పాజిటివ్ జీవనం కోసం 10 కొత్త నమ్మకాలు (పార్ట్ 2)

పాజిటివ్ జీవనం కోసం 10 కొత్త నమ్మకాలు (పార్ట్ 2)

మనం శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తిని ఎలా అనుభూతి చేసుకోవాలి అనే విషయంలో చాలా తప్పుడు నమ్మకాలను కలిగి ఉంటాము మరియు మన అనేక చర్యలు ఈ నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. పరమాత్మ లేదా సుప్రీమ్ టీచర్ మన నమ్మక వ్యవస్థను మార్చి ఈ తప్పుడు నమ్మకాల గురించి మనకు తెలిసేలా చేయడమే కాకుండా సరైన ఆధ్యాత్మిక నమ్మకాలు లేదా సత్యాన్ని మనతో పంచుకుంటారు, తద్వారా మనం వాటి ఆధారంగా చర్యలను ప్రారంభించి, శాశ్వత శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తి యొక్క అనుభూతిని పొందడం ప్రారంభిస్తాము. మనకున్న అటువంటి తప్పుడు నమ్మకాలకు సంబంధించిన 10 ఉదాహరణలను మరియు వాటి గురించి సత్యాన్ని ప్రస్తావించాము –

నమ్మకం 1 – సంబంధాలలో విజయం సాధించడానికి కోపం అవసరం. పనులను పూర్తి చేయడానికి మరియు గౌరవం పొందడానికి కోపం చాలా ముఖ్యం. ఇది మానసికంగా శక్తిని అందిస్తుంది మరియు మనల్ని శక్తివంతం చేస్తుంది.

నిజం – ఇద్దరు మనుషుల మధ్య శాంతి, ప్రేమ మరియు మంచితనం యొక్క శక్తులు పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నపుడే సంబంధాలు అందంగా మారుతాయి. మన కోపంతో ఇతరులను నియంత్రించే బదులు, మన శాంతియుతమైన మరియు ప్రేమగల స్వభావంతో వారిని ప్రభావితం చేసినప్పుడు, ఇతరులు మనల్ని మరింత గౌరవిస్తారు మరియు మనతో కలిసి పనిచేయడం ఆనందిస్తారు. కోపం తాత్కాలికంగా నెగెటివ్ శక్తిని మరియు ఆడ్రినలిన్ (ఒత్తిడి హార్మోన్) ని పెంచుతుంది, అది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది మరియు జ్ఞానం మరియు సంతృప్తి వంటి ఆధ్యాత్మిక సంపదలను  క్షీణింపజేస్తుంది.

నమ్మకం 2 – ఆందోళన మరియు భయం నెగిటివ్ పరిస్థితులకు మనల్ని సిద్ధం చేస్తాయి. మనకు దగ్గరగా ఉన్నవారి కోసం చింతించడం వారి పట్ల మనకున్న ప్రేమకు సంకేతం.

నిజం – ఇప్పటికే ఆందోళనగా ఉన్న ఏదైనా నెగెటివ్ పరిస్థితిలో ఆందోళన మరియు భయం సమస్యను మరింత పెద్దదిగా చేస్తాయి, పరిష్కారాలను మన నుండి దూరంగా ఉంచుతాయి. భవిష్యత్తులో సంభవించే ఏదైనా నెగెటివ్ పరిస్థితి గురించి ఆందోళన మరియు భయం అనేది నెగెటివ్ పరిస్థితి ముందుగానే విజువలైజేషన్ చేయడం. ఇది చెడు ఫలితం వస్తుందని ఆత్మను ముందు నుంచే సిద్ధం చేయడానికి బదులుగా, ఆత్మ యొక్క ఆధ్యాత్మిక బలం హరించడం అవుతుంది. ఇది విశ్వానికి నెగెటివ్ శక్తిని పంపుతుంది, తద్వారా పరిస్థితిని మెరుగు పడడం కోసం సహాయం చేయడానికి బదులుగా హాని కలిగించవచ్చు. మన ప్రియమైనవారి పట్ల శ్రద్ధ వహించడం మరియు చింతించకపోవడం వారి పట్ల మనకున్న ప్రేమకు సంకేతం, ఇది వారికి మన నుండి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది, ఎందుకంటే ఆ సమయంలో మనం పోజిటివిటీ మరియు శక్తితో నిండి ఉంటాము. మనం ఆందోళనకు గురైనప్పుడు, మన పాజిటివిటీని మరియు శక్తిని కోల్పోతాము.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »