20th april soul sustenance telugu

మనం మానవ యంత్రాలము కాదు, మానవ జీవులం (పార్ట్ 2 )

మీరు రోజును ప్రారంభించినప్పుడల్లా, మీ చుట్టూ ఉన్న ప్రతిదీ, ప్రతి ఒక్కరినీ చూస్తూ నా విద్య, నా వృత్తిపరమైన అర్హతలు, నా సంపద , నా పాత్ర , ఇవన్నీ, వీటితో పాటు మరెన్నో నిజంగా నాది కాదని లోతుగా గ్రహించండి. ఎందుకంటే మొదట మీరు శాంతి, ప్రేమ మరియు ఆనందంతో నిండిన భౌతికం కాని జీవి. ఈ మొత్తం భౌతిక వస్తువులు, వ్యక్తులు, సన్నిహిత సంబంధాలు మరియు మిగతావన్నీ, మీ భౌతిక శరీరం కూడా మీరు తర్వాత సంపాదించినవే. భౌతికం కానిది భౌతికాన్ని నియంత్రించి నడిపిస్తుంది. భౌతికం కానిది శాశ్వతమైనది మరియు భౌతికమైనది ఈ జీవితకాలానికే పరిమితం.

ఆనందం మనం వెతుకుతున్న ప్రాథమిక గుణం. అలాగే, శాంతి మరియు ప్రేమ కోసం చూస్తున్నాము. మీ బుద్ధి భౌతికం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నంత కాలం, ఈ మూడు ఎమోషన్స్ ను మీరు ఎప్పటికీ శాశ్వతంగా అనుభవం చేసుకోలేరు. అవి కేవలం వస్తూ పోతూ ఉంటాయి. ఎందుకంటే భౌతికమైన ప్రతిదీ తాత్కాలికమైనది మరియు మార్చదగినది. మీ సంబంధాలు ఒక రోజు బాగానే ఉంటాయి, మరొక రోజు సహకారం లేనందువల్ల మీపై ప్రేమ తగ్గినట్లుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు, కార్యాలయంలో ప్రతిదీ సజావుగా సాగుతుంది మరి కొన్నిసార్లు అసంపూర్తిగా ఉన్న పనులు, గడువుల ఒత్తిడి ఉంటుంది, ఇవి మిమ్మల్ని అశాంతిగా చేస్తాయి. అలాగే, కొన్ని సమయాల్లో మీ భౌతిక దుస్తులు అనగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కానీ అకస్మాత్తుగా ఏదో అనారోగ్యం తలెత్తి మీ ఆంతరిక  సంతృప్తిని, ఆరోగ్యాన్ని కోల్పోతారు. కాబట్టి, జీవితం మలుపులతో ఉంటుంది. మీ ధ్యాస మీ ఆత్మిక స్థితిపై కేంద్రీకరించబడినప్పుడు, మీరు ఎల్లప్పుడూ శాంతియుతంగా, ప్రేమగా మరియు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మీ శాంతి, ప్రేమ మరియు సంతోషాల పునాది శాశ్వతమైనది మరియు మారనిది. అదే విధంగా, మీ అస్తిత్వానికి ఆధారమైన శాశ్వతమైన అంతరంగాన్ని చూడటం ద్వారా, మీరు బయట పరిస్థితులచే ప్రభావితం అవ్వరు. అవి వచ్చి వెళ్ళినా మీరు స్థిరంగా ఉంటారు, ఎందుకంటే మీరు శాంతి, ప్రేమ మరియు ఆనందానికి మూలం మరియు మీరు మీ జీవితంలోని ప్రతి పరిస్థితిని వాటితో నింపుతారు. పరిస్థితులు ఇకపై వాటి ఆధారం కావు మరియు మీరు శాంతి, ప్రేమ మరియు సంతోషంతో నిండి ఉండటానికి వాటిపై ఆధారపడరు.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »