20th Jan Soul Sustenance - Telugu

పరిష్కారాల గురించి మాత్రమే ఆలోచించండి మరియు మాట్లాడండి

కొన్నిసార్లు పరిస్థితులు సవాలుగా లేదా వ్యక్తులను మేనేజ్ చేయడం కష్టంగా ఉన్న సమయాలను మనం ఎదుర్కొంటాము. మనము సమస్యపై దృష్టి పెడితే, మనం కలత చెందుతాము, చింతిస్తాము, భయపడతాము, నిందలు వేస్తాము మరియు ఫిర్యాదు చేస్తాము. ఇవన్నీ మన శక్తిని క్షీణింపజేస్తాయి మరియు క్షీణించిన స్థితిలో, మన సమస్య మరింత పెద్దదిగా కనిపిస్తుంది. మనం మన శక్తిని ఆదా చేసుకొని పరిష్కారాలపై దృష్టి పెట్టాలి. మీరు తరచుగా మీ సమస్యల గురించి పరిష్కారాల కంటే ఎక్కువగా మాట్లాడుతున్నారా మరియు నెగెటివ్ భావాలతో ఉంటున్నారా? కఠిన సమయంలో మీరు అసలు ఎవరు బాధ్యులు? ఎందుకు జరిగింది,? నాకే ఇలా ఎందుకు జరిగింది? అని ఆలోచించడం, చర్చించడం చేస్తారా ? లేదా ఇప్పుడు ఏమి చేయాలనే దానిపై దృష్టి పెడుతూ ఇతరులకు కూడా చేయాల్సిన వాటిపైన ఆలోచింప చేస్తారా? మన పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా, దానిని పరిష్కరించటం ఒక్కటే ముఖ్యమైనది . విపరీతమైన ప్రశ్నలతో మనస్సును లోడ్ చేయడం వల్ల సమయం వృధా కావాటమే కాక మన శక్తి కూడా క్షీణిస్తుంది. నిందలు వేయడం , స్వయాన్ని బాధితుడుగా భావించడం, పరిస్థితిని విమర్శించడం లేదా తిరస్కరించడం వంటి ఆలోచనలు మనస్సు నుంచి మనం దూరం చేయాలి. ఈ ఆలోచనలు మనల్ని మరియు ఇతరులను క్షీణింపజేస్తాయి మరియు పరిస్థితిని ఇంకా దిగజారుస్తాయి. సమస్య మరింత పెద్దదిగా కనిపిస్తుంది. కనుక వెంటనే చేయాల్సింది సమస్య యొక్క వివరాలలోకి వెళ్ళడం కాదు పరిష్కారానికి మార్గాలు వెతకడం. ఇది ఇప్పటికే జరిగిపోయింది కాబట్టి సమస్యను అంగీకరించి వర్తమానం పై దృష్టి పెట్టాలి. మన ప్రతి ఆలోచనను పరిష్కారాన్ని వెతకడానికి మరియు దానిని అమలు చేయడానికి ఉపయోగిద్దాం. మీ బాధ్యతను గుర్తుంచుకుంటూ ప్రతి ఒక్కరూ కలిసి సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టడానికి సహకరించండి.

ఈ రోజు నుండి మీరు కఠిన పరిస్థితులలో లేదా కష్టమైన వ్యక్తితో ఉన్నప్పుడు, మీ జీవితం పర్ఫెక్ట్ గా ఉందని మరియు ప్రతి సన్నివేశం కళ్యాణకారి అని మీకు మీరు చెప్పుకోండి . సమస్య పెద్దదైనా చిన్నదైనా, సమస్య వచ్చినప్పుడల్లా మీ శక్తిని పరిష్కారాల వైపు మళ్లించండి. ఆ పరిస్థితిని, వ్యక్తిని అంగీకరించండి. సన్నివేశాలు లేదా ప్రవర్తనలను ప్రశ్నించడంలో మీ శక్తిని వృధా చేసుకోకండి. ఇది ఆ వ్యక్తుల సంస్కారమని తెలుసుకోండి, ఇది మీ పూర్వ కర్మఫలం అని తెలుసుకోండి, మీ విధిలో ఈ సన్నివేశాన్ని మీరే వ్రాసుకున్నారు . మీపై, మీ కర్మలపై , మీ ప్రవర్తనపై దృష్టి పెట్టండి. మీ లక్ష్యాలపై, తరువాత చేయాల్సిన వాటి పై దృష్టి పెట్టండి మరియు మీ శక్తిని వర్తమానంలో ఉండడానికి ఉపయోగించండి. వర్తమానంలోనే మీ శక్తి ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. పరిష్కారంపై దృష్టి పెట్టండి, పరిష్కారం గురించి ఆలోచించండి, పరిష్కారం గురించి మాట్లాడండి మరియు పరిష్కారాన్ని రూపొందించండి. చివరగా పరిష్కారాన్ని అమలు చేసి పరిస్థితిని దాటండి. దీనినే పరిష్కారం-ఆధారితమైనది విధానం అని అంటారు. ఇదే పాజిటివిటీ , ఆనందం మరియు స్థిరత్వానికి తాళం చెవి .

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

6th Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మానసిక భారాలు మరియు ఒత్తిళ్ళను అధిగమించుట (పార్ట్ 3)

ఒక్కోసారి, మనమున్న వర్తమాన పరిస్థితికి సంబంధించిన ఒత్తిడి మనకు ఉంటుంది, మరి కొన్ని సార్లు ఒక పరిస్థితిలోని ఒత్తిడిని మరో పరిస్థితిలోకి తీసుకు వెళ్తుంటాం అంటే ఇది అసంబద్ధ ఒత్తిడి. ఇలా రోజంతా జరుగుతూనే

Read More »
5th Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మానసిక భారాలు మరియు ఒత్తిళ్ళను అధిగమించుట (పార్ట్ 2)

బాహ్య ఒత్తిళ్ళు లేనప్పుడే మనం స్వేచ్ఛగా ఉండగలమా? ఒత్తిడి రకరకాలుగా ఉంటుంది. పనిలో చూసుకుంటే, నిర్థారిత మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత సమయంలో పని చేయాలని, ఇతరుల అంచనాలకు అనుగుణంగా పని చేయాలని, సహోద్యోగుల పనితీరుకు

Read More »
4th Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మానసిక భారాలు మరియు ఒత్తిళ్ళను అధిగమించుట (పార్ట్ 1)

ఆధ్యాత్మిక స్థాయిలో, భారం (ప్రెషర్) అంటే మనపై పని చేసే బాహ్య శక్తిని, దానిని భరించగల లేక ఎదిరించగల మన సామర్థ్యంతో విభాగిస్తే వచ్చేదే భారం. అందువలన, శక్తి మరియు ఎదిరించగల సామర్థ్యం ఒత్తిడి

Read More »