18th Jan Soul Sustenance - Telugu

భగవంతుడు ప్రపంచాన్ని పావనంగా ఎలా చేస్తాడు (భాగం – 2)?

భగవంతుడు పరివర్తనకు అతీతుడు. భగవంతుడు ఎల్లపుడూ పవిత్రత, గుణాలు మరియు శక్తులతో నిండి ఉంటాడు. భగవంతుడు తన ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా చెప్పినట్లుగా, భూమిపై ఈ సృష్టి యొక్క ఆయుష్షు 5000 సంవత్సరాలు. కాలచక్రంలో ఈ సృష్టి నాటకం నాలుగు సమాన భాగాలుగా నడుస్తుంది, అవి – స్వర్ణయుగం, వెండి యుగం, రాగి యుగం మరియు ఇనుప యుగం, ఒక్కొక్కటి 1250 సంవత్సరాలు. మొదటి రెండు దశలు మానవ ఆత్మలందరితో పాటు ఇతర జీవ రాశుల ఆత్మలు పూర్తిగా పవిత్రంగా మరియు సంతోషంగా ఉంటాయి. ప్రపంచమంతా 100% సామరస్యంగా ఉంటుంది. ప్రకృతి కూడా పూర్తిగా ప్రశాంతంగా మరియు స్వచ్ఛంగా ఉంటుంది. మూడవ దశ లేదా రాగి యుగం ప్రారంభంలో, అంటే స్వర్ణయుగం నుండి కొన్ని జన్మల ప్రయాణం తర్వాత, మానవ ఆత్మల ఆత్మిక శక్తి కొద్దిగా తగ్గుతుంది. ఆ కారణంగా, వారు శరీరం అనే భ్రాంతి మరియు పంచ వికరాలు – కామం, క్రోధం, లోభం, మోహం మరియు అహంకారం యొక్క ప్రభావంలోకి రావడం ప్రారంభిస్తారు. అపవిత్రంగా మారడం ప్రారంభిస్తారు. అలాగే, ఇతర జీవరాశుల ఆత్మలు కూడా వారి ఆధ్యాత్మిక శక్తిని తగ్గడం వలన మరియు మానవ ఆత్మల యొక్క నెగెటివ్ వైబ్రేషన్స్ యొక్క ప్రభావం వలన అపవిత్రంగా మారడం ప్రారంభించి పంచ వికారాల ప్రభావంలోకి రావడం ప్రారంభిస్తాయి . ఈ ప్రక్రియలో ప్రకృతి నెగెటివ్ వైబ్రేషన్స్ ప్రభావంలోకి రావడంతో ప్రకృతి యొక్క ఆధ్యాత్మిక శక్తి క్షీణించి నెగెటివ్ మరియు అపవిత్రంగా మారడం ప్రారంభిస్తుంది . మనం నాల్గవ దశ లేదా ఇనుప యుగం ముగింపుకు వచ్చే సరికి, ఈ మూడింటిలోని అశుద్ధత అత్యధిక స్థాయికి చేరుకుంటుంది. భగవంతుడు ఈ మూడింటి కన్నా ఉన్నతాతి ఉన్నతమైన వారు. కావున ఈ సంగమ యుగంలో మూడింటిని పవిత్రంగా మార్చే బాధ్యతను వారు తీసుకుంటారు. అందుకే ఈ యుగాన్ని సంగమ యుగం లేదా పరివర్తన యుగం అని అంటారు. సంగమ యుగం తర్వాత, స్వర్ణయుగం మళ్లీ ప్రారంభమవుతుంది మరియు 5000 సంవత్సరాల సృష్టి నాటకం మళ్లీ పునరావృతం అవుతుంది.

సృష్టి నాటకంలో సంగమ యుగం అయిన ప్రస్తుత సమయంలో భగవంతుడు మానవ ఆత్మలను, వివిధ జీవరాశుల ఆత్మలను మరియు ప్రకృతిని ఎలా శుద్ధి చేస్తారు? మొట్ట మొదటిగా, భగవంతుడు తన గురించి, ఆత్మలు మరియు వారి జన్మల గురించి, 5000 సంవత్సరాల సృష్టి నాటకం మరియు దాని పునరావృతం గురించి మానవ ఆత్మలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తారు . మెడిటేషన్ ద్వారా ఆత్మిక స్థితిలో ఉండే విధానం, భగవంతునితో కనెక్ట్ అయ్యే విధానం నేర్పిస్తారు. ఈ విశ్వానికి ఎంతో దూరంలో ఉన్న ఆత్మల ప్రపంచంలో తనను ఏ విధంగా స్మృతి చేయాలో వారు బోధిస్తారు . అలాగే, మానవ ఆత్మలకు పవిత్రత, నమ్రత, సహనం మరియు సంతుష్టత వంటి దైవీ గుణాలను ఎలా అలవర్చుకోవాలో మరియు ఇతర మానవ ఆత్మలకు వారు భగవంతుని నుండి పొందిన జ్ఞానం, గుణాలు మరియు శక్తులతో ఎలా సేవ చేయాలో బోధిస్తాడు. ఈ నాలుగు అంశాలు అంటే జ్ఞానం, మెడిటేషన్ , దైవిక గుణాలను ఆచరించడం మరియు ఆత్మిక సేవ మానవ ఆత్మలను శుద్ధి చేయడంలో మరియు వారిని ఆత్మ జాగృతి చేయడంలో సహాయపడతాయి తద్వారా అవి సృష్టిని శుద్ధి చేయడంలో సహాయపడతాయి.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

4th Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మానసిక భారాలు మరియు ఒత్తిళ్ళను అధిగమించుట (పార్ట్ 1)

ఆధ్యాత్మిక స్థాయిలో, భారం (ప్రెషర్) అంటే మనపై పని చేసే బాహ్య శక్తిని, దానిని భరించగల లేక ఎదిరించగల మన సామర్థ్యంతో విభాగిస్తే వచ్చేదే భారం. అందువలన, శక్తి మరియు ఎదిరించగల సామర్థ్యం ఒత్తిడి

Read More »
3rd Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 2 )

ఆత్మానుభూతి పొందుతూ కర్మలలో ఆత్మానుభూతి చేసుకోవడం – మెడిటేషన్ కు ముఖ్యమైన పునాది ఆత్మ యొక్క స్పృహ ఉండడం. స్వయాన్ని ఆత్మగా అనగా జ్యోతి స్వరూపంగా భావిస్తూ, ఆత్మ యొక్క నిజగుణాలను అనుభూతి చేసుకోవడం.

Read More »
2nd Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 1)

ఒక పాజిటివ్ ఆలోచనతో మీ మెడిటేషన్ ను ప్రారంభించండి – మెడిటేషన్ ప్రారంభించే ముందు, మీరు స్వచ్ఛమైన మరియు ప్రశాంతమైన జీవి అని మరియు సర్వ గుణాల, శక్తుల సాగరుడైన భగవంతుడు మీ తండ్రి

Read More »