Hin

21th feb soul sustenance telugu

సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆహారం మరియు నీటిని శుద్ధి చేయడం

ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. ఇది సేంద్రీయ పద్ధతులు , పోషకాలు, పండ్లు మరియు కేలరీల గురించి మాత్రమే కాదు. మనం తినే ఆహారం మరియు త్రాగే నీరు వైబ్రేషన్స్ కలిగి ఉంటాయి, అవి తీసుకున్న వెంటనే మనలో భాగమవుతాయి. అవి మన ఆలోచనలు, మానసిక స్థితి మరియు సంస్కారాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. దైవిక భావాలతో భోజనాన్ని తయారు చేసి, భోజనాన్ని శక్తివంతం చేయడం, ఆ భోజనం మరియు మన యొక్క వైబ్రేషన్స్ ని పెంచుతుంది. మీరు పౌష్టికాహారం తింటున్నప్పటికీ, క్యాలరీలను గమనిస్తున్నప్పటికీ , జంక్ ఫుడ్ కు దూరంగా ఉన్నప్పటికీ , మీకు నిస్తేజంగా లేదా అలసటగా అనిపిస్తుందా? ఆహారం మరియు నీరు వాటి పరిసరాల నుండి వైబ్రేషన్స్ గ్రహిస్తాయని మీకు తెలుసా? ఆహారం యొక్క వైబ్రేషన్స్ దాని పోషక శక్తి వలె ముఖ్యమైనవి . మన ఆహారంలోని వైబ్రేషన్స్ మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. అధిక శక్తి గల ఆహారాన్ని ఎంచుకొని భోజనాన్ని ప్రశాంతమైన మానసిక స్థితితో తయారు చేయడం చాలా ముఖ్యం. మనం 30 సెకన్ల పాటు మెడిటేషన్ చేసి, కృతజ్ఞతా భావాన్ని సమర్పించి, భోజనం చేసే ముందు ఆహారాన్ని ఆశీర్వదిద్దాం. నేను సంతోషకరమైన జీవిని… నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి…అనే సంకల్పాన్ని చేద్దాం .
స్వచ్ఛమైన వాతావరణంలో మరియు శక్తివంతమైన మానసిక స్థితిలో తయారుచేసిన ఆహారాన్ని తినండి. ప్రతి భోజనానికి ముందు, అన్ని పరధ్యానాల నుండి వైదొలగండి, శాంతియుతంగా మరియు సంతోషంగా ఉండండి, ప్లేట్‌లో ఆహారం ఉన్నందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థన చేయండి, దానిని తయారు చేసి ప్రేమగా వడ్డించిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేయండి. మీ ఆలోచనలు మరియు వైబ్రేషన్స్ మీ ప్రతి భోజనం మరియు నీటిలో భాగమవుతాయి. వారు శక్తిని పొందుతారు. మీ శరీరానికి ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తినండి… రుచి కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆహారం మరియు నీటిని శక్తివంతం చేయడం అలవాటుగా మారిన తర్వాత, మీరు మంచి మానసిక ఆరోగ్యాన్ని అలాగే శారీరక ఆరోగ్యాన్ని పొందుతారు . భోజనం చేస్తున్నప్పుడు, ఆ 10 -15 నిమిషాలు భోజనంపై దృష్టి పెట్టండి, మౌనంగా తినండి, నెగెటివ్ సంభాషణలు, ఆహారం గురించి నెగెటివ్ మాటలు మాట్లాడవద్దు. ఆహారాన్ని గౌరవించండి మరియు దానితో మంచి సంబంధం కలిగి ఉండండి. ఈ విధంగా మీరు తినేవి మరియు త్రాగేవి సాత్వికంగా మారుతాయి. మీ ఆహారం ప్రసాదం అవుతుంది మరియు నీరు అమృతం అవుతుంది. మీ మనస్సు మరియు శరీరాన్ని నయం చేసి మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి .

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »