21stapril soul sustenance telugu

మనం మానవ యంత్రాలము కాదు, మానవ జీవులం (పార్ట్ 3 )

మీరు చేసే ప్రతి పని మీ నిజమైన ఆధ్యాత్మిక స్వయంపై ఆధారపడినప్పుడే అంతర్గత ఆనందం మరియు సంతృప్తితో కూడిన జీవితం సాధ్యమవుతుంది. మీకు మీ పాఠశాలలో ఒక ముఖ్యమైన పరీక్ష ఉంటే  మీరు పూర్తి నిజాయితీ మరియు చిత్తశుద్ధితో దానికి చదువుతున్నారని అనుకుందాం. పరీక్ష ఇవ్వడం మీకు ఒక ముఖ్యమైన సవాలు, కానీ మీరు ఎంత కష్టపడినా మీరు పరీక్షలో రాణించకపోతే,  మనం సంతోషంగా ఉండము. కానీ ఇలాంటి బాహ్య పరిస్థితి పాజిటివ్ గా లేదా నెగిటివ్ గా ఉండవచ్చని మనం ఎప్పుడైనా ఆలోచించామా? మన మనస్సు యొక్క ఆలోచనలు, భావాలు మరియు భావోద్వేగాలను వాటిచే నియంత్రించబడటానికి మనం అనుమతిస్తాము. అలాగే, మీ జీవిత లక్ష్యం సంపదను సంపాదించడం, వివిధ రకాల పాత్రలు పోషించడం, మీ కుటుంబాన్ని మరియు పిల్లలను చూసుకోవడం,పరీక్షలలో రాణించడం మరియు మంచి డిగ్రీలు పొందడం మాత్రమే కాదని గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలోని ఏ వ్యక్తి జీవితంలోని ఈ విభిన్న రంగాలలో అన్ని సమయాలలో తను అనుకున్న విధంగా ప్రతిదీ జరగదు. కాబట్టి మనం అనుకున్న విధంగా జరిగే లేదా జరగని విషయాలపై ఆధారపడితే అలసిపోతాము మరియు సంతోషము ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. 

మన ఆలోచనలను పునర్నిర్వచించుకోవడం మరియు మన భావాలను మంచివిగా మార్చుకోవడం అనే ఉన్నతమైన ఉద్దేశ్యం మనకు ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్న మన చిన్న ప్రపంచమైన మన కుటుంబం, మన చుట్టూ ఉన్న కొంత పెద్ద ప్రపంచమైన మన పని స్థలం, తరువాత మరింత పెద్ద ప్రపంచమైన మన సమాజం, ఆపై మన దేశం ,  ఆపై పూర్తి ప్రపంచం మారడం ప్రారంభమవుతుంది. తినడం, తినిపించడం , సంపాదించడం, ఖర్చు చేయడం, ఉత్పత్తి చేయడం మరియు లాభం పొందడం  వంటి స్వల్పకాలిక ప్రయోజనాల కంటే ముందు పూర్తి మానవ జాతి ఉన్నతమైన ప్రయోజనాన్ని పొందినట్లయితే, మన వెలుపల ఉన్న ఇవన్నీ మరింత పరిపూర్ణంగా మరియు అందంతో నిండి ఉంటాయి. కాబట్టి, ఈ రోజు ఒక అడుగు ముందుకు వేసి, కర్మ చేసే  ముందు స్వయాన్ని ప్రేమించే ప్రత్యేక మానవులలా జీవించడం ప్రారంభించండి. ఇది మీ చుట్టూ శాంతి మరియు ప్రేమతో నిండిన సంతోషకరమైన చిన్న ప్రపంచాలను సృష్టిస్తుంది … ఈ     చిన్న  స్వర్గాలతో, ప్రపంచమంతా  ఒక అందమైన స్వర్గంగా మారుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »