Hin

వైఖరి ముఖ్యమైనది (పార్ట్ 2)

వైఖరి ముఖ్యమైనది (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో చర్చించినట్లుగా, ఒక వ్యక్తి పట్ల మన వైఖరి సాధారణంగా అతడు లేదా ఆమె గురించి ఇతరుల నుండి మనం వినే వాటిపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు, పాజిటివ్ వైఖరి కలిగి ఉండాలని నిశ్చయించుకున్న వ్యక్తి తాను విన్నవన్నీ తనపై ప్రభావం చూపనివ్వడు. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవటంలో మరియు అవసరమైతే ఇతరులు ఆ వ్యక్తి గురించి చెప్పినదానిలో బ్యాలన్స్  ను కాపాడుకుంటూ ఒకే వైఖరి తో ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు ఒక నిర్దిష్ట పాత్రలో, జీవితంలోని ఏ రంగంలోనైనా, ఇతరుల నుండి కూడా ఒక వ్యక్తి గురించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే మనం ఎదుటి వ్యక్తి గురించి కబుర్లు చెప్పాలని, అతని గురించిన చర్చల్లో మునిగితేలాలని కాదు. ఇది కొన్నిసార్లు అనవసరం కావచ్చు ఎందుకంటే కొన్నిసార్లు వ్యక్తులు అభిప్రాయాన్ని తప్పుగా కూడా ఇస్తారు. కానీ అది ప్రతిసారీ నిజం కాదు. కొన్నిసార్లు అభిప్రాయం సరైనది కావచ్చు మరియు అంత పాజిటివ్ గా ఉండకపోవచ్చు. అలాగే, మీరు స్వీకరించే నిర్దిష్ట వ్యక్తి గురించిన సమాచారాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా మీరు వ్యక్తిని లేదా వ్యక్తికి సంబంధించిన పరిస్థితిని సరిచేయడానికి సరైన చర్యలు తీసుకోవచ్చు.

ఆ సమయంలో, మీరు వింటున్నది నిజమో కాదో తెలుసుకోవడానికి మీ పరిశీలనా శక్తి మరియు నిర్ణయ శక్తులను ఉపయోగించండి, ఎందుకంటే, మీతో సమాచారాన్ని పంచుకొనే అవతలి వ్యక్తి, తప్పు కావచ్చు లేదా ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పవచ్చు లేదా పరిశీలనా శక్తి మరియు నిర్ణయ శక్తులు లోపించినందువల్ల  అబద్ధం చెప్పవచ్చు. అలాగే, కొన్నిసార్లు, అవతలి వ్యక్తి యొక్క సమాచారాన్ని తిరస్కరించడం మంచిది లేదా అది సాధ్యం కాకపోతే, వినండి, కానీ అది మిమ్మల్ని నెగిటివ్ గా ప్రభావితం చేయనివ్వకండి. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఆ సమాచారాన్ని చూసి కలవరపడకూడదు మరియు ఆ సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదు. చివరగా మరియు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరి గురించిన సమాచారం మీతో పంచుకున్నారో ఆ వ్యక్తి పట్ల మీ వైఖరి ఒకేలా ఉండాలి. లేకపోతే మీ వైఖరి మారిన తర్వాత, ఆ వ్యక్తి పట్ల మీ ప్రవర్తన మారుతుంది మరియు ఫలితంగా ఆ వ్యక్తితో మీ సంబంధం నెగిటివ్ గా ప్రభావితమవుతుంది. మనం నెగిటివ్ సమాచారాన్ని విన్న వ్యక్తి పట్ల పాజిటివ్ వైఖరి ఎలా ఉంచుకోవాలి? మేము రేపటి సందేశంలో దాని గురించి కొంచెం పంచుకుంటాము.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »