Hin

మీ పోజిటివిటీ కవచాన్ని బలంగా చేసుకోవటం

మీ పోజిటివిటీ కవచాన్ని బలంగా చేసుకోవటం

మనమందరం కఠినమైన సమయాలను ఎదురవుతున్నాము మరియు జీవితం మనపై వివిధ నెగెటివ్  పరిస్థితుల బాణాలను మళ్లీ మళ్లీ విసురుతుంది. మనందరికీ పాజిటివిటీ అనే కవచం ఉంది.  ఈ విభిన్న  నెగెటివ్ పరిస్థితుల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఆ కావచాన్ని ఉపయోగిస్తాము. కొన్నిసార్లు మన కవచం తగినంత బలంగా ఉండదు మరియు జీవితపు యుద్ధభూమిలో కొన్ని బాణాలు మనల్ని బలంగా తాకుతాయి. దాని ఫలితంగా మనం మానసికంగా గాయపడతాము. ఈ సందేశంలో మనం మన పాజిటివ్ కవచాన్ని ఎలా పటిష్టం చేసుకోవాలో చూద్దాం –

  1. రోజంతా ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క పాజిటివ్ ఆలోచనను ఎల్లప్పుడూ మీ స్మృతిలో ఉంచండి. ఖాళీ మనస్సు మన పాజిటివిటీ కవచాన్ని బలహీనపరుస్తుంది.
  2. అడుగడుగునా భగవంతుని తోడును మీతో ఉంచుకోండి. భగవంతుడు శాంతి, ఆనందం, ప్రేమ, స్వచ్ఛత, శక్తి మరియు సత్యతా సాగరులు. ఈ సద్గుణాలు మీ పాజిటివిటీ కవచాన్ని బలంగా చేస్తాయి.
  3. కఠిన పరిస్థితులు సవాలు చేసినప్పుడు ఫుల్ స్టాప్ పెట్టండి. పెద్ద సంఖ్యలో నెగెటివ్ మరియు వ్యర్థ ఆలోచనలను చేసి పరిస్థితిని పెద్దగా చేయవద్దు.
  4. ఆందోళన నెగెటివ్ శక్తి అని మీకు మీరే చెప్పుకోండి. జీవితం మీపై విసిరే నెగెటివ్ బాణాలు, చింతించటం ద్వారా మీ నుండి ప్రయోజనం పొంది మిమ్మల్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
  5. నెగెటివ్ పరిస్థితి ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఇలా మీరు ఎంత ఎక్కువ చేస్తే, అంత మీ ఆత్మ శక్తి వృధా అవ్వదు మరియు మీరు బలంగా ఉంటారు.
  6. మీ లోపల ఎదుర్కొనే శక్తిని ఎమర్జ్ చేయండి. మీరు ఓటమి అంగీకరించనంత వరకు యుద్ధంలో  గెలవగలరని గుర్తుంచుకోండి. ఇది పరిష్కారాలను ఆకర్షిస్తుంది మరియు బాణాలు మిమ్మల్ని తాకని భద్రతకు తీసుకెళ్తుంది.
  7. ఇవ్వడం అనేది పాజిటివ్ మరియు స్వచ్ఛమైన చర్యలను ప్రదర్శించే అందమైన కళ. గుణాలు మరియు శక్తులను ఇతరులతో పంచుకోవడం ద్వారా, మనం జీవితపు యుద్ధభూమిలో పాజిటివిటీ యొక్క బాణాలను పంపుతాము మరియు అవి నెగెటివ్ బాణాలను తగ్గిస్తాయి.
  8. అంతర్ముఖ అనే కళను అభ్యసించండి. తాబేలు దాని పెంకు లోపలికి వెళ్లినట్లే, మీ కర్మేంద్రియాల నుండి మీకు మీరు వేరు అయ్యి, మీ చేతనాన్ని అనుభూతి చేయండి అప్పుడు మీ కవచం మిమ్మల్ని బాగా రక్షిస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

16th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి

Read More »
15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »
14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »