పాజిటివ్ జీవనం కోసం 10 కొత్త నమ్మకాలు (పార్ట్ 5)

పాజిటివ్ జీవనం కోసం 10 కొత్త నమ్మకాలు (పార్ట్ 5)

నమ్మకం 9 – అనేక సంపదలు, ఆస్తులు, ధన సంపద, మంచి శారీరక పర్సనాలిటీ, రూపం మరియు మంచి సంబంధాలు కలిగి ఉండటం శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది.

నిజం – సాధనాలు, ఆస్తులు మరియు సంపదను కూడబెట్టుకోవాలనే కోరిక నేటి ప్రపంచంలో సర్వ సాధారణం. శాశ్వత ఆనందాన్ని మరియు దీర్ఘకాల ప్రాప్తులను ఇచ్చే స్వయంపై దృష్టి తక్కువగా ఉంటుంది. మనం ఎన్నో  వస్తువులను కలిగి ఉండటాన్ని ఇష్టపడతాము. మనం షాపింగ్ చేసి అనేక అందమైన, విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయటం ఇష్టపడతాము. మనం తినడం, పార్టీలు, సినిమాలు చూడటం మరియు సోషల్ మీడియాలలో కూడా మునిగిపోతాము. ఇవన్నీ చేయడంలో, మనకు 5 కర్మేంద్రియాల – కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మములకు ఆనందాన్ని ఇస్తాయి కానీ అవి ఆత్మకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు. ఎందుకంటే కొన్నిసార్లు వీటిలో కొన్ని, సెకనులో మనల్ని విడిచిపెట్టవచ్చు,  మరియు వాటిని పొందలేనప్పుడు, మనం బాధపడి నిరాశకు గురవుతాము. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం ద్వారా ఆత్మ సంస్కారాలలో సంపన్నంగా,  మరింత అందంగా మారి శాశ్వతమైన ఆంతరిక ఆనందాన్ని పొందవచ్చు.  ఈ ఆనందం భౌతిక సంపదపై లేదా ఇంద్రియాలపై ఆధారపడనిది. అలాగే, నేడు ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని,  శారీరక పర్సనాలిటీని మరింత అందంగా, ఆకర్షణీయంగా మార్చుకోవడానికి పరుగులు తీస్తున్నారు. అందంగా క‌నిపించ‌డం త‌ప్పు కాన‌ప్పటికీ, ఆధ్యాత్మిక భావంతో, ఆధ్యాత్మిక సౌందర్యంతో ఉన్న కనెక్షన్ కోల్పోయి, సరళత మరియు స్వచ్ఛతతో మనల్ని మనం అందంగా మార్చుకోవడం మానేసే ప్రమాదం ఉంది. ఆంతరిక సౌందర్యం మనల్ని శారీరకంగా కూడా అందంగా కనిపించేలా చేస్తుంది. అలాగే, జీవితంలో మంచి సంబంధాలు అత్యంత ముఖ్యమైనవి. మంచి సంబంధాలు మానవుల మధ్య ప్రేమ, కేర్ మరియు సప్పోర్ట్ ఇచ్చిపుచ్చుకునేలా చేస్తాయి. కానీ, శాశ్వత ఆనందం కోసం మనం మానవ సంబంధాలపై ఆధారపడకూడదని మనం మరచిపోకూడదు, ఎందుకంటే కొన్నిసార్లు మనం ఆశించిన దానిని ఇతరుల నుండి పొందలేకపోతే మనల్ని నిస్సహాయంగా మరియు బలహీనంగా చేస్తుంది. కాబట్టి మనం మన మానవ సంబంధాలన్నింటినీ ఆనందిద్దాం, అయితే ముందుగా భగవంతునితో అందమైన మరియు సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుచుకుందాం. ఎందుకంటే భగవంతుడు మానవ వృక్షానికి బీజం,  మనం భగవంతున్ని ఎంతగా ప్రేమించి వారికి ఎంత దగ్గరగా ఉండి,  వారి ప్రేమతో మనం ఎంత నిండి ఉంటే, మనం ఇతరులను అంత ఎక్కువగా ప్రేమించి, వారి ప్రేమను కూడా పొందుతాము.

నమ్మకం 10 – ప్రకృతితో కనెక్ట్ అయ్యి దాని అందాన్ని ఆస్వాదిస్తే శాశ్వత శాంతి మరియు ఆనందాన్ని ఇస్తుంది.

నిజం – ప్రకృతి దాని స్వచ్ఛతతో ఆత్మకు ఆహ్లాదాన్ని మరియు విశ్రాంతిని ఇస్తుంది. కానీ ప్రకృతి నుండి లభించే శాంతి మరియు ఆనందం శాశ్వతం కాదు ఎందుకంటే మన వేగవంతమైన జీవితాలు మనల్ని అన్ని సమయాలలో ప్రకృతి మధ్య ఉండనివ్వవు. మనము ఆంతరికంగా మనతో మనం మరియు భగవంతునితో కనెక్ట్ అయినప్పుడు, శాశ్వత శాంతి మరియు ఆనందముతో నిండి ఉంటాము. ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడం మంచిది, అయితే జీవితంలోని ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించడానికి మరియు కఠిన  పరిస్థితుల మధ్య స్థిరంగా ఉండటానికి మనం మనతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »