కోపాన్ని అధిగమించడం – విజయానికి 5 మెట్లు (పార్ట్ 2)

కోపాన్ని అధిగమించడం – విజయానికి 5 మెట్లు (పార్ట్ 2)

  1. నేను అనంతమైన శాంతి మరియు ప్రేమకు ఆధారం అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి – మనందరం శాంతి మరియు ప్రేమ యొక్క ఆధారమూర్తులం, ఈ గుణాలను మనం ఎల్లవేళలా అనుభూతి చెందుతూ ఇతరులతో పంచుకోగలము. అలాగే, శాంతి మరియు ప్రేమ ఉన్నచోట, వివిధ రకాల వ్యక్తులను మరియు పరిస్థితులను సహించే శక్తి మనలో ఉంటుంది, ఇది కఠినంగా ప్రతిస్పందించడానికి బదులుగా ప్రశాంతంగా మరియు ఓపికగా ఉండడాన్ని సులభతరం చేస్తుంది. ఒకరిని ద్వేషించడం మరియు వారి వెనుక మాట్లాడటం లేదా వారికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది మనలో శాంతి మరియు ప్రేమ లేకపోవడాన్ని ప్రతిబింబిస్తుంది. నిజానికి మనం అపారమైన శాంతి మరియు ప్రేమతో నిండిన వారమని మనం మరచిపోతాము. ఈ క్రింది సంకల్పాలతో మీ రోజును ప్రారంభించండి: నేను శాంతి మరియు ప్రేమ గల చైతన్య జ్యోతిని. .. నేను ఆత్మను ..  నేను నా ఆత్మిక రూపాన్ని, నుదిటి మధ్యలో మెరిసే నక్షత్రాన్ని విజువలైజ్  చేస్తున్నాను.. నేను ఈ శాంతి కిరణాలను ఈ ప్రపంచానికి ప్రసారింపచేస్తున్నాను.. ఈ సంకల్పాలను రోజులో చాలాసార్లు రిపీట్ చేసుకోండి మరియు నెమ్మదిగా కోపం మరియు కఠినంగా ప్రతిస్పందించే వ్యక్తిత్వం మధురంగా మరియు వినయపూర్వకమైన ప్రతిస్పందనలుగా మార్పు చెందుతుంది.  
  2. క్షమించండి మరియు మరచిపోండి – మీరు ఎప్పుడైనా మరొక వ్యక్తి యొక్క నెగెటివ్ చర్యల గురించి ఆలోచిస్తూ, మీ మనస్సులో వారికి వివిధ రూపాలను ఇస్తూ  పూర్తి రోజును గడిపారా, ఇవన్నీ నెగెటివ్ అయినవి మాత్రమే కాకుండా ఆంతరికంగా మిమ్మల్ని బాధపెట్టేవి. మీ హృదయంలో ఉన్న అలాంటి గాయం అడుగడుగునా కోపాన్ని కలిగించి మీ మనస్సును హింసాత్మకంగా మారుస్తుంది. ఈ రకమైన కోపం విభిన్న పరిస్థితులలో కేవలం కోపానికి కారణమైన వ్యక్తి నే కాక మీపై  మరియు ఇతర వ్యక్తులపై  ప్రవహిస్తుంది. క్షమించడానికి మరియు మరచిపోవడానికి ఆంతరిక శక్తి అవసరం. కోపంతో స్పందించకుండా ప్రేమతో స్పందించడమే క్షమించడం. క్షమించడం అంటే బేషరతుగా ప్రేమించడం. మరచిపోవడమంటే స్వయానికి లాభం చేకూర్చడమే, ఎందుకంటే మరచిపోకపోవడం వల్ల మనసులో జరిగే హింస మనసుకు, శరీరానికి, సంబంధాలకు విపరీతంగా హాని కలిగిస్తుంది. మీరు క్షమించినప్పుడే, మీరు మరచిపోగలరు. క్షమించడానికి ప్రతి ఒక్కరి నిజమైన స్వరూపం మధురత , శాంతి మరియు ప్రేమ అని గుర్తుంచుకొని, ఎవరైనా నెగెటివ్  వ్యాఖ్య లేదా తప్పుడు చర్య చేసినపుడు ఆ నెగెటివ్ సంస్కారం తాత్కాలికమైనది అని గుర్తుంచుకోవడం. ఆ వ్యక్తి దానిని తొలగించకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని గుర్తుంచుకోండి.

 (రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »