Hin

1st April Soul Sustenance Telugu

సుప్రీమ్ స్టార్ మనపై ప్రకాశిస్తున్నారు (పార్ట్ 1)

జీవితం ఒక అందమైన ప్రయాణం, దీనిలో మనం ఎల్లప్పుడూ ఎందరో వ్యక్తుల చుట్టూ ఉంటాము.  మనం ఇతరులకు,  మనకు మంచి విషయాలను కోరుకుంటున్నాము. కొన్నిసార్లు, అందరి కోసం మనం కోరుకునేవన్నీ నెరవేరుతాయి మరియు కొన్నిసార్లు నెరవేరవు. ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారికి మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ మంచిని కోరుకుంటారనేది ఆశ్చర్యకరమైన విషయం. అయినప్పటికీ, ప్రతి ఒక్కరు అర్హులే అని మనం భావించే మంచి అంతా వారికి రాకపోవచ్చు లేదా కొంచెం ఆలస్యంగా రావచ్చు. మనం పరస్పరం ఒకేలాంటివి  కావాలని కోరుకుంటున్నామా? అవును, కొన్నిసార్లు కోరుకుంటాము. నిజానికి, ఎక్కువ సార్లు అలాగే కోరుకుంటాము. అన్నింటికంటే, మనమందరం జీవితంలో ఒకే మంచి విషయాలను కోరుకుంటాము – ఆధ్యాత్మిక స్థాయిలో ప్రేమ, ఆనందం, శాంతి, భౌతిక స్థాయిలో ఆరోగ్యం, సంపద మరియు మన భాద్యతలు మరియు సంబంధాలలో విజయం. మనం అనేక గత జన్మలలో ఒకరితో ఒకరు అనేక అందమైన పాత్రలు పోషించిన ఆత్మలం  లేదా జీవులం. అలా పాత్రలు పోషించినప్పుడు, మనం చాలా స్వచ్ఛమైన ప్రేమతో నిండిన సంబంధాలను కలిగి ఉన్నాము . భగవంతుడు ఆధ్యాత్మికతకు పరమ జ్యోతి.  ఆత్మిక తల్లి-తండ్రి.   మనమందరం మన జీవితంలో మంచి విషయాలను వారి నుంచే కోరుకుంటాము.  మనం మన కోసం మాత్రమే కాకుండా ప్రపంచంలోని ఆత్మలందరి కోసం కోరుకుంటాము, ఇది మనం శాశ్వతంగా కనెక్ట్ అయ్యి ఉన్న వాసుధైక కుటుంబం.

భగవంతుడు మనందరీ  సంతోషకరమైన కోరికలను నెరవేర్చడానికే మనలో జ్ఞానం మరియు శక్తిని నింపుతారు . ప్రపంచంలోని ప్రతి ఆత్మను చేరుకొని అందరికీ ఆ సంతోషాన్ని ఇచ్చేందుకు ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. దేవుడా, సుప్రీమ్ స్టార్ అయిన భగవంతుడు మనపై ప్రకాశిస్తారు . వారి మార్గదర్శకత్వంలో మనం దీన్ని చేయగలము. 

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

15th June 2025 Soul Sustenance Telugu

వ్యక్తులు మీపై ఆధారపడేలా చేయవద్దు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొంతమందికి లేదా కొన్ని పరిస్థితులకు మనమే ఎంతో ముఖ్యమని, మనం లేకుండా వారు జీవితాన్ని గడపలేరనే నమ్మకంతో మనం తరచుగా జీవిస్తుంటాము.

Read More »
14th June 2025 Soul Sustenance Telugu

భగవంతుడు – ఈ సృష్టి యొక్క ఆది బిందువు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు సర్వ శక్తివంతుడు. వారు ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో  మంచితనం మరియు దైవత్వం క్షీణించిన ప్రతిసారీ

Read More »
13th June 2025 Soul Sustenance Telugu

మిమ్మల్ని మీరు ఎలా ఆశీర్వదించుకోవాలి?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో సాధువులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబం మరియు స్నేహితుల ఆశీర్వాదాల శక్తిని మనమందరం పొందాము. ఆశీర్వాదం అంటే వారందరూ మన

Read More »