వ్యక్తులను నిజాయితీగా మరియు ఉదారంగా ప్రశంసించటం

వ్యక్తులను నిజాయితీగా మరియు ఉదారంగా ప్రశంసించటం

మన చుట్టూ ఉన్న వ్యక్తులు వారు చేస్తున్న దానికి ఇప్పుడు పొందుతున్న దాని కంటే కొంచెం ఎక్కువ ప్రశంసలు కోరుకుంటారు.  గుర్తింపు వ్యక్తుల ప్రేరణ మరియు సామర్థ్యాన్ని  పెంచడంలో  అద్భుతాలు చేస్తుంది. అయినప్పటికీ ప్రశంసల యొక్క మహత్వాన్ని మనం గుర్తించము.  మన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో ఇతరులను ప్రశంసించడాన్ని మనం తరచుగా పట్టించుకోము. మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను నిశితంగా పరిశీలిస్తే, మీకు ఎంతో మంచిగా సపోర్ట్ ఇచ్చే  అద్భుతమైన వ్యక్తులు పుష్కలంగా ఉంటారు. వారు తమ ప్రేమలో నిస్వార్థంగా ఉంటారు, వారు పరిమితులను విస్తరించారు మరియు వివిధ స్థాయిలలో త్యాగాలు చేస్తున్నారు. మీరు వారిని అభినందించడానికి సమయాన్ని వెచ్చించారా? మనము ఎల్లప్పుడూ వ్యక్తులను వారు చేస్తున్న దానికి గుర్తించము. మనం వారి మంచితనానికి మరియు దయకు విలువనివ్వము. ఇంకా, ఇంట్లో లేదా కార్యాలయంలో మన జీవితాన్ని మెరుగుపరచడానికి వారి శ్రమను మనం పట్టించుకోము. వారు ఫిర్యాదు చేయనప్పటికీ, మనం ముందుకు వచ్చి మాట్లాడాలి. వెన్ను తట్టడం లేదా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పడం ఎవరికి ఇష్టం ఉండదు? ప్రతిఒక్కరూ తాము చేయగలిగినంత ఉత్తమంగా చేస్తున్నారని అంగీకరిద్దాం. వారికి క్రెడిట్ ఇవ్వకుండా ఆగిపోయే మన సంకోచం లేదా అజ్ఞానాన్ని అధిగమించే సమయం ఇది. ఇతరుల పట్ల మన ప్రశంసల శక్తిని తక్కువగా అంచనా వేయబడుతుంది. ఈరోజు కొన్ని సెకన్లు ఎవరైనా ఒకరిని ప్రశంసించడానికి సమయాన్ని వెచ్చించండి. అది మీ ఇరువురి రోజుని మార్చే తీరును చూడండి.

 

ఈ రోజు నుండి, ప్రతిరోజూ వ్యక్తులను అభినందిస్తూ శక్తివంతం చేయడం మరియు వారిలో గొప్పతనాన్ని ప్రేరేపించడం ప్రారంభించండి. ప్రతి ఒక్కరూ సుందర గుణాలు కలిగిన వారని  గుర్తించండి. వారు చేస్తున్న దానికి కాకుండా వారు ఎవరో గమనించి అభినందించండి. వారి మంచితనం గురించి ఆలోచిస్తూ  కేవలం  మనసులో  కృతజ్ఞతా భావాన్ని చూపించడమే కాక  దానిని మీ మాటలు మరియు చర్యలలో వ్యక్తపరచండి. వారికి కృతజ్ఞత చెప్పే సందర్భం కోసం వేచి ఉండకండి, వాయిదా వేయకండి. నిజమైన ధన్యవాదాలు చెప్పడానికి వెంటనే సమయాన్ని వెచ్చించండి. మీ దయ మరియు ప్రేమ వ్యక్తులకు ఓదార్పునిచ్చి ప్రేరేపించేలా చేస్తుంది. ఇది మీ జీవితాలలో మరియు వారి జీవితాలలో ఉన్నతిని కలిగిస్తుంది. మీ కుటుంబo బేషరతుగా మీకు అండగా ఉన్నందుకు, మీకు మద్దతునిచ్చే మీ స్నేహితులను, మీ పనిలో మీకు  సహకరించే మీ సహోద్యోగులు మరియు అనేక నైపుణ్యాలను అందించి, వారి ఉత్తమమైన సేవలను అందిస్తున్నందుకు అభినందించండి. యాదృచ్ఛికంగా మీకు సహకరించే అపరిచితులను కూడా అభినందించండి. మీరు వారికి పొగడ్తలను ప్రసరిస్తున్నప్పుడు మంచి వైబ్రేషన్‌లను మీరూ అనుభూతి చెందండి. మీరు వ్యక్తులను ఎంతగా అభినందిస్తున్నారో, మీరు అభినందించడానికి మరిన్ని కారణాలను కనుగొంటారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »