Hin

1st july 2023 soul sustenence telugu

సంతోషకరమైన ప్రపంచం కోసం 5 సహయోగ విధానాలు (పార్ట్ 1)

మన దైనందిన జీవితంలో అత్యంత అందమైన ఎమోషన్, మనమందరం చాలా సహజంగా కోరుకునేది  ఆనందం. మనమందరం నివసిస్తున్నమన ప్రపంచం ఒకప్పుడు ఆనందం మరియు ఉత్సాహంతో నిండిన భూమి. అదే ప్రపంచం, కాలం గడిచే కొద్దీ దాని ఆనందాన్ని కోల్పోయింది. ఈ రోజు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి వారి జీవితంలో కొన్ని సవాళ్లు,  పరిస్థితులు ఉన్నాయి. ఈ  పరిస్థితుల వలన కొన్నిసార్లు వారు ఎప్పటికీ  ఆనందంగా ఉండలేరు. మనం ప్రపంచాన్నంతటినీ ఆనందం మరియు తేలికతనంతో నిండిన ప్రదేశంగా ఎలా మార్చగలమో ఆలోచించడం చాలా ముఖ్యమైనదే. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రతి ఒక్కరి ఆలోచన, మాట మరియు సహకారం అవసరం. ఈ లక్ష్యం కష్టంగా అనిపించవచ్చు కానీ ఇది చాలా సాధ్యమే. ఈ ప్రయోజనాన్ని నెరవేర్చడానికి మనం తీసుకోగల 5 ముఖ్యమైన సహయోగ విధానాలను చూద్దాం:

  1. నేను మారినప్పుడు, ప్రపంచం మారుతుంది – ప్రపంచ పరివర్తనకు కావలసిన మొదటి మరియు ప్రధానమైన అడుగు స్వ పరివర్తన. కొన్ని సమయాల్లో సోమరితనం లేదా సాకులు చెప్పడానికి చాలా సాధారణమైన ఆలోచన లేదా భావమే ఏమిటంటే – అది నా మార్పు ద్వారా ఎనిమిది బిలియన్ల జనాభా కలిగిన ప్రపంచం ఎలా మారుతుంది అని. కానీ నేను మారినప్పుడు, నా కుటుంబం మారుతుందని గ్రహించడం ముఖ్యం. ప్రతి కుటుంబం మారినప్పుడు, మన సమాజం మారుతుంది మరియు మన సమాజం మారినప్పుడు మన నగరం తరువాత మన దేశం మారుతుంది.  చివరగా, ప్రతి దేశం సంతోషంగా మారడంతో, ప్రపంచం మారుతుంది. కాబట్టి, నన్ను నేను సంతోషపెట్టడానికి పాజిటివ్  ఆలోచనలను ఆలోచించడం, మానసికంగా మరింత దృఢంగా మారడమనే ఈ మొదటి అడుగు వేద్దాం. మీ జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానం మరియు మెడిటేషన్ యొక్క చేతులను  పట్టుకోండి. వాటిని మీ సన్నిహిత సహచరులుగా చేసుకుంటే తక్కువ వ్యవధిలో, మీ చింత, ఆందోళన, భయం మరియు అభద్రత వంటి మీ ఆలోచనలు మీకు గతంగా మారతాయి మరియు మీరు తేలికగా మరియు సంతోషంగా ఉంటారు. ఈ ఆనందం మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రసరిస్తుంది.

 

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »
27th april 2025 soul sustenance telugu

మీ సంతోషాల గురించి మాట్లాడండి, బాధల గురించి కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో ఎన్ని మంచి విషయాలు జరిగినా, మంచి మరియు సానుకూల విషయాలకు బదులుగా మన ఆరోగ్యం, ఆర్థిక, సంబంధాలు మరియు

Read More »