పాజిటివ్ జీవనం కోసం 10 కొత్త నమ్మకాలు (పార్ట్ 4)

పాజిటివ్ జీవనం కోసం 10 కొత్త నమ్మకాలు (పార్ట్ 4)

నమ్మకం 6 – జీవితం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. కాబట్టి మన జీవితంలో అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు సంతోషించడం మరియు నెగెటివ్ పరిస్థితులు ఉన్నప్పుడు సంతోషంగా ఉండక ఒత్తిడికి గురికావడం సరి అయినది.

నిజం – మన జీవితంలో నిత్యం పరిస్థితులు భిన్నంగా ఉంటాయి, ప్రతిరోజూ ఏదో ఒకటి అపసవ్యంగా ఉంటాయి. దాని కారణంగా మనము స్థిరత్వం మరియు అస్థిరతం లోకి వస్తూ ఉంటాము. మన జీవితంలోని పరిస్థితులన్నీ భగవంతుడు ఇచ్చినవేనని, భగవంతుడే మనకు సుఖాన్ని, దుఃఖాన్ని ఇస్తున్నాడని కూడా కొన్నిసార్లు అనుకుంటాం. కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం, మన జీవితంలో జరిగేవి మనం వర్తమానంలో మరియు మన పూర్వ జన్మల కర్మల ఆధారంగా జరుగుతాయి. ఇందులో భగవంతునికి ఎటువంటి పాత్ర లేదు మరియు వారు ప్రతి ఒక్కరి పరిస్థితులను సృష్టించడం లేదు. భగవంతుడు ఏ కర్మలు మంచివి మరియు ఏవి  చెడ్డవి అనే జ్ఞానాన్ని మనకు బోధించడానికి మాత్రమే  ఉన్నారు. మనం ఈ జ్ఞానాన్ని మన జీవితంలో ఎంత ఎక్కువగా ఉపయోగించి సరిగ్గా అనుసరిస్తే, మనం లోలోపల అంత  సంతోషంగా ఉంటాము. కొన్ని నెగెటివ్ పరిస్థితులు ఉన్నప్పటికీ, మనం ఒత్తిడికి గురికాకుండా, మన పాజిటివీటితో ఆ పరిస్థితులను పాజిటివ్ గా  మార్చుకుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండవచ్చు.

నమ్మకం 7 – ఇతరుల గురించి గాసిప్ చేయడం సామాజిక బంధాన్ని పెంచి మనకు ఆనందాన్ని ఇస్తుంది.

నిజం – గాసిపింగ్ అనేది ఇతర వ్యక్తుల బలహీనతలు, వారి పనులపై దృష్టి పెట్టడం. మన దృష్టి ఎక్కడ  పెడతామో, అక్కడకి శక్తి ప్రవహిస్తుంది అని చెప్పబడింది. మనం మన దృష్టిని, శక్తిని ఇతరులపై ఎంత ఎక్కువగా కేంద్రీకరిస్తామో, అంతగా మన పాజిటివ్ శక్తి తగ్గి మన క్రియేటివిటీ మరియు నైపుణ్యాలు నెగెటివ్ గా ప్రభావితమవుతాయి. ఇతరుల గురించి వారి వెనుక మాట్లాడటం, వారికి నెగెటివ్ ఎనర్జీని పంపుతుంది, సంబంధాల యొక్క పాజిటివిటీ మరియు మంచితనాన్ని దెబ్బతీసి సంతోషానికి దూరం చేస్తుంది.

నమ్మకం 8 – అసూయ మన పనిని మరింత మెరుగ్గా చేయడానికి మరియు మరింత సాధించడానికి ప్రేరేపిస్తుంది.

నిజం – మనమందరం మన ప్రత్యేకతలు, విశేష గుణాలను కలిగి ఉన్నాం. మనం జీవితంలో ముందుకు సాగాలంటే, మన గుణాలు మరియు ప్రత్యేకతలను అర్థం చేసుకొని, వాటిని జీవితంలోని ప్రతి రంగంలో ఉపయోగించి ముందుకు సాగాలి. మనం వాటిని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తామో, అవి మరింతగా పెరుగుతాయి. మన చుట్టూ ఉన్న వారికి ఉపయోగపడడమే కాకుండా అడుగడుగునా విజయాన్ని పొందడంలో మనకు సహాయపడతాయి. మనం అసూయతో ఇతరుల ప్రత్యేకతలు మరియు విజయాలపై దృష్టి పెడితే, మనం ఎప్పటికీ ముందుకు సాగలేము, పైగా మరోవైపు ఆంతరికంగా ఖాళి అయిపోతాము.

 (రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »