18th feb soul sustenance telugu

భగవంతుని ఉనికిని గుర్తించి వారి వారసత్వాన్ని పొందుదాం

మహా శివరాత్రి నాడు ఆధ్యాత్మిక సందేశం – ఫిబ్రవరి 18

భగవంతుడు అనాదిగా మన ఆత్మిక తండ్రి. మనం ఆధ్యాత్మిక జీవులం అనగా, ఆత్మలం మరియు అనాదిగా వారి సంతానము. భగవంతుడు జ్ఞాన సాగరుడు, గుణ సాగరుడు మరియు శక్తి సాగరుడు కూడా. ప్రపంచంలోని ప్రతి ఆత్మ, భగవంతునితో అనాదిగా సంబంధం ఉన్న కారణంగా, భగవంతుని వారసత్వంపై హక్కును కలిగి ఉంటుంది. భగవంతుడు విశ్వంలో తన విశ్వ పరివర్తక పాత్రను పోషించినప్పుడు, భగవంతుడు మరియు విశ్వంలోని ఆత్మల మధ్య వారసత్వం ఇచ్చిపుచ్చు కోవడం జరుగుతుంది, ఈ విశ్వంలో భగవంతుడు విశ్వ పరివర్తన కార్యం కొరకు చేసే దివ్య అవతరణను శివరాత్రి లేదా శివ జయంతిగా జరుపుకుంటారు. ఇది ఎప్పుడు జరుగుతుంది మరియు భగవంతుడు తన వారసత్వాన్ని ఎలా ఇస్తారు? ఆత్మలు ఈ వారసత్వాన్ని స్వీకరించినప్పుడు ఏమి జరుగుతుంది? ఆత్మ పరివర్తన ఎలా జరుగుతుంది? ఈ సందేశంలో తెలుసుకుందాం –
1. భగవంతుడు సర్వోన్నతుడు, దివ్యమైనవాడు, చైతన్యమైనవాడు, బిందు స్వరూపుడు. తన గురించి, ఆత్మల గురించి, విశ్వ నాటకము గురించి, ప్రకృతి గురించి అన్నిటి గురించి తెలిసిన సర్వజ్ఞుడు. వారు సర్వశక్తిమంతుడు మరియు సర్వ గుణ సాగరుడు.
2. జ్ఞానము, గుణాలు మరియు శక్తులు భగవంతుడు ఇచ్చే వారసత్వం. వాటిపై ప్రతి మానవ ఆత్మకు హక్కు ఉంటుంది. ఇనుప యుగం లేదా కలియుగ చివర్లో, ప్రపంచం మొత్తం అజ్ఞాన అంధకారంలో ఉన్నప్పుడు (మానవాళికి రాత్రి), భగవంతుడు ఈ ప్రపంచంలో అవతరించి తన వైబ్రేషన్లు, ఆలోచనలు, మాటలు మరియు కర్మల ద్వారా తన పిల్లలకు ఈ వారసత్వాన్ని ఇస్తారు.
3. ఈ వారసత్వం ఆత్మను ఆంతరికంగా సంపన్నం చేసి, ఆ ఆంతరిక సంపన్నతతో ఆత్మ తన ఇంటికి అనగా ఆత్మల ప్రపంచానికి తిరిగి వెళ్ళి అక్కడ నిస్సంకల్ప స్థితిలో, లోతైన శాంతిలో ఉంటుంది. ఆత్మ తిరిగి భూమిపైకి వివిధ జన్మలలో వివిధ పాత్రలను పోషించడానికి వచ్చినపుడు పూర్తిగా భగవంతుని వారసత్వంతో నిండి ఉంటుంది. దాని కారణంగా, మనస్సు, బుద్ధి, ఆంతరిక వ్యక్తిత్వం అనగా సంస్కారాలు, శారీరక ఆరోగ్యం, అందం, సత్సంబంధాలు, సంపద మరియు అనేక ప్రతిభా-నైపుణ్యాలతో నిండి ఉంటుంది. ఆంతరిక సంపన్నత భౌతికమైన వాటిని మరియు భౌతికేతరమైన వాటిని మొత్తాన్ని ఆకర్షిస్తుంది.
4. విశ్వ నాటకంలో, అన్నింటితో సంపన్నంగా ఉన్న ఈ కొత్త దశను స్వర్ణయుగం లేదా సత్యయుగం అంటారు. ఈ యుగంలో ఆత్మలు పూర్తి సుఖశాంతులలో జీవిస్తూ సంపూర్ణంగా, పవిత్రంగా ఉంటాయి.
5. నిరాకారుడైన భగవంతుని అవతరణను మరియు విశ్వ ఆత్మలకు వారి వారసత్వాన్ని ఇచ్చే ఈ కార్యానికి గుర్తుగా శివరాత్రిని జరుపుకోవడం జరుగుతంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »