1st feb soul sustenance telugu

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (భాగం 1)

మీ ప్రతిరోజును ప్రకాశవంతంగా ప్రారంభించడానికి మీ వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు సామాజిక జీవితంలో దిన చర్యను సెట్ చేసుకోవాలి. దానితో పాటు, మనస్సు మరియు బుద్ధి కోసం టైమ్ టేబుల్‌ని సెట్ చేయండి, అందులో మీరు మీ మనసు బుద్ధిని పరమాత్మ లేదా భగవంతుని స్మరణతో నింపండి.పరమాత్ముడు సర్వోన్నతమైన తండ్రి మరియు తల్లి కూడా. తల్లి కడుపులో ఒక చిన్న శిశువు తయారై, బొడ్డు తాడు ద్వారా ఆమెతో అనుసంధానించబడి, బొడ్డు తాడు ద్వారా తన తల్లి నుండి శారీరిక పోషణ పొందుతుందో, అదే విధంగా ఆత్మనైన నేను నా ఆత్మిక తల్లితో అనుసంధానించబడి ఉండాలి. ఆత్మకు పరమాత్ముడు నిజమైన తల్లి తండ్రి. వారు ప్రేమ సాగరుడు. ఆయనతో అనుబంధం కలిగి ఉండడం అనేది ఆ ప్రేమతో నన్ను నింపుకోవడానికి మరియు కేవలం మాటల్లో మరియు కర్మలలో కాకుండా మనస్సు లోతుల్లో స్వచ్ఛంగా మారడానికి ఒక మార్గం.

మనల్ని మనం ఆత్మగా అనుభవం చేసుకుంటూ పరమాత్మతో కనెక్ట్ అయినప్పుడు ఆత్మ తిరిగి పవిత్రం అవుతుంది. పరమాత్ముడు భౌతికమైన వారు కాదు. కాబట్టి, అతనితో సుందరమైన సంబంధాన్ని జోడించడానికి ఆత్మిక స్పృహ, అంటే నేను ఈ శరీరం కాదు, ఆత్మను. ఆత్మ శరీరాన్ని నియంత్రించే ఆధ్యాత్మిక శక్తి. ఒకసారి నేను శరీరంలో లేనప్పుడు లేదా మరో మాటలో చెప్పాలంటే శరీరాన్ని విడిచిపెట్టినపుడు (దీనినే మనం సాధారణంగా ఎవరైనా చనిపోయారని లేదా ఇక లేరని చెబుతాము) ఆ శరీరం దుమ్ము లాంటిది, దానిలో ప్రాణం ఉండదు. కాబట్టి, నేను, ఆధ్యాత్మిక శక్తి లేదా ఆత్మను, శాశ్వతమైన మరియు స్థిరమైనవాడిని. శరీరం నా తాత్కాలిక వాహనం అని అర్థం చేసుకోవడం, భగవంతునిలో ఉన్న ఆత్మిక సంపదకు తలుపులు తెరవడానికి మొదటి మెట్టు. మెడిటేషన్ అనేది పరమాత్మతో ఒక సుందరమైన సంబంధం.ఆత్మను మరింత పవిత్రంగా, ప్రేమమయంగా చేస్తుంది. మనమందరం మొదట పవిత్రంగానే ఉన్నాము కానీ కాలం గడిచేకొద్దీ అపవిత్రులమయ్యాము.
మెడిటేషన్ ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరికి అత్యంత అవసరం. మెడిటేషన్ అనే బొడ్డు తాడు మన జీవితంలో ప్రతి అడుగులో
అవసరం. గర్భంలో ఉన్న శిశువు తన తల్లికి నిరంతరం శారీరక బొడ్డు తాడుతో అనుసంధానించబడి ఆహారాన్ని పొందుతుంది మరియు పెరుగుతుంది. పరిపక్వం చెందుతుంది కూడా. ఒక రోజు పుట్టడానికి సిద్ధంగా ఉంటుంది. అది భౌతికమైన ఎదుగుదల మరియు మనం ఆధ్యాత్మికంగా ఎదిగి ఆత్మిక శక్తులతో నిండి ఉండాలి. మెడిటే షన్ అనే టెక్నిక్ మనలోని ఆధ్యాత్మిక శక్తిని తీసుకువస్తుంది మరియు దాని ఫలితంగా మనం అన్ని శక్తులతో నిందుతాము

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd march soul sustenance telugu

23rd March – జీవన విలువలు

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి మనమందరం గొప్ప వక్తలు కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణమైన సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను

Read More »
22nd march soul sustenance telugu

22nd March – జీవన విలువలు

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (భాగము 3) నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాము. ఆత్మ శక్తికి దోహదపడే మిగిలిన అంశాలు: శుభ భావన, శుభ కామన, ఇతరులపై సంపూర్ణ

Read More »
21st march soul sustenance telugu

21st March – జీవన విలువలు

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (భాగము 2) నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాము. ఆత్మ శక్తికి దోహదపడే వివిధ అంశాలు: ఆంతరిక మౌనము మరియు ఏకాగ్రతా శక్తి –

Read More »