చక్కని బంధాలు – విజయానికి బాటలు (పార్ట్ 3)

చక్కని బంధాలు – విజయానికి బాటలు (పార్ట్ 3)

  1. మనమందరం మన బంధాలు బలంగా, శాశ్వతంగా నిలిచి ఉండాలని కోరుకుంటాం. కానీ అందుకు మన వ్యక్తిత్వంలో మనం మార్పును తీసుకురావాలన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నాం. వ్యక్తులలో అహంకారం మరియు కోపం ఉంటే ఏ బంధమూ విజయవంతంగా నిలవబడలేదు, సమస్యలు లేకుండా ఉండలేదు. స్వయాన్ని మార్చుకుంటూ ఈ రెండు నెగిటివ్ అవగుణాలను తీసేస్తూ ఉంటే ప్రతి అడుగులో వ్యక్తులు దగ్గరవుతారు, మనసులు దగ్గరవుతాయి. మీరు ఇతర వ్యక్తికి ఎంత ప్రేమను పంచినాకానీ, అప్పుడప్పుడు, మీరు కోపం లేక అహాన్ని ప్రదర్శిస్తే మీరు ఇప్పటివరకు పంచిన ప్రేమకు విలువ ఉండదు. వ్యక్తులు తమ సన్నిహితులకు, ప్రియమైన వారికి బహుమతులను బహుకరిస్తారు, సెలవులకు బయటకు తీసుకువెళ్తారు, పార్టీలకు, హోటళ్ళకు తీసుకువెళ్తారు; పుట్టినరోజులను, పెళ్ళి రోజులను జరుపుతారు. కానీ ఇవన్నీ తాత్కాలికమే, ఇవి బంధానికి శాశ్వత సంతోషాన్ని ఇవ్వలేవు. ఒక వ్యక్తి ఇంటికి ఆలస్యంగా వచ్చి, ఫోను కూడా చేయకపోతే అప్పుడు ఇద్దరి మధ్యన గొడవలు వస్తాయి. ప్రేమ అంటే ఇద్దరి మధ్య ఉండే  పూర్తి నమ్మకం. నమ్మకం ఉన్న చోట ఆరోపణలు మరియు ప్రతి ఆరోపణలు ఉండవు. పండుగ సమయంలో బహుమతి ఇచ్చి ఇతర సమయాలలో మీరు వారితో తియ్యగా, మర్యాదగా మాట్లడకపోతే, అనుమానం ఉంటే ఆ బహుమతికి విలువెక్కడ ఉంటుంది?
  2. చివరగా, అతి ముఖ్యమైన విషయం, ఈరోజు అనేక బంధాలలో వ్యక్తులు ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని కేటాయించడం లేదు. పురుషులు మరియు స్త్రీల జీవితాల్లో ఉండే వృత్తిపరమైన లక్ష్యాలు మరియు ఇద్దరు వ్యక్తులకు ఉండే విభిన్న ప్రాధాన్యతలు కొన్నిసార్లు వ్యక్తులను దూరంగా ఉంచుతున్నాయి. కలిసి సమయాన్ని కేటాయించడం, సమస్యలను చర్చించుకోవడం, ఇతర కుటుంబ సభ్యుల యోగక్షేమాలను చర్చించడం, తర్వాత సమస్యను పరిష్కరించే దిశగా మాట్లాడుకోవడం… వీటివలన బంధాలు చక్కగా ఉంటాయి. కనుక, కలిసి ఉండేలా సమయాన్ని కేటాయించండి, భోజనం చేసే సమయం, సాయంకాల సమయాలు… ఇంటికి కేటాయించే సమయానికి మరియు ఆఫీసుకు కేటాయించే సమయానికి చక్కని సమతుల్యతను ఉంచండి. అలాగే ఒకరితో ఒకరు మాట్లాడుకునేలా చూసుకోవడము, కుటుంబంతో కలిసి ఉండటం, ఇటువంటివి చేసినప్పుడు బంధాలు కొనసాగడమే కాకుండా అందరూ సంతోషంగా  కూడా ఉంటారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »
23rd-sept-2023-soul-sustenance-telugu

మిమ్మల్ని మీరు నెగిటివ్ గా లేబుల్ చేసుకోకండి

అందరూ తమ వ్యక్తిత్వం మరియు అవగాహనల ఫిల్టర్ ద్వారా మనల్ని చూసినట్లే, మనం స్వయంపై పెట్టుకొనే కొన్ని లేబుల్‌ల ద్వారా కూడా మనల్ని మనం చూసుకుంటాము. నేను సోమరిని, నాకు అజాగ్రత్త ఉంది వంటి

Read More »