మెడిటేషన్ యొక్క 7 అందమైన ప్రయోజనాలు

మెడిటేషన్ యొక్క 7 అందమైన ప్రయోజనాలు

  1. మెడిటేషన్ మనస్సుకు మంచి వ్యాయామం.  దీనిలో మనం ఆధ్యాత్మిక స్వయంతో లేదా ఆత్మతో కనెక్ట్ అయ్యి దాని గుణాల అనుభూతిలోకి వస్తాము. అలాగే, మెడిటేషన్ లో మనం పరమాత్మతో కనెక్ట్ అవుతాము. పరమాత్మతో అనుబంధం జోడించి వారి గుణాలను మనలో ఇముడ్చుకుంటాము.
  2. మనం ఎంత ఎక్కువ మెడిటేషన్ చేస్తే అంత పాజిటివ్ గా, స్వచ్ఛంగా మరియు శక్తివంతమవుతాము. మన ఆలోచనలు, భావాలు మరియు వైఖరులు అపారమైన పాజిటివ్ మార్పులకు లోనవుతాయి.
  3. మెడిటేషన్ మన భావోద్వేగ రోగనిరోధక శక్తిని మరియు అంతర్గత బలాన్ని పెంపొందిస్తుంది మరియు జీవితంలోని వివిధ నెగెటివ్ పరిస్థితుల నుండి మనల్ని కాపాడుతుంది. 
  4. ఇది స్వయం మరియు భగవంతుడిని మరింతగా అర్ధం చేసుకోవడానికి మరియు వారిద్దరికీ దగ్గరగా రావడానికి మరియు వారితో అందమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కూడా అనుమతిస్తుంది.
  5. మనం క్రమం తప్పకుండా మెడిటేషన్ చేసినప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా సులభంగా అర్థం అవుతుంది.  మరియు మెడిటేషన్ మనల్ని ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క స్వరూపులుగా చేస్తుంది. మనం  కొత్త మరియు సృజనాత్మక ఆలోచనా విధానాలను నేర్చుకుంటాము.మనం దేహ భ్రాంతి నుండి ఆత్మిక స్థితిలోకి మారుతాము.
  6. మెడిటేషన్ అనేది ప్రస్తుత సమయంలో పరమాత్ముడు మనకు అందించే బహుమతి మరియు వారు స్వయంగా దాని విధానాన్ని మనకు బోధిస్తున్నారు, తద్వారా ఆత్మలైన మనం ఉన్నతంగా అవుతాము. జీవితంలో కొత్త వాస్తవాలను ధారణ చేస్తాము. ఈ కొత్త వాస్తవాలు మన ఇళ్లు, కార్యాలయాలు మరియు జీవితంలోని ప్రతి ఇతర రంగాలలో శాంతి, ప్రేమ మరియు ఆనందంతో నిండిన చిన్నచిన్న స్వర్గాలు వంటివి.
  7. మన మానసిక మరియు శారీరక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది, మన ఆంతరిక మరియు బాహ్య వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మరియు ప్రతి చర్యలో మన సామర్థ్యం పెరిగి మరింత  ఎక్యూరేట్ గా మారుతుంది. మరియు చాలా ముఖ్యంగా, మన సంబంధాలు విభేదాల నుండి విముక్తి పొందుతాయి మరియు శుభాకాంక్షలు, గౌరవం మరియు సహకారంతో నిండి ఉంటాయి. మనం సంపాదనను నిజాయితీ, సత్యతాతో మరియు విజయవంతగా సంపాదించడం ప్రారంభిస్తాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »