే మీరు మాత్రం మీ అందమైన సుగుణాన్ని విడిచిపెట్టకండి. ప్రక్కరోజు కూడా వారికి గ్రీటింగ్స్ తెలపండి… ఆ తర్వాత రోజు కూడా… ఆ శక్తి మిమ్మల్ని, వారిని ఎలా మారుస్తుందో గమనించండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th march soul sustenance telugu

24th March – జీవన విలువలు

కర్మ సిద్ధాంతం ఎలా పని చేస్తుంది? మనమందరం ఆధ్యాత్మిక శక్తులం  లేదా ఆత్మలం . ప్రపంచ నాటకంలో వివిధ రకాల కర్మలను చేస్తాము. మనమందరం ప్రపంచ నాటకంలో శరీర బ్రాంతిలో కొన్ని మంచి కర్మలు

Read More »
23rd march soul sustenance telugu

23rd March – జీవన విలువలు

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి మనమందరం గొప్ప వక్తలు కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణమైన సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను

Read More »
22nd march soul sustenance telugu

22nd March – జీవన విలువలు

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (భాగము 3) నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాము. ఆత్మ శక్తికి దోహదపడే మిగిలిన అంశాలు: శుభ భావన, శుభ కామన, ఇతరులపై సంపూర్ణ

Read More »