19th april soul sustenance telugu

మనం మానవ యంత్రాలము కాదు, మానవ జీవులం (పార్ట్ 1)

మనమందరం ఈ ప్రపంచంలో ఉన్నతమైన ప్రయోజనం కోసం జన్మించిన ప్రత్యేక దేవదూతలం. ఉదయం నుండి రాత్రి వరకు, ఉదయం దుస్తులు ధరించడం, పనికి వెళ్లడం, భోజనం వండడం మరియు రోజు చివరిలో నిద్రపోవడం వంటి చర్యలతో నిండిన జీవితాన్ని గడపడమే కాకుండా, మనకు ఉన్నతమైన ప్రయోజనం కూడా ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఉదా. మీ ఇంట్లో ఎయిర్ కండీషనర్ వంటి ఒక యంత్రం. మనము దానిని నడిపినప్పుడు అది నడుస్తుంది మరియు ఆపినప్పుడు ఆగిపోతుంది. అది నడవనప్పుడు, అది ఇంకేదైనా చేయగలదని ఎప్పుడూ ఆలోచించకుండా అలాగే ఉంటుంది. దీనికి ఉన్నతమైన ప్రయోజనం ఉందా? లేదు. ఏదో ఒక రోజు మనం దానిని శాశ్వతంగా వదిలి వేస్తాం. మనమందరం మొదట మానవులం అంతే కానీ మానవ యంత్రాలము కాదు. మానవ యంత్రాలు ఉదయం నుండి రాత్రి వరకు పని చేస్తాయి, ఉన్నత ప్రయోజనం లేకుండా వివిధ పనులు చేస్తాయి. మానవులకు ఉన్నతమైన ఉద్దేశ్యం ఉంది – జీవితానికి అవసరమైన కర్మలను చేస్తూ స్వయాన్ని చూసుకోవడం. కాబట్టి, ఈ రోజు నుండి మనం యంత్రంలా ఉండకూడదు. మనం మన కార్యాలయంలోకి అడుగుపెట్టినప్పుడు లేదా మన ఇంటిని మరియు కుటుంబాన్ని చూసుకున్నప్పుడు, మన స్నేహితులతో మాట్లాడేటప్పుడు, ఒక రోజు మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి, మనతో ఏమీ తీసుకు వెళ్లలేమని మనం గుర్తు చేసుకోవాలి. ఈ భౌతిక దుస్తులు, ఆర్థిక విజయం, వృత్తిపరమైన విజయాలు, అందమైన సంబంధాలు ఏవి ఈ శరీరాన్ని విడిచి వెళ్లేటప్పుడు మీతో రావు.

కాబట్టి, ఒక్క నిమిషం ఆగి లోలోపలికి చూసుకోండి. నేను నా కొడుకు లేదా కుమార్తె లేదా భర్త లేదా భార్యను ప్రేమిస్తున్నాను కానీ ఒక రోజు నేను ఈ భౌతిక దుస్తులను విడిచిపెట్టినప్పుడు వారు నాతో ఉండరు. నాకు, నా జీవిత లక్ష్యం వారిని చూసుకోవడమే కావచ్చు. కానీ నా ఉన్నతమైన ఉద్దేశ్యం నేను నాతో పాటు తీసుకువెళ్ళే నా అంతరంగాన్ని, నా సంస్కారాలను చూసుకోవడం. కాబట్టి ప్రతి ఉదయం ఒక సంకల్పం తీసుకోండి – నేను రోజంతటిలో నా అంతరంగాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి  మరియు నేను కలిసే ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని ఇవ్వాలని ప్రాధాన్యత ఇస్తాను. నేను పనిలో మంచిగా చేస్తూ  నాకు అందరి నుండి ఆశీర్వాదాలు ఇచ్చే నా కర్మలపై కూడా జాగ్రత్త వహిస్తాను. అలాగే, నేను ప్రతి ఒక్కరికీ మంచితనానికి దర్పణంగా ఉండటాన్ని ఎంచుకుంటాను, దీని ద్వారా అందరూ పాజిటివిటీని చూసి మంచి మానవులుగా మారడానికి ప్రేరణ పొందుతారు. ఎందుకు? ఎందుకంటే మీరు ప్రత్యేకమైనవారు, ప్రత్యేక మానవులు, సాధారణ మానవులు కాదు!

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »