Hin

స్వయాన్ని సిట్యుయేషన్ ప్రూఫ్ చేసుకోవడం(పార్ట్ 1)

స్వయాన్ని సిట్యుయేషన్ ప్రూఫ్ చేసుకోవడం (పార్ట్ 1)

మన జీవితంలో అడుగడుగునా ఏదో ఒక పాఠాన్ని నేర్చుకుంటూనే ఉంటాము.  నిజ జీవిత పరిస్థితులు మనకు గుప్తమైన పాఠాలు. ఇవి తక్కువ సమయంలో మనకు ఏదో ఒకటి నేర్పటానికే వస్తూ ఉంటాయి మరియూ ఇలాంటి ప్రశ్నల రూపంలో మన ముందుకు వస్తాయి –  ప్రియమైన వ్యక్తి మరణం లేదా అభిప్రాయ భేదాల వల్ల దూరమైన వ్యక్తి లేకుండా జీవితాన్ని నేను ఎలా జీవించగలను? అనారోగ్యం లేదా ఆకస్మిక ఆర్థిక నష్టం వంటి ఈ ప్రత్యేకమైన సంఘటన నాకే ఎందుకు సంభవించింది లేదా నా మానసిక బలాన్ని సవాలు చేసే సంఘటనలతో నిండిన కష్టమైన సన్నివేశంలో నేను కోరుకున్న విజయాన్ని ఎప్పుడు సాధిస్తాను లేదా నేను నా గత జన్మలలో ఏమి చేసిన కారణంగా నాకు ప్రియమైన వ్యక్తి రూపంలో నాకు దక్కవలసిన ప్రేమ మరియు గౌరవం నాకు  దొరకటం  లేదు ?

వాటర్ ప్రూఫింగ్ అంటే ఏమిటో మనందరికీ తెలుసు. వర్షంలో వేసుకున్న రెయిన్ కోట్ ఆ పని చేస్తుంది. అలాంటిదే సిట్యుయేషన్ ప్రూఫింగ్. పరిస్థితులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ మీరు జీవితాన్ని గడుపుతున్న విధానాన్ని మార్చుకొని, కష్టమైన పరిస్థితులని గ్రహించటంలో పాజిటివ్ మార్పులను చేసుకుంటూ సిట్యుయేషన్ ప్రూఫ్ గా అవ్వండి. సిట్యుయేషన్ ప్రూఫ్ అంటే మీరు పరిస్థితుల ప్రభావం నుండి విముక్తి అయ్యి ఆందోళన రహితంగా అవ్వటం. మనందరి జీవితం వివిధ రకాల సవాళ్ళు, పరిస్థితులను కలిగి ఉంటుంది. పరిస్థితులు కొన్నిసార్లు కోపం లేదా అసూయ లేదా అహం వంటి నా స్వంత నెగెటివ్ స్వభావం యొక్క తాత్కాలిక పెరుగుదల రూపంలో ఉంటాయి; కొన్నిసార్లు సహోద్యోగి గౌరవించక పోవడం రూపంలో. అలాగే, జీవితంలో కొన్నిసార్లు ఒక సవాలు లేదా కష్టమైన పని చేయాల్సి ఉంటుంది; కొన్నిసార్లు వ్యక్తులతో కష్టమైన సంబంధాలు మరియు ఎవరితోనైనా వ్యక్తిత్వాల ఘర్షణ ఉంటుంది. మరియు కొన్నిసార్లు, నా భౌతిక శరీరంలో తాత్కాలిక ఆరోగ్య సమస్య ఉంటుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th jan 2025 soul sustenance telugu

మీ సంకల్పశక్తి మీకు అతిపెద్ద బలం

మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నా, సరైన ఆహారానికి కట్టుబడి ఉండాలనుకున్నా, వ్యసనాన్ని వదులుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించాలనుకున్నా, విజయం లేదా వైఫల్యాన్ని మన సంకల్ప శక్తికి ఆపాదించుకుంటాము. కొన్నిసార్లు మనం అత్యధిక సంకల్ప

Read More »
19th jan 2025 soul sustenance telugu

మిమ్మల్ని విమర్శించే వ్యక్తులపై దృష్టి పెట్టవద్దు

మనం లేదా మనం చేసే పనికి మనల్ని ఇష్టపడని వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారి గురించి మనకు తెలిసినప్పటికీ, వారిపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. మనకు మద్దతు ఇచ్చి, సానుకూల శక్తిని పంపే

Read More »
18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »