21st jan soul sustenance - telugu ss

కనిపించని జీవనాధారము (భాగం-1)

భౌతిక స్థాయిలో మన జీవితాలు, అడుగడుగునా, మనకు కనపడని ఆధ్యాత్మిక వ్యవస్థపై ఆధారపడి ఉంటాయి. శాంతి, ప్రేమ మరియు ఆనందం లేని జీవితాన్ని మీరు ఊహించగలరా? ఇవి మన ఆత్మ యొక్క నిజ గుణాలు. ఒకప్పుడు, ఒక చిన్న రాజ్యానికి చెందిన రాజుని, మీ రాజ్యం ఎంత సంపన్నంగా ఉంది ? అని ఒకరు ప్రశ్నించారు. ఆ రాజు తన రాజ్యంలో ఆరోగ్యం, సంపద, సంబంధాలు మరియు భాద్యతలు వంటి జీవితంలోని కోణాలను మరియు అవి ఎంతవరకు సంపన్నంగా ఉన్నాయో అని ఆలోచించాడు. మీ రాజ్యం ఎంత ఆరోగ్యంగా ఉంది ఆ వ్యక్తి అడిగాడు. అతను తన రాజ్యంలోని ప్రజలలో శారీరక ఆరోగ్యం మరియు అనారోగ్యాల పరిమాణం గురించి ఆలోచించి ఎక్కవ శాతం బాగున్నా కొంత బాగాలేదని సమాధానం చెప్పాడు. తరువాత రాజు తన రాజ్యం ఆర్థికంగా ఎంత బాగుందో ఆలోచించి, రాజ్యంలో కొద్దిగా పేదరికం ఉందని సమాధానం చెప్పాడు. రాజు సంబంధాలు బాంధవ్యాలు మరియు ఉద్యోగాలు గురించి కూడా ఆలోచించి సంబంధాలలో దుఃఖం ఉందని మరియు కొందరు తమ ఉద్యోగాలతో సంతృప్తిగా లేరని గ్రహించాడు. రాజు తన రాజ్యాన్ని ఆరోగ్యంగా, ధనవంతంగా మరియు అన్ని విధాలుగా సంతోషంగా మార్చడం చాలా కష్టమైన పని అని వెంటనే గ్రహించాడు, కానీ బాగుచేయడం ఎక్కడ నుంచి ప్రారంభించాలో తెలియలేదు.

రాజు మరియు అతని రాజ్యం వలె , ఆరోగ్యం, సంపద, సంబంధాలు మరియు ఉద్యోగాలు అన్నీ భౌతిక అంశాలే. కానీ వాటిలో ప్రతి ఒక్కటి సానుకూలంగా మరియు అడ్డంకులు లేకుండా ఉండడానికి, శాంతి, ప్రేమ, ఆనందం ఉండాలంటే ఆధ్యాత్మికత అనే కనిపించని ఆధారం కావాలి. మనల్ని మనం పాజిటివిటీ మరియు శక్తితో నింపడం ద్వారా మనందరం ఈ మూడు గుణాలతో ఎంతగా నిండిపోతామో, జీవితంలోని అంత విజయం పొందుతాము . మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మానసిక సంతుష్టత, భౌతిక సంపదను ఆకర్షిస్తుందని మనకు తెలుసు. అలాగే, మనస్సు యొక్క మంచితనం సంబంధాలను మెరుగు పరుస్తుంది మరియు మనసు యొక్క ఏకాగ్రత మరియు స్పష్టత మనల్ని సమస్యల నుండి విముక్తి చేస్తుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

కృతజ్ఞతా డైరీ రాయడం

5th Jun – జీవన విలువలు

కృతజ్ఞతా డైరీ రాయడం మనందరం మన జీవితంలో చాలా విజయాలతో ఆశీర్వదించబడ్డాము. ఈ విజయాలను కలిగి ఉన్నందుకు మనం సంతోషంగా ఉన్నాము. విశ్వం మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తులతో వారు మనల్ని ఆశీర్వదించినందుకు

Read More »
నిర్భయంగా మారడానికి 5 మార్గాలు

4th Jun – జీవన విలువలు

నిర్భయంగా మారడానికి 5 మార్గాలు ఆత్మగౌరవం యొక్క శక్తివంతమైన స్థితిలో ఉండండి – మన భయాలన్నింటినీ అధిగమించడానికి మొదటి మరియు అతి ముఖ్యమైన మార్గం మన ఆత్మిక ప్రాముఖ్యతను లోతుగా గ్రహించడం. జ్ఞానం, గుణాలు,

Read More »
మార్పులు మరియు కొత్త పరిస్థితులకు సిద్ధంగా ఉండండి

3rd Jun – జీవన విలువలు

మార్పులు మరియు కొత్త పరిస్థితులకు సిద్ధంగా ఉండండి జీవితంలో, మనం నియంత్రించగలిగేవి కొన్ని ఉంటాయి మరియు నియంత్రించలేనివి కొన్ని ఉంటాయి. అయినప్పటికీ, మన జీవితం ఎలా సాగాలి అనే దాని గురించి మనము అంచనాలను

Read More »