Hin

పాజిటివిటీ ని జాగృతి చేయడం (పార్ట్ 2)

పాజిటివిటీ ని జాగృతి చేయడం (పార్ట్ 2)

మనం సగటున ప్రతి 2 సెకన్లకు లేదా కొన్నిసార్లు అంతకంటే తక్కువ సమయంలో ఒక కొత్త ఆలోచన చేస్తామని మీకు తెలుసా? మనము భయంతో, అసౌకర్యంతో, బాహ్య పరిస్థితి యొక్క  నెగిటివ్ ప్రభావంలో ఉన్నప్పుడు ఈ వేగం క్రమంగా పెరుగుతుంది. అంతర్గతంగా ఉన్న ‘నా’ లేదా ‘నేను’ పరిస్థితుల సృష్టికర్త కాదు కాబట్టి మనం దానిని బాహ్యం అంటాము. భౌతిక శరీరం కూడా బాహ్యమైనదే. నా స్వంత నెగిటివ్ వ్యక్తిత్వ లక్షణాల నుండి అంటే పూర్తిగా అంతర్గత ‘నా’ లేదా ‘నేను’ అనే దానితో వచ్చిన పరిస్థితులు తప్ప ఇతర  పరిస్థితులన్నీ బాహ్యమైనవే. పూర్తిగా అంతర్గతంగా నెగిటివ్ వ్యక్తిత్వ లక్షణాల రూపంలో ఉండే పరిస్థితులకు వివిధ ఉదాహరణలు ఉన్నాయి. ఉదా. ఎదో ఒక రోజున నేను ఎటువంటి ప్రత్యేకమైన కారణం లేకుండా దిగులుగా లేదా విచారంగా ఉంటాను. మరొక రోజు నేను నా స్వంత స్వభావం లేదా పాజిటివ్ లక్షణాలు లేదా అంతర్గత శక్తుల అహంకార ఆలోచనలను అనుభవం చేస్తాను. కొన్నిసార్లు నేను ఏ నిర్దిష్ట వ్యక్తి లేదా వస్తువు లేదా పరిస్థితి లేకుండా భయపడతాను.  ఇది కేవలం అంతగా ప్రాధాన్యత లేని దశ.  నేను ప్రత్యేక కారణం లేకుండా భయపడుతూ ఉంటాను లేదా మరొక సందర్భంలో నా జీవితంలో ప్రతిదీ బాగానే ఉన్నప్పటికీ నేను విజయవంతం కాలేదని భావిస్తూ ఉంటాను. మరొక రోజు, నేను పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పటికీ, అనారోగ్యంతో ఉన్న వారెవరినీ కలసినా, అనారోగ్యం గురించి విన్నా, నాకు అనారోగ్యం వస్తుందేమో అని చింతిస్తూ ఉంటాను. కాబట్టి, నా ఆందోళన పూర్తిగా నేను సృష్టించనదే. ఇవి నేను పూర్తిగా సృష్టించిన పరిస్థితుల ఉదాహరణలు.

ఇంకా, బయటి పరిస్థితుల వల్ల ప్రేరేపించబడిన నా స్వంత వ్యక్తిత్వ లక్షణాలతో వచ్చే పరిస్థితులు ఉంటాయి.  నేను చదివినవి, చూసినవి లేదా విన్నవి  నాలో నెగిటివ్ వ్యక్తిత్వ లక్షణాన్ని బయటకు తెచ్చి అలాంటి పరిస్థితులకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితులకు ఉదాహరణలు – నా స్నేహితుడు  చదువులో  మరింత విజయవంతమయ్యాడు. అది చూసి నాలో అసూయ యొక్క ఆలోచనలు వస్తాయి. ఈ సందర్భంలో, ఇది నేనే సృష్టించిన పరిస్థితి.  అయితే, ఇది మరొక వ్యక్తి లేదా బాహ్య సంఘటన ద్వారా ప్రేరేపించబడింది. అతను నాకు ఎటువంటి హాని కలిగించలేదు మరియు పరిస్థితిని సృష్టించలేదు కానీ నేను కేవలం నా ఆలోచనల  కారణంగానే  పరిస్థితిని సృష్టించాను. అటువంటి పరిస్థితికి మరొక ఉదాహరణ – ఆఫీసులో మా బాస్ స్థానం నా కంటే ఉన్నతమైనది అనే కారణంగా నాకు అతనంటే భయం. అతను చాలా మంచి వ్యక్తి, నాతో చాలా మర్యాదగా ఉంటారు మరియు నాపై ఆధిపత్యం చెలాయించడానికి ఎప్పుడూ ప్రయత్నించరు, కానీ నా ఆలోచన కారణంగా నాపై అతను ఆధిపత్యం చెలాయిస్తున్నట్లుగా అనిపిస్తుంది. లేదా మరొక రోజు, గుండెపోటుతో మనుష్యులు  ఎలా చనిపోతున్నారనే దాని గురించి నేను ఒక వార్త విన్నాను. కొంట్రోల్ లేని అధిక కొలెస్ట్రాల్ లేదా అధిక రక్తపోటు వంటి ఏవైనా లక్షణాలతో నేను బాధపడనప్పటికీ, ఇది నాలో అభద్రతా ఆలోచనలను కలిగిస్తుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th jan 2025 soul sustenance telugu

మిమ్మల్ని విమర్శించే వ్యక్తులపై దృష్టి పెట్టవద్దు

మనం లేదా మనం చేసే పనికి మనల్ని ఇష్టపడని వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారి గురించి మనకు తెలిసినప్పటికీ, వారిపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. మనకు మద్దతు ఇచ్చి, సానుకూల శక్తిని పంపే

Read More »
18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »
17th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ

Read More »