HI

చక్కని బంధాలు – విజయానికి బాటలు (పార్ట్ 2)

చక్కని బంధాలు – విజయానికి బాటలు (పార్ట్ 2)

  1. మీ గురించి పాజిటివ్ ఆలోచనలను చేయడంతో పాటు మీ బంధాన్ని మరింత అందంగా, బలంగా చేసే చాలా ముఖ్యమైన సుగుణము – ఇతరులను గౌరవించడము. ఈ రోజుల్లో ఎందుకు ఇతరులను మనస్ఫూర్తిగా గౌరవించడం లేదు? ఒకవేళ గౌరవం ఉన్నాగానీ అది ఎప్పటికీ ఎందుకు నిలవడం లేదు? వ్యక్తుల మధ్య అహంకారం ఎంత పెరిగిపోయిందంటే ఒక చిన్న నెగిటివ్ పరిస్థితి వచ్చి ఆ ఇద్దరూ ఇప్పటివరకు ఇచ్చిపుచ్చుకున్న గౌరవాన్ని మొత్తం మర్చిపోయేలా చేస్తుంది. ఈరోజు బాగా గౌరవించుకుంటున్న  ఇద్దరు వ్యక్తులు ఒకట్రెండు సంవత్సారల తర్వాత కనీసం చూసుకోవడం కూడా లేదు, ఎందుకిలా? ఈ బంధాలలో కొరవడింది ఏమిటి? ఇతరులను గౌరవించడం, వారి సంస్కారాలు, వారి అభిరుచులు, వారి అభిప్రాయాలు, వారి జీవనశైలి, వారి పనితీరును గౌరవించడం, తన గురించే ఆలోచించకుండా ఉండే అలవాటు సంబంధాలను సఖ్యతతో ఉండేలా, కలకాలం నిలిచి ఉండేలా చేస్తాయి. గుర్తుంచుకోండి – తనను తాను గౌరవించుకున్న వ్యక్తి, ఆత్మ గౌరవంతో మసులుకునే వ్యక్తే ఇతరులకూ గౌరవాన్ని ఇవ్వగలడు. చక్కని బంధానికి ప్రతి రోజూ మంచి ఆలోచనను చేయడము మొదటి మెట్టు – నేను ఈ ప్రపంచంలో ప్రత్యేకమైన మరియు విశేషమైన వాడిని, ఇతరులు కూడా విశేషమైనవారు. నన్ను నేను గౌరవించుకుంటున్నాను, ఇతరులనూ గౌరవిస్తున్నాను. ఇతరులు వారిలా ఉండేందుకు నేను వారికి తగిన వెసులుబాటును ఇస్తాను. ఇదే నిజమైన గౌరవం.
  2. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి ఉన్న మంచి సుగుణము – ప్రేమ. మనకున్న బంధాలలోనే మనం ఈ ప్రేమను ఇచ్చిపుచ్చుకంటాం. ఒక్కోసారి కొందరి ప్రేమ షరతులతో కూడినదై, స్వార్థ కోరికలతో ఉంటుంది. వారి కోరికలు నెరవేరేవరకు వారు ఆ బంధాలతో చక్కగా, ప్రేమగా వ్యవహరిస్తారు. ఇతరుల వలన వారి ఆశలు నెరవేరవు అని తెలిసిన మరుక్షణం వారిపట్ల పగ, వైరం పెరుగుతాయి. ఇది అసత్యమైన ప్రేమ. కనుక, పాజిటివ్ బంధాలకు, కలకాలం నిలిచే బంధాలకు బేషరతుతో కూడిన ప్రేమ ముఖ్యమైన విధానము. ఈ విధంగా ప్రేమను పంచడం వలన ఇతరులతో ఉన్న విభేదాలు సమసిపోయి కలసిమెలసి ఉండటం సాధ్యపడుతుంది. 

(రేపు కొనసాగుతుంది…) 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th feb 2024 soul sustenance telugu

వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మనకు హాని చేయరు

వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మనల్ని బాధపెట్టాలని అనుకోరు. వారి స్వభావం మరియు అలవాట్ల ద్వారా వారు ఆ  ప్రవర్తన కలిగి ఉంటారు. కొన్నిసార్లు, ఇతరులు ద్రోహం చేయవచ్చు, అబద్ధం చెప్పవచ్చు, తిరస్కరించవచ్చు లేదా విస్మరించవచ్చు, అది

Read More »
23rd feb 2024 soul sustenance telugu

క్షమించే ప్రపంచాన్ని తయారు చేద్దాం (పార్ట్ 4)

సత్యత యొక్క శక్తి లేకుండా క్షమించే ప్రపంచం సృష్టించబడదు. శాంతి మరియు ప్రేమ మన భావోద్వేగాలను మార్చినప్పటికీ, బలమైన ఆత్మగౌరవం లేకుండా మనకు అన్యాయం చేసిన వ్యక్తిని మనం క్షమించలేము లేదా వారిపై కోపం

Read More »
22nd feb 2024 soul sustenance telugu

క్షమించే ప్రపంచాన్ని తయారు చేద్దాం (పార్ట్ 3)

కోపాగ్ని ఉన్న ఇంటిలో నీటి కుండలు కూడా ఎండిపోతాయని భారతదేశంలో ఒక సామెత ఉంది. కోపం మానవ స్పృహలో ఉన్న చాలా కోరికల యొక్క సేకరణ కారణంగా మనల్ని క్షమించనివ్వకుండా నిరోధించడానికి ఇవ్వబడిన పేరు.

Read More »