1st march soul sustenance telugu

విజయానికి 8 శక్తులు (భాగం 3)

రోజంతా మనం ఎదుర్కొనే విభిన్న పరిస్థితుల జాబితా అంతులేనిది. వాస్తవానికి, విభిన్న పరిస్థితులలో అవసరమయ్యే శక్తులు భిన్నంగా ఉంటాయి. కొన్నిసార్లు విజయాన్ని పొంద డానికి ఒకటి లేదా రెండు మాత్రమే కాక మొత్తం అష్టశక్తులు, వివిధ స్థాయిలలో అవసరం పడ తాయి. మనం శక్తిని కార్యరూపంలోకి తీసుకురావాలి. శక్తిని కార్యరూపంలోకి తీసుకురావడానికి మూడు దశలు ఉన్నాయి. మొదటిది ఒక ఫలానా పరిస్థితిలో నాకు ఆధ్యాత్మిక శక్తి అవసరమని గ్రహించి, ఆ శక్తి లేదా శక్తులు ఏవి అని ఖచ్చితంగా తెలుసుకోవడం. దీని కోసం, నాకు ప్రశాంతమైన మనసు మరియు స్వచ్ఛమైన బుద్ధి కావాలి. అంతేకాక మానసికగా, శారీరకంగా, భాద్యత పరంగా మరియు సంబంధాల పరంగా, ఈ వివిధ రకాల పరిస్థితుల గత అనుభవం కూడా అవసరం. ఉదా. ఒకరి ప్రవర్తన నా పట్ల అంత పాజిటివ్ గా లేకుంటే, అటువంటి పరిస్థితిలో, విజయాన్ని పొందడానికి, నాకు సహన శక్తి మరియు ఇముడ్చుకునే శక్తి కావాలి. అలాగే , అటువంటి పరిస్థితులలో, ఎదుర్కోనే శక్తిని ఉపయోగించి, అతన్ని ధైర్యంగా ఎదుర్కోవడం తెలివైన పని కాదు. నేను పరిస్థితిని ఎదుర్కోవాలి కాని వ్యక్తిని కాదు, వ్యక్తిని ఎదుర్కుంటే పరిస్థితిని ఇంకా పాడు చేస్తుంది అని నేను తెలుసుకోవాలి. కనుక , నాకున్న ఛాయిస్ ల గురించి స్పష్టత ఉండాలి మరియు అష్టశక్తులలో దేనిని ఉపయోగించాలని ఖచ్ఛితంగా తెలియాలి..,. సరి అయిన శక్తిని ఎంచుకోకపోతే నెగెటివ్ పరిస్థితి మరింత నెగెటివ్ గా మారుతుంది. అదే విధంగా సరైన శక్తి యొక్క ఎంపిక సమస్యకు పరిష్కారానికి దారి తీస్తుంది.

రెండవ దశ నా చేతన మనసులో ఆ శక్తిని జాగృతి చేయడం. ఇది చాలా కాలంగా ఈ ఎనిమిది శక్తులతో నా సంస్కారాలు ఎలా నిండి ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి, అందరికీ అష్టశక్తులన్నీ కనీసం కొంత వరకైనా ఉంటాయి, కానీ కొంతమంది వ్యక్తుల శక్తుల యొక్క సంస్కారాలు ఇతరులకన్నా దృఢంగా ఉన్న కారణంగా వారు ఆ శక్తులను మరింత సులభంగా జాగృతి చేయగలుగుతారు.

అలాగే, ఆ తర్వాత, చివరి దశ శక్తులను అమలు చేసి కర్మలలోకి తీసుకురావడం. అంటే శక్తి నా మనస్సులో జాగృతం కావడమే కాకుండా అది నా ఆలోచనలు, మాటలు మరియు కర్మల ద్వారా కూడా కనిపిస్తుంది.
(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th march soul sustenance telugu

24th March – జీవన విలువలు

కర్మ సిద్ధాంతం ఎలా పని చేస్తుంది? మనమందరం ఆధ్యాత్మిక శక్తులం  లేదా ఆత్మలం . ప్రపంచ నాటకంలో వివిధ రకాల కర్మలను చేస్తాము. మనమందరం ప్రపంచ నాటకంలో శరీర బ్రాంతిలో కొన్ని మంచి కర్మలు

Read More »
23rd march soul sustenance telugu

23rd March – జీవన విలువలు

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి మనమందరం గొప్ప వక్తలు కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణమైన సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను

Read More »
22nd march soul sustenance telugu

22nd March – జీవన విలువలు

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (భాగము 3) నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాము. ఆత్మ శక్తికి దోహదపడే మిగిలిన అంశాలు: శుభ భావన, శుభ కామన, ఇతరులపై సంపూర్ణ

Read More »