Hin

20th march soul sustenance telugu

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (భాగము 1)

రోజంతా మనం చేసే పనులు సుసాధ్యమవ్వడానికి రెండు విషయాలు దోహదపడతాయి – ఆత్మ మరియు పాత్ర. ఆత్మ యజమానిగా అయ్యి అది పోషించే పాత్రను అభినయిస్తుంది, ఆత్మ లేనిదే ఆత్మ పోషిందే పాత్రే లేదు అన్నది ఆధ్యాత్మిక వాస్తవమైనాగానీ మనం దైనందిన జీవితంలో పనులు చేసేటప్పుడు ఈ సత్యాన్ని విస్మరిస్తుంటాము. మన పూర్తి శ్రద్ధ మనం పోషించే పాత్రపైనే ఉంటుంది. కేవలం పాత్ర స్మృతిలో ఉండి చేసే పనుల వలన మన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విజయాల సంఖ్య తగ్గవచ్చు అన్న సత్యాన్ని మనం మర్చిపోతున్నాము. నేను ఆత్మను, వివిధ పాత్రలను పోషిస్తున్నాను అన్న సానుకూల సంకల్పం పాత్రలో ఆత్మ శక్తిని నింపి పాత్ర శక్తిని పెంచుతుంది. ఆత్మ మరియు పాత్ర మధ్యన చక్కని సమతుల్యతను పాటించాలి అలాగే ఆత్మ శక్తి మరియు పాత్ర శక్తిని కూడా సమపాళ్ళలో ఉపయోగించడం వలన మనం చేసే పాత్రలలో విజయం లభిస్తుంది. ఆ పాత్ర ఎలాంటిదైనా కావచ్చు. ఆఫీసులో నెలపాటు మీరు చూసుకోవలసిన ప్రాజెక్టు మీకు ఒక పాత్ర. ఇటువంటి పాత్రల ఉదాహరణలు చాలా ఉన్నాయి –  మీ పిల్లలతో హోమ్‌వర్కును చేయించడము, కుటుంబానికి భోజనాన్ని వండటము, దానధర్మాలు చేయడము, మీ చదువును పూర్తి చేయడము, మంచి డిగ్రీని సాధించడము, స్కూలు లేదా కాలేజీలో ఇతర కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడము, మంచి ఆహారాన్ని తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని చక్కగా పెట్టుకోవడము, వ్యాయామము చేయడము, మంచి నిద్ర మొదలైనవి.

ఇటువంటి ఏ పాత్రనైనా పోషించేటప్పుడు ఇందులోని అన్నీ అయినా లేక కొన్ని అయినా అందులో ఉండవచ్చు – భౌతిక శరీరము, వివిధ పనులు, వ్యక్తులతో కలవడము, కలిసి పని చేయడము, సమాచార సాధనాలు, సంపద, టెక్నాలజీ మరియు ఇతర సాధనాలు, సమయము, మీ పాత్రకు సంబంధించిన పూర్తి అవగాహన మొదలైనవి. ఇవన్నీ భౌతికమైనవి, ఇవన్నీ కలిసి పాత్రను తయారు చేస్తాయి. ఇక్కడ ఏమి జరుగుతుందంటే, పాత్రలోకి దిగిన వెంటనే మనం చేసే పనిలో విజయాన్ని సాధించాలన్న తపనతో మనం పాత్రలో మునిగిపోతుంటాము. ఆ విజయాన్ని సాధించడానికి మన పూర్తి శ్రద్ధ పాత్ర శక్తిని వినియోగించడంలోనే సరిపోతుంది, అపారమైన ఆత్మ శక్తిని మర్చిపోతున్నాము. పైన తెలపబడ్డ అనేక పాత్రలను పూర్తి చేయడానికి, పాత్రను చక్కగా పోషించడానికి తలమునకలవుతుంటాము. కానీ ఆత్మ శక్తిపై కూడా శ్రద్ధ పెడితే ఇదంతా మరింత సులభంగా సాధించవచ్చు అన్న విషయాన్ని మర్చిపోతున్నాము. పాత్ర శక్తిని తక్కువ అంచనా వేయకుండా ఆత్మ శక్తిని, పాత్ర శక్తిని సమపాళ్ళలో ఉపయోగించాలి లేకపోతే లక్ష్యాన్ని సాధించడం కష్టతరమవుతుంది.

రాబోవు రెండు రోజుల సందేశంలో , ఆత్మ శక్తికి దోహదపడే వివిధ అంశాలను వివరిస్తాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

18th july 2025 soul sustenance telugu

స్వీయ సందేహం మరియు అభద్రతలను అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆనందాన్ని క్షీణింపజేసి, మనకు నిరాశ కలిగించే ఒక భావోద్వేగం – అభద్రత. మన గురించి, మన సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థికం

Read More »
17th july 2025 soul sustenance telugu

ఇదే సరైన సమయం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మీరనుకున్న మార్పును తీసుకురావడానికి లేదా అసంపూర్ణంగా ఉన్న పనిని పూర్తి చేయడానికి ఏది సరైన సమయం? నేను నూతన సంవత్సరంలో ప్రారంభిస్తాను…

Read More »
16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »