HI

చక్కని బంధాలు – విజయానికి బాటలు (పార్ట్ 1)

చక్కని బంధాలు – విజయానికి బాటలు (పార్ట్ 1)

మనందరినీ దగ్గరకు చేర్చి, బంధాలను జీవితానికి ముఖ్య సాధనంగా చేసి, మనల్ని దగ్గరగా పెనవేసిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. కానీ ఆ బంధాలు ఈ రోజు పూర్వం ఉన్నంత అర్థవంతంగా, లోతుగా లేవు అన్నది బాధాకరమైన విషయమే కానీ ఇదే సత్యము. మనం తరచూ త్వరిత విడాకులు మరియు స్నేహంలో విచ్ఛిన్నాలను, కుటుంబంలోను, ఆఫీసులోను మరియు ఇతర చోట్ల వింటూనే ఉన్నాము. మనం ఎటు వెళ్తున్నాము? మన ఈ బంధాలు ఎందుకు ఇంత బలహీనపడ్డాయి? ఒకవేళ ఆ బంధాలు ఉన్నాకానీ అవి ఇవ్వాల్సినంత సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉండటం లేదు. కోపము, అహంకారము, ఈర్ష్య, స్వార్థము, అభద్రతా భావాలు బంధాలను మునుపటికన్నా ఎక్కువ చుట్టుముట్టేసాయి. మరికొంతమందైతే సంబంధాలలో వారికున్న సమస్యను ఎవ్వరికీ వ్యక్తపరచకుండా లోలోపలే మధనపడుతున్నారు. ఇటువంటి బంధాలను సరి చేసి నిత్యం శాంతి, ప్రేమ మరియు సంతోషాలు నిండిన బంధాల కోసం ఏమి చేయాలో కొన్ని విధానాలను చూద్దాం:

  1. పాజిటివ్ ఆలోచనలతో మిమ్మల్ని మీరు శాంతి, ప్రేమ మరియు సంతోషాలతో నింపుకోవడానికి ప్రతిరోజూ కొన్ని నిమిషాలు కేటాయించండి. మీ సహజ గుణాలైన శాంతి, ప్రేమ మరియు సంతోషాలను గుర్తు చేసుకున్నప్పుడు ఆ స్వభావం మీలో మరింత బలపడుతుంది. మీ సంస్కారాలు ఎంతగా ఈ మూడు గుణాలతో నిండి ఉంటాయో అంతగా మీ ఆలోచనలు, మాటలు మరియు చేతలలో కూడా ఇవి కనిపిస్తాయి. ఫలితంగా, మీ బంధాలలో కూడా ఈ గుణాలు ప్రతిబింబిస్తాయి. సంబంధాలు పతనమవ్వడానికి ముఖ్యమైన రెండు కారణాలు – ఒకటి, అంతర్గత ఖాళీతనము, రెండు, ఈ మూడు గుణాలను ఇతరులతో  పంచుకోలేకపోవడము. ఇంచుమించు బంధాలలో వచ్చే అన్ని సమస్యలకు కారణము ఆశించడము. శాంతి, ప్రేమ మరియు సంతోషాలు వ్యక్తిలో లోపించిన కారణంగా ఇతరుల నుండి ఆశించడం ఎక్కువయింది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd may 2024 soul sustenance telugu

మీకు భగవంతునితో బలమైన సన్నిహిత సంబంధం ఉందా?

భగవంతుడు శాంతి, ప్రేమ మరియు ఆనంద సాగరులు. ఈ అసలైన సుగుణాలు కలిగి ఉన్న ఆత్మలమైన మనం వారి పిల్లలం. మనం భగవంతునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, వారి నుండి ఈ సుగుణాలతో

Read More »
22nd may 2024 soul sustenance telugu

భిన్నంగా ఉన్న వారి పట్ల దయకలిగి ఉండటం

మీరు ప్రపంచాన్ని ఇతరులకు భిన్నంగా ఎలా చూస్తున్నారో గుర్తించడం ద్వారా మాత్రమే మీకు భిన్నంగా ఉన్న వారి పట్ల దయ కలిగి ఉండాలనే అవగాహనను పెంపొందించుకోవచ్చు. భిన్నంగా ఉన్న వారు అంటే మీరు కలిసే

Read More »
21st may 2024 soul sustenance telugu

మిమ్మల్ని మీరు మార్చుకోవాలని లోతుగా అనుకుంటున్నారా?

చాలా సార్లు, మనం మన స్వపరివర్తన లక్ష్యాలపై ముందుకు వెనుకకు ఊగిసలాడుతూ ఉంటాము . ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం పైపై మార్పులు చేస్తూ ఉత్సాహంగా మొదలుపెడతాము. చాలా వరకు మన దృష్టి ఏమి

Read More »