పాజిటివ్ జీవనం కోసం 10 కొత్త నమ్మకాలు (పార్ట్ 3)

పాజిటివ్ జీవనం కోసం 10 కొత్త నమ్మకాలు (పార్ట్ 3)

నమ్మకం 3 – అహం ఒక  శక్తి; అహం లేని వ్యక్తి సాధారణంగా పిరికిగా లేదా బలహీనంగా ఉంటాడు.

నిజం – అహం అనేది ఒక అసత్యపు గుర్తింపు, ఇది వ్యక్తిని వారి ఆత్మగౌరవం నుండి దూరం చేస్తుంది. వ్యక్తి తాత్కాలికమైన, మారుతూ ఉండే తన భౌతికత, తన పాత్రలు మరియు సంబంధాల యొక్క అహంతో తనను తాను గుర్తించుకున్నప్పుడు బలహీనమవుతాడు.  వినయపూర్వకమైన వ్యక్తి, మంచి ఆత్మగౌరవంతో, ఆత్మీయ స్థాయిలో తనను మరియు ఇతరులను ప్రేమిస్తాడు మరియు గౌరవిస్తాడు, భగవంతుని నుండి, ఇతరుల నుండి ఆశీర్వాదాలను పొందుతాడు. ఇది అలాంటి వ్యక్తిని ఆంతరికంగా బలపరుస్తుంది మరియు అందరూ వారిని పాజిటివ్ దృష్టితో చూస్తారు. అలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్లినా పాజిటివిటీను ప్రసరింపజేసి  ఇతరుల ఆత్మ విశ్వాసాన్ని పెంచి సిగ్గుపడకుండా చేస్తాడు.

 

నమ్మకం 4 – కామం మరియు మోహం సంబంధాలలో ప్రేమను పెంచుతుంది.

నిజం – కామం మరియు మోహం అంటే మరొకరిని పొందాలనే కోరిక  కలిగి ఉండడం. అది ఆత్మ యొక్క శక్తిని హరించడం వంటిది. మనం ఇతరుల భౌతిక రూపం మరియు భౌతిక వ్యక్తిత్వానికి కనెక్ట్ అయ్యే బదులుగా వారికి స్వేచ్ఛగా ఇస్తూ, వారి గుణాలతో కనెక్ట్ అయినప్పుడు సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది.

నమ్మకం 5 – దురాశ భౌతిక సంపదను ఆకర్షించి ఆనందాన్ని ఇస్తుంది.

నిజం – దురాశ అనేది నెగెటివ్ కోరిక, ఇది పనిలో మోసాన్ని మరియు అసత్యాన్ని కూడా తెచ్చి సంబంధాలకు హాని చేస్తుంది. అత్యాశతో ఉన్న వ్యక్తి తను జీవితంలో కావాలిసిన భౌతికమైనవి సాధించడానికి మంచితనాన్ని త్యాగం చేసి తన మనస్సాక్షిని కూడా కోల్పోతాడు. వ్యక్తి తన అంతరాత్మతో ఎంత సంపన్నంగా ఉంటాడో అంత భౌతిక సంపదను మరియు దీర్ఘకాలిక శాశ్వత ఆనందాన్ని ఆకర్షిస్తాడని ఆధ్యాత్మిక జ్ఞానం చెబుతుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »