Hin

మెడిటేషన్ ద్వారా ఆత్మ శక్తిని పెంచుకోవడం

మెడిటేషన్ ద్వారా ఆత్మ శక్తిని పెంచుకోవడం

మెడిటేషన్ యొక్క ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి ఆత్మ శక్తిని పెంచడం మరియు మనకు  నెగెటివ్ మరియు బలహీన ఆలోచనలు లేకుండా చేయడం. భగవంతుడు ఒక ఆధ్యాత్మిక  శక్తి మరియు వారు సర్వోన్నతుడు. వారిని సర్వ శక్తివంతుడు అని అంటారు. మనం మెడిటేషన్ చేసేటప్పుడు, మనం భగవంతునితో కనెక్ట్ అయి ఉంటాము మరియు అతని శక్తిని నింపుకుంటాము. మెడిటేషన్ తో ఆత్మ శక్తిని పెంచుకునే 5 మార్గాలను చూద్దాం:  

    1. భగవంతుడిని సర్వ శక్తివంతునిగా భావించి, వారితో కనెక్ట్ అవ్వండి – మనం మెడిటేషన్  చేసేటప్పుడు, మనం మొదట స్వయాన్ని ఆత్మగా, నుదిటి మధ్యలో, శాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని ప్రసరింపజేసే మెరిసే నక్షత్రంగా అనుభవం చేస్తాము. ఈ స్వచ్ఛమైన అనుభూతిలో, ఒక చిన్న మెరిసే కాంతి పుంజము వలె మనం భౌతిక ప్రపంచానికి  దూరంగా ఉన్న అందమైన ఆత్మల ప్రపంచానికి ప్రయాణిస్తాము. సర్వ శక్తివంతుడైన పరమాత్మతో లోతైన సంబంధాన్ని ఏర్పరుచుకుంటాము. ఇది ఆత్మను అపారమైన శక్తితో నింపుతుంది.
    2. ప్రతిరోజూ భగవంతునితో సంభాషించి మిమ్మల్ని మీరు శక్తితో నింపుకోండి – పరమాత్ముడు  ప్రేమ సాగారుడు,  దయా సాగరుడు. మనం మెడిటేషన్లో వారితో కనెక్ట్ అయినప్పుడు మన మనసులో మాట వారు వింటారు. భగవంతునితో మాట్లాడటం ద్వారా మనల్ని మనం దృఢ నిశ్చయంతో నింపుకోవచ్చు మరియు జీవితంలోని కఠిన పరిస్థితులను ఎలాంటి భయం మరియు అసహనం లేకుండా ఎదుర్కోవచ్చు.
    3. ప్రతి కార్యంలో భగవంతుడి తోడుని అనుభూతి చేసుకొని వారి శక్తితో నడవండి – మనం మన స్వంత శక్తితో ఏదైనా పని చేసినప్పుడు, మనకు శక్తి పరిమితంగా ఉంటుంది. కానీ, మనతో ప్రతి చర్యలో భగవంతుడిని తోడు అనుభూతి చేసుకుంటే మన  శక్తి పెరుగుతుంది ఎందుకంటే పరమాత్మ శక్తి ఆ కార్యానికి  మార్గనిర్దేశం చేస్తుంది. మనం ప్రతిరోజూ ఇలా చేస్తే, మనం శక్తివంతంగా మరియు మరింత దృఢంగా ఉంటాము.
    4. ప్రతిరోజూ పరమాత్ముని జ్ఞానం మరియు మంచితనాన్ని గ్రహించడంతో ప్రారంభించండి – పరమాత్ముని జ్ఞానాన్ని వారి  శక్తివంతమైన స్మరణలో వినడం అనేది రోజును ప్రారంభించడానికి ఒక అందమైన విధానం. పరమాత్ముని మంచి మాటలతో మన మనస్సును మరియు బుద్ధిని ఛార్జ్ చేసుకుంటే, మన ఆత్మ శక్తిని పెంచుకుంటాము మరియు మన కార్యాలయంలో,  మన కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు ప్రతి ఒక్కరికీ ఆ శక్తిని ప్రసరింపజేస్తాము.
    5. మీ ఇల్లు మరియు కార్యాలయంలోని వాతావరణాన్ని పరమాత్ముని ప్రేమ మరియు శక్తితో నింపండి – ఆత్మ శక్తిని పెంచుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గం ఆ శక్తిని అందరితో పంచుకోవడం మరియు ప్రతి ఒక్కరినీ పరమాత్మునికి మరియు వారి  ప్రేమపూర్వక స్మరణకు దగ్గరగా తీసుకురావడం. కాబట్టి, మనం రోజూ కలిసే ప్రతి ఒక్కరిలో మెడిటేషన్ పట్ల ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేయాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »
17th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ

Read More »
16th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి

Read More »