18th april soul sustenance telugu

శాఖాహార ఆహారం యొక్క 5 ప్రయోజనాలు

  1. మన మనస్సును స్వచ్ఛంగా, ప్రశాంతంగా మరియు పాజిటివ్ గా చేస్తుంది – చంపబడినప్పుడు ఉత్పన్నమైన భయం, కోపం మరియు బాధ యొక్క వైబ్రేషన్స్ కలిగిన జంతువు యొక్క మాంసాన్ని తినడం వల్ల మన మనస్సు ప్రశాంతతను కోల్పోతుంది. మన మనస్సు మరింత ఉద్రేకంగా మరియు ప్రతీకారం తీర్చుకునేలా మారుతుంది ఇంకా మనము అలాంటి సంకల్పాలను మరియు భావాలను ఉత్పన్నము చేస్తాము. శాకాహార ఆహారం మన మనస్సును చాలా స్వచ్ఛంగా, ప్రశాంతంగా మరియు పాజిటివిటీ తో నింపుతుంది.
  2. మన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది – శాఖాహారం తినడం వల్ల అన్ని రకాల ఆరోగ్యాలు మెరుగుపడి మన జీవితకాలం పెరుగుతుంది. శాకాహార ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అనేక తీవ్రమైన శారీరక మరియు మానసిక అనారోగ్యాలను నివారించవచ్చు మరియు వాటి లక్షణాలను తగ్గించవచ్చు, ఇది మన మనస్సుపై మాత్రమే కాకుండా మన శరీరంలోని అన్ని విభిన్న భౌతిక వ్యవస్థలపై కూడా ప్రశాంత మరియు శుద్ధ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. 
  3. మెడిటేషన్ ని మరింత అందంగా మరియు ఆనందంగా చేస్తుంది – స్వచ్ఛమైన శాకాహార ఆహారం స్వచ్ఛమైన స్థితిని తయారుచేస్తుంది కాబట్టి, మన ఆలోచన మరియు విజువలైజేషన్ మరింత శక్తివంతంగా, స్పష్టంగా మారుతుంది. ఆత్మలమైన మనం స్వయంతో మరియు భగవంతునితో  మెడిటేషన్ లో  ఎక్కువ ఏకాగ్రత తో కనెక్ట్ (connect) అవ్వగలుగుతాము మరియు ఏకాగ్రతను ఎక్కువ కాలం ఉంచగలం కూడా. 
  4. సంబంధాలలో సామరస్యాన్ని మరియు ప్రేమను తెస్తుంది – శాకాహార ఆహారానికి మారడం, మన వ్యక్తిత్వాన్ని చాలా  మారుస్తుంది. మన కోపం మరియు అహాన్ని తగ్గించి, మనల్ని మరింత రిలాక్స్‌గా మరియు అంచనాల నుండి విముక్తి చేస్తుంది. ఈ పాజిటివ్ పరివర్తన ప్రతి ఒక్కరినీ మన సోదర ఆత్మలుగా చూడడానికి మరియు మన సంబంధాలన్నింటినీ శాంతియుతంగా, ప్రేమపూర్వకంగా, విభేదాలు లేకుండా చేయడానికి మనకు సహాయపడుతుంది.
  5. మన వంటగదిని స్వచ్ఛంగా మరియు భగవంతుని స్థానంగా చేస్తుంది – ఆధ్యాత్మికత మనకు భగవంతుని స్మరణలో ఆహారాన్ని వండడం మరియు తినడానికి ముందు భగవంతునికి ఆహారాన్ని సమర్పించడం నేర్పుతుంది. మనం శాకాహారానికి మారినప్పుడు, మన వంటగది అత్యంత స్వచ్ఛమైన ప్రదేశంగా మారుతుంది, ఇక్కడ ప్రకృతి నుండి మరియు హింస లేకుండా లభించిన ఆహారాన్ని వండి భగవంతునికి సమర్పించబడుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »