Hin

19th feb soul sustenance telugu

ఇతరులు మీ సలహాను తిరస్కరించినప్పటికీ వారి నిర్ణయాలకు మద్దతు ఇవ్వండి

మనము మంచి ఉద్దేశాలతో పర్ఫెక్ట్ సలహాలను ఇస్తాము, కానీ కొన్నిసార్లు ఇతరులు ఆ సలహాను తిరస్కరిస్తారు, అది సరైనది కాదని మనకు తెలుసు . మనము మంచి ఉద్దేశాలను మరియు సరైన సూచనలను తెలియజేసినప్పటికి అవతలి వ్యక్తి వారి స్వంత ఆలోచనను అమలు చేయాలని నిర్ణయించుకోవచ్చు.

1. మీరు మీ సలహాను తిరస్కరించబడిన ఒక పరిస్థితిని గుర్తుకు తెచ్చుకోండి. మీరు మంచి ఉద్దేశ్యంతో వారిని ఇలా హెచ్చరించారు – నా సలహాను అనుసరించండి. ఆ పని వేరే విధంగా చేస్తే కష్టమైన పరిణామాలు ఉంటాయి. మీరు సంతోషంగా ఉండలేరు అని .
2. వ్యక్తులు నిర్ణయం తీసుకున్న తర్వాత, అది మీరు వారు చేయాలనుకున్న దానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఇప్పుడు ఏమి జరుగుతుందో వేచి చూడండి అని అనే బదులుగా మీరు ఇప్పటికీ మీ నిర్ణయంతో ముందుకు వెళుతుంటే, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను అని మీరు వారికి చెప్పండి
3. మీరు మద్దతును ఉపసంహరించుకోవద్దు. వారు విఫలమవ్వాలని అస్సలు ఎదురు చూడకండి. వారు విఫలమైతే వారు తమ తప్పు తెలుసుకొని మీ మాటలను ఒప్పుకుంటారు అని అనుకోకండి. వారి నిర్ణయం వారికి తప్పుగా మారినప్పటికీ వారిని దూషించవద్దు. వారిని శక్తివంతం చేయడానికి వారి కోసం మెడిటేషన్ చేయండి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచండి, గత తప్పులకంటే పరిష్కారాలపై దృష్టి పెట్టడంలో వారికి సహాయపడండి.
4. మీకుపర్ఫెక్ట్ గా ఉన్న సలహా మరొకరికి సరైనది కాకపోవచ్చు . మీ సలహా మీ స్వభావం, ప్రతిభ, సామర్థ్యం, అవగాహన మరియు ప్రాధాన్యత ఆధారంగా ఉంటుంది. ఈ విధానాలు ఇతరలకు వేరుగా ఉంటాయి

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 1) 

ఎమోషనల్ ఓదార్పు మరియు శక్తిని ఇవ్వడం   మన జీవితమంతా మనకు తెలిసిన వ్యక్తులకు మరియు మనకు తెలియని వ్యక్తులకు కూడా సేవ చేస్తాము. ఎందుకంటే ఇవ్వడం, సేవ చేయడం మన సహజ లక్షణాలు.

Read More »
7th feb 2025 soul sustenance telugu

అంతర్గత శాంతి మరియు ఆనందం కోసం ఇంట్లో ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటం

ధ్యానం కోసం ఇంట్లో ప్రత్యేకమైన, ఉన్నతమైన తరంగాల గది లేదా చోటును ఏర్పర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మనము అంతర్గత శాంతి, ఆనందం కోసం ఉన్నత ఆధ్యాత్మిక శక్తి గల ప్రదేశాలకు వెళ్తాము. మనం మానసికంగా

Read More »
6th feb 2025 soul sustenance telugu

మనం స్వీయ నియంత్రణను ఎందుకు కోల్పోతున్నాము?

మనం ఎందుకు, ఎలా స్వీయ నియంత్రణను కోల్పోతామో అన్వేషిద్దాం. గాలిలోని కాలుష్య కారకాల గురించి మనకు తెలుసు, కానీ మరొక సూక్ష్మమైన మరియు కీలకమైన భాగం ఉంది, దానిని మనం చూడలేము కాని మనం

Read More »