ఆత్మగౌరవం యొక్క పాజిటివ్ మెట్లు (పార్ట్ 2)

ఆత్మగౌరవం యొక్క పాజిటివ్ మెట్లు (పార్ట్ 2)

  1. ఆనందం నా ఆంతరిక నిధి, అది నా స్వంతం – నా ఆనందానికి నేనే సృష్టికర్తనని మరియు నా జీవితంలోని ప్రతి పరిస్థితిలో ఈ ఆనందాన్ని నింపాలని, దానిని అందంగా మరియు సానుకూలంగా మార్చుకోవాలని ఎల్లప్పుడూ మీకు మీరు గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు జీవితం మన ముందు దుఃఖకరమైన దృశ్యాలను ఉంచుతుంది, అది మనస్సును నెగెటివ్ గా ప్రభావితం చేసి మన ఆనందాన్ని తగ్గిస్తుంది. కానీ సంతోషం అనేది నా స్వంత నిర్ణయం, అది సంఘటనలపై ఆధారపడదని మనం గుర్తుచేసుకున్నప్పుడు, జీవితంలోని ఏ సన్నివేశంలోనైనా మనం స్థిరంగా మరియు తేలికగా ఉంటాము. అలాగే, స్థిరమైన ఆనందానికి ఆధారం నేను ఆధ్యాత్మిక జ్ఞానం, గుణాలు, శక్తులు, బలాలు, ప్రతిభ మరియు ప్రత్యేకతలు అనే సంపదయజమానిని అని అర్థం చేసుకోవడం. నేను వాటిని నా ప్రయోజనం కోసం మరియు ఇతరుల ప్రయోజనం కోసం వివిధ మార్గాల్లో ఉపయోగించాలి. నేను ఈ పనిలో ఎంత బిజీగా ఉంటానో, ఆధ్యాత్మికంగా నేను మరింత సుసంపన్నంగా మరియు నిండుగా ఉంటాను మరియు అది నన్ను ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుతుంది.
  2. నేను శక్తివంతమైన ఆత్మ, నేను పాజిటివ్ విజయాన్ని నా స్వంతం చేసుకుంటాను – విజయాన్ని పొందడం అనేది ఆంతరిక శక్తి మరియు దృఢ సంకల్పంతో వస్తుంది. మన ముందు ఏదైనా సవాలుతో కూడిన పని ఉన్నప్పుడు, అది మన సంకల్ప శక్తిని పరీక్షించి, దానిని తగ్గించి సవాలును మరింత విపరీతంగా మారుస్తుంది. నెగెటివ్ మరియు అనవసరమైన ఆలోచనల లీకేజీలు లేకుండా ఉన్న మనస్సు చాలా దృఢమైనది మరియు శక్తివంతమైనది. శక్తివంతమైన మనస్సుతో కూడిన ఆత్మ, అది చేసే ప్రతి పనిలో అందమైన విజయాన్ని పొందుతుంది. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు సర్వ శక్తివంతుడైన భగవంతునితో కనెక్ట్ అవడం అనగా మెడిటేషన్ , మన చేతన మరియు అంతః చేతన మనస్సును శుభ్రంగా మరియు స్వచ్ఛంగా చేస్తుంది, ఫలితంగా మన విల్ పవర్ ను పెంచుతుంది. అలాగే, ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదివి మనం చేయడం , మన పాజిటివ్ ఆలోచనల శాతాన్ని పెంచుతుంది.  మనము మరింత దృఢ సంకల్పం, దృఢ నిశ్చయం మరియు పాజిటివిటీ తో నిండి ఉంటాము.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు

30th May – జీవన విలువలు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు నేను, నా నుదుటి మధ్యలో కూర్చున్న ఆధ్యాత్మిక నక్షత్రం… నేను శాంతి యొక్క సుందర  గుణాన్ని అనుభూతి చేస్తూ నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ మరియు ప్రతిదానికీ

Read More »
వర్క్-లైఫ్ (work -life)ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం

29th May – జీవన విలువలు

వర్క్-లైఫ్ ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం మన వర్క్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అనే విషయం అంగీకరించే విషయమే. కానీ కొన్నిసార్లు మనము వర్క్  కు   మిగతా వాటికన్నా ఎక్కువ

Read More »
మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్

28th May – జీవన విలువలు

మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్ ఆలోచనలు మన భాగ్యాన్ని సృష్టిస్తాయి. కాబట్టి మనం ఒక్క తప్పుడు ఆలోచన కూడా చేయకూడదు. సరైన ఆలోచనా సరళితో మనస్సును ప్రోగ్రామ్ చేయడానికి, మనం ప్రతి గంట తర్వాత

Read More »