Hin

ఆత్మగౌరవం యొక్క 5 పాజిటివ్ మెట్లు (పార్ట్ 3)

ఆత్మగౌరవం యొక్క 5 పాజిటివ్ మెట్లు (పార్ట్ 3)

  1. నేను ఒక స్వేచ్చా జీవిని, నన్ను ఏదీ నెగెటివ్ గా ప్రభావితం చేయదు – ఆత్మగౌరవం యొక్క చాలా ముఖ్యమైన దశ ఏమిటంటే, ఏ పరిస్థితి లేదా వ్యక్తి నన్ను నెగెటివ్ గా ప్రభావితం చేయలేరని గుర్తుంచుకోవడం. స్వేచ్ఛ అనేది ఆత్మ యొక్క వాస్తవిక అనుభవం మరియు గుణం. స్వేచ్ఛలో, నేను ప్రపంచాన్ని నిర్లిప్తంగా చూస్తాను మరియు నా ముందుకు వచ్చే ఏదైనా నెగెటివిటీని  సులభంగా , ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను.  అలా చేయడం నన్ను శక్తివంతం చేస్తుంది. నేను ఆత్మిక స్థితి  యొక్క అనుభూతి చేసుకుంటూ వేసే ప్రతి అడుగు వలన, నన్ను బంధించే హద్దులను దాటి నేను వెళ్తాను. ఆలోచనలో మొహాలు మరియు పరిమితులు తొలగించబడతాయి.  నేను వ్యక్తులను కొన్నిసార్లు నెగెటివ్ గా మరియు కొన్నిసార్లు పాజిటివ్ గా నటించే నటీనటులుగా మరియు సన్నివేశాలను కొన్నిసార్లు నెగెటివ్ మరియు కొన్నిసార్లు పాజిటివ్ దశలుగా చూస్తాను. ఈ అనుభవం చేతనంలో, అలాగే పదాలు మరియు చర్యలలో శక్తిగా మారుతుంది.
  2. నేను గుణాలు మరియు అధికారాల సంపదతో నిండుగా ఉన్నాను, నేను వాటి అనుభూతి పొందుతున్నాను – నేను పరమాత్ముని  సంతానం కనుక వారి ఖజానాలు అన్నీ నావే అని స్మరించినప్పుడు ఆత్మ గౌరవం ఏర్పడుతుంది. ప్రతిరోజూ వారి ఒక్క గుణాన్ని లేదా శక్తిని గుర్తుపెట్టుకుంటూ దానిని ఆచరణలోకి తీసుకురావడం వలన నాకు సంతృప్తి మరియు సంపన్నత  అనుభవం అవుతుంది. ఈ అభ్యాసం చేస్తూ ఉంటే కాల క్రమేణా  ఏ పరిస్థితిలోనైనా, ఏ వ్యక్తితోనైనా అవసరమైన గుణము లేదా శక్తిని ఉపయోగించడం సులభతరం అవుతుంది. తద్వారా తేలికగా మరియు శక్తివంతంగా ఉంటాము మరియు అన్ని భారాలు లేదా ఒత్తిడి నుండి విముక్తి పొందుతాము. రోజుకు ఒక గుణము కఠిన  పరిస్థితులను దూరంగా ఉంచుతుంది మరియు రోజుకు ఒక శక్తి నన్ను ఎల్లప్పుడూ స్థిరంగా మరియు బలంగా ఉంచుతుంది. గుణాలు మరియు శక్తులు మన చేతనంలో ఉంచడం ద్వారా మరియు వాటిని ప్రతిరోజూ మన మాటల్లో, కర్మలలో  తీసుకురావడం ద్వారా కొంత కాలానికి మనలో నింపబడతాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 2)

శ్రీ గణేషుని పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. వ్యక్తుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేషుని చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం చూపిస్తారు,

Read More »
7th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 1)

ఈ సంవత్సరం గణేష్ చతుర్థిని సెప్టెంబర్ 7 నుండి 17 వరకు జరుపుకుంటారు. శ్రీ గణేషుని జననం యొక్క నిజమైన అర్ధాన్ని మనం అర్థం చేసుకుంటాము. శ్రీ పార్వతీ దేవి స్నానం చేయాలనుకొని గేటు

Read More »
6th sep 2024 soul sustenance telugu

మీరు కలిసే ప్రతి ఒక్కరికీ చిరునవ్వుతో అభివాదం చేయండి

గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఆల్ ది బెస్ట్… కొన్నిసార్లు శుభాకాంక్షలు ఎటువంటి భావాలు లేకుండా కేవలం పదాలుగా మారతాయి. అంతరికంగా మనం వారి సామర్థ్యాన్ని అనుమానించినప్పటికీ, వ్యక్తులకు అల్ ది బెస్ట్ తెలియజేయవచ్చు.

Read More »