19th march soul sustenance telugu

భగవంతుని జ్ఞానాన్ని ఆచరించడానికి 5 మార్గాలు

  1.  భగవంతుడు చెప్పే మాటలను రోజూ మీ మనసులో నోట్ చేసుకోండి – భగవంతుడు రోజూ మనకు ఎంతో చక్కని జ్ఞానాన్ని వినిపిస్తాడు, వాటిని మనం పుస్తకాలలో, మనసులలో నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత, రోజంతటిలో ఆ పాయింట్లను చాలాసార్లు గుర్తు తెచ్చుకున్నప్పుడు ఆ పాయింటను మనసు కూడా పదే పదే వింటుంది. అప్పుడు ఈ ప్రతి పాయింటను మన నిజ జీవితంలో ఆచరిస్తాము, జ్ఞాన సాగరుడైన పరమాత్మ సంతానంగా మాస్టర్ జ్ఞాన సాగరునిగా అవుతాము.
  2. భగవంతుడు చెప్పిన వాక్యాలను చింతన చేస్తూ, మనసుతో చూస్తూ మెడిటేషన్ చేయండి – మీరు విన్న ప్రతి భగవంతుడి వాక్యానికి ఒక చక్కని రూపాన్ని ఇవ్వండి, లోతుగా దాని గురించి ఆలోచించి, మనసులో దానికి ఒక చిత్ర రూపాన్ని ఇవ్వండి. భగవంతుడు ఉన్నతమైన టీచరు, వారిచ్చే జ్ఞానము సర్వ శ్రేష్ఠమైనది, గుహ్యమైనది. భగవంతుడిచ్చే జ్ఞానాన్ని ఆచరించడానికి మెడిటేషన్ ఒక సుందరమైన విధానము.
  3. పవిత్రతలో, పాజిటివ్‌లో ప్రతి అడుగులో భగవంతుడిని అనుసరించండి – భగవంతుడి జ్ఞానము మనలో పాజిటివ్ మైండును, పవిత్ర బుద్ధిని పెంచుతుంది. మన ఆలోచనలు, భావాలు, మాటలు, కర్మలు, లక్ష్యం అన్నీ ఆ చక్కని అనుభూతికి సాక్ష్యాలు. అప్పుడు మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిని, సంబంధాలను జ్ఞాన నేత్రంతో చూడగలుగుతాము.
  4. ప్రతి జ్ఞాన ముత్యాన్ని ఇతరులతో పంచుకోండి – మన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, తోటివారికి ఇవ్వగలిగిన అత్యుత్తమ కానుక – భగవంతుడి జ్ఞానము. దానిని ఆంతరికంగా అనుభూతి చెందాలి. ఈరోజుల్లో, ఇంచుమించు ప్రతి ఒక్కరూ ఒత్తిడిలో, బాధలో ఉన్నారు. శాంతికి, సంతోషానికి ఆధారము జ్ఞానము. ఇదే ఆత్మకు ప్రకాశము, ఆత్మ పరిశీలనకు దోహదపడి ఆలోచనలు మరియు వ్యక్తిత్వము మారుతాయి.
  5. రోజు చివర్లో మీ ఉన్నతిని చెక్ చేసుకుని ఛేంజ్ అవ్వండి – పనులతో బిజీ ఉన్న తర్వాత, రోజు చక్కగా ముగియాలంటే రోజంతటి ఉన్నతిని జ్ఞానమనే దర్పణంలో పరిశీలించుకోవాలి. ఏవైనా పొరపాట్లు చేసానా అని చెక్ చేసుకోవాలి. స్వయాన్ని పరిశీలించుకున్న తర్వాత, పొరపాట్లను  సరిదిద్దుకుని మరుసటి రోజును ప్రారంభించండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »