HI

18th march soul sustenance telugu

5 రకాల ఆరోగ్యాలను పాటించండి

ఆరోగ్యంగా  జీవించగల సమర్థత ముఖ్యంగా 5 రకాల ఆరోగ్యాలపై ఆధారపడి ఉంటుంది – శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, భావోద్వేగ ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యము మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యము. వీటన్నిటి మధ్య సంబంధం ఉంది కనుక ఈ ప్రతి కోణము మన నాణ్యమైన జీవితానికి దోహదపడుతాయి. ఆరోగ్యం గురించి మనం ఆలోచించినప్పుడు, మనం సాధారణంగా శారీరక ఆరోగ్యంపైనే ఎక్కువ శ్రద్ధ పెడతాము. శరీరము ఆరోగ్యంగా ఉందా లేదా, చురుకుగా ఉందా లేదా అని చూస్తాము. మానసిక ఆరోగ్యము, భావోద్వేగ ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యము మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యములపై తక్కువ శ్రద్ధ పెడుతున్నాము. ఒక సంతృప్తికరమైన జీవితం కోసం ఈ 5 చక్కగా ఉండాలి.

  1. భావోద్వేగ, సామాజిక, మానసిక మరియు శారీరక ఆరోగ్యములన్నింటికీ ఆధారము ఆధ్యాత్మిక ఆరోగ్యము. మెడిటేషన్ నేర్చుకుని భగవంతుడితో కనెక్ట్ అయ్యి వారి శక్తులతో స్వయాన్ని నింపుకోవాలి. రోజూ ఆధ్యాత్మిక చదువును చదవాలి. నైతిక విలువల దిక్సూచిని పెట్టుకుని విలువల ఆధారిత జీవితాన్ని గడపాలి.
  2. శారీరక ఆరోగ్యం కోసం రోజూ కనీసం 20 ని.లు వ్యాయామం చేయాలి. సరైన తిండి, సరైన పానీయము, సరైన నిద్ర అలవాట్లు వంటి జీవినశైలి విధానాలను పాటించాలి.
  3. భావోద్వేగ మరియు మానసిక ఆరోగ్యం సరైన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే మీలో వచ్చే ఆలోచనలే మీ మాటలలోకి, చేతలలోకి వస్తాయి. అవే మీ విధిని తయారు చేస్తాయి. వ్యక్తులు, పరిస్థితులు సరిగ్గా లేకపోయినా కానీ పాజిటివ్‌గానే ఆలోచించండి. స్వచ్ఛమైన మనసు శరీరానికి శక్తిని పంపిస్తే చెడు ఆలోచనలు శరీరానికి రోగాలను తెస్తాయి.
  4. సామాజిక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి, ఇతరులనుండి ఆశించడం మానండి. మీ శక్తికొలదీ ఇవ్వండి, ఏమీ ఆశించకండి. ప్రేమ, నమ్మకము, గౌరవం మరియు సంతోషాన్ని ప్రసరింపజేయండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th april 2024 soul sustenance telugu

విజయానికి 8 మెట్లు (పార్ట్ 2)

ఒక నిమిషం పాటు మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఆపివేసి, మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంబంధాలను కోల్పోవడాన్ని మీరు పట్టించుకోనంతగా లక్ష్యం ముఖ్యమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అలాగే, ఈ ప్రక్రియలో నేను

Read More »
17th april 2024 soul sustenance telugu

విజయానికి 8 మెట్లు (పార్ట్ 1)

మనమందరం ఉదయం నుండి రాత్రి వరకు చేసే వివిధ చర్యలతో నిండిన జీవితాన్ని గడుపుతున్నాము. వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక లేదా ఆర్థిక రంగాలలో ప్రతి చర్య నేను ఆశించిన దానిని సాధించాలనే ఉద్దేశ్యం లేదా

Read More »
16th april 2024 soul sustenance telugu

ప్యూర్ బైట్స్ – స్వచ్ఛమైన ఆహారం కోసం 5 చిట్కాలు

మీరు ఏమిటో మీరు తీసుకునే ఆహారమే చెప్తుంది – అని చెప్పబడింది. అంటే మీరు తినే ఆహారం యొక్క శక్తి మీ మనస్సు మరియు వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. స్వచ్ఛమైన ఆహారం కోసం 5

Read More »