Hin

కోపాన్ని అధిగమించడం - విజయానికి 5 మెట్లు (పార్ట్ 1)

కోపాన్ని అధిగమించడం - విజయానికి 5 మెట్లు (పార్ట్ 1)

మనందరం జీవితంలో ఉదయం నుండి రాత్రి వరకు, ఎదురయ్యే పరిస్థితులలో  కోపం సహజమని మరియు అత్యంత సులభమైన ప్రతిస్పందనగా అని భావిస్తాము. ఒకసారి ఒక వైద్యుడు తన క్లినిక్‌లో ఒక రోగిని కలుస్తూ, ఒక రోజులో నీకు ఎన్నిసార్లు కోపం వస్తుంది అని అడిగాడు. ఆమె నేనెప్పుడూ లెక్క వెయ్యలేదని, అయితే ఒక్కరోజు కూడా నా భర్తపైనా, నా పిల్లలపైనా, పనిమనిషిపైనా లేదా దుకాణదారుడిపైనా కోపం తెచ్చుకోకుండా, గడవదని సమాధానం ఇచ్చింది. కోపానికి గురైన ప్రతి సారి మీలో ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అని డాక్టర్ అడిగారు. ప్రతి సెకను కోపం లేదా కోపానికి సంబంధించిన ఎమోషన్స్  వలన  శరీరం లోపల నెగెటివ్  రసాయనాలు మరియు నెగెటివ్ హార్మోన్ల స్రావానికి కారణమవుతుంది. ఇది నిరంతరం శరీరానికి రక్తపోటు, మధుమేహం, నిరాశ, నిద్రలేమి మరియు శరీరంలో క్యాన్సర్ వంటి నెగెటివ్ అనారోగ్యాలను కలిగిస్తుంది. అంతేకాక  మనస్సు వల్ల తీవ్రమైన మానసిక అనారోగ్యాలను కలిగిస్తుంది. అలాగే, కొద్ది పాటి ద్వేషం, పగ, దూకుడు మరియు ఏదైనా ఇతర నెగెటివ్ ప్రవర్తనల తర్వాత  మన మనస్సులలో ఉన్న శాంతి, ప్రేమ మరియు ఆనందం యొక్క పాజిటివ్ మానసిక స్థితి చాలా తక్కువ సమయం  ఉంటుంది. ఈ సందేశంలో కోపాన్ని అధిగమించడానికి మేము మీకు 5 మెట్లను అందిస్తున్నాము: 

  1. మీరు మార్చలేని వాటిని మార్చడానికి ప్రయత్నించవద్దు – చాలా తరచుగా మనం మన జీవితంలో కంట్రోల్ లో లేని పరిస్థితి మార్చడానికి ప్రయత్నిస్తాము, జీవితంలో విభిన్న పరిస్థితులు,  వ్యక్తుల ప్రవర్తనలతో సహా జీవితంలోని పరిస్థితులు, మన కోరిక మేరకు ఉండవు మరియు మనల్ని ప్రతికూలంగా మరియు కోపంతో నిండిన ఎమోషన్స్ తో ప్రతిస్పందించేలా చేస్తాయి. మనం దృశ్యాన్ని మార్చలేనప్పుడు, మనం నిరాశకు గురవుతాము మరియు విషయాలు మన నియంత్రణలో లేవని భావిస్తాము. ఆ సమయంలో, ప్రతిదీ మన విధంగా మరియు మన కోరికల ప్రకారం జరగదని గుర్తుంచుకోండి. అలాగే, మనలో మనం ఎంత పాజిటివ్ మార్పును తెచ్చుకుంటామో, అంతగా మన మార్పు యొక్క శక్తి మన చుట్టూ ఉన్న పరిస్థితులను  పాజిటివ్ గా మారుస్తుంది. కాబట్టి, ఒక నిర్దిష్ట వ్యక్తికి నిర్దిష్టమైన గుణాలు ఉండాలని లేదా నిర్దిష్ట పరిస్థితి మరింత పాజిటివ్ గా ఉండాలని కోరుకునే బదులు, ఆ గుణంతో లేదా పాజిటివిటీతో మిమ్మల్ని మీరు నింపుకోండి మరియు దానిని మీ పరిసరాలకు రేడియేట్ చేయండి. ఈ విధంగా మీరు ఆశించటం మాని అంగీకరించటం మొదలుపెడతారు. ఎందుకంటే ఆశించటమే కోపం యొక్క అన్ని ఎమోషన్స్ కి  మూలం. 

 (రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

10th sep 2024 soul sustenance telugu

5 రకాల ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకోండి

జీవించే కళ  ప్రధానంగా 5 రకాల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది: శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం. పరస్పరం అనుసంధానించబడి ఉండటం వలన, ఇవన్నీ మన

Read More »
9th sep 2024 soul sustenance telugu

గందరగోళం కాకుండా స్పష్టత కలిగి ఉండండి

శాంతి మరియు స్థిరత్వంతో కూడిన జీవితాన్ని గడపడానికి స్పష్టత కలిగి ఉండటం కీలకం. కానీ ఎలా ఉండాలి, ఏం చేయాలి లేదా ఏ దిశలో అడుగు పెట్టాలి అని మనం తరచుగా ఆలోచిస్తూ ఉంటాము.

Read More »
8th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 2)

శ్రీ గణేషుని పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. వ్యక్తుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేషుని చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం చూపిస్తారు,

Read More »